వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కోడూరు సంతోషి మాతా
స్వరూపం
చర్చా ఫలితం: వ్యాసంలో ఉన్న సమాచారానికి ఆధారంగా ఇచ్చిన మూలాల్లో ఒకటి తన స్వంత పరిశోధన అని రాసిన నాలుగు ముక్కలు, రెండోది పనిచేయని లంకె. ఉన్న ఫోటో ఎక్కడిదో సంతోషి మాత బొమ్మ కామన్స్ లో 2011లో చేర్చినది. ప్రతిపాదించిన వాడుకరి నెలల పాటు వేచిచూసినా ఎవరూ ప్రతిపాదనపై స్పందించలేదు. నేను వెతికి చూస్తే ఈ పేరుమీద తెవికీ వ్యాసం నుంచి తప్ప మరే ఇతర అంతర్జాల ఫలితాలు రావట్లేదు. ఈ నేపథ్యంలో వ్యాసాన్ని తొలగించడం సముచితమని భావిస్తున్నాను, తొలగింపు అమలు చేస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 17:06, 14 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసానికి సరైన మూలాల్లేవు. అందుచేత ప్రస్తుత సమకాలీన విషయమైనప్పటికీ పుక్కిటి పురాణంలా ఉంది. ఇచ్చిన మూలాల్లో ఒకటి పనిచెయ్యడంలేదు. రెండో దాని పరిస్థితి తెలీదు. పైగా తానే మూలాన్నని ప్రధాన రచయిత చెప్పుకున్నారు. అది నమ్మదగ్గ మూలం కాదు. చదువరి (చర్చ • రచనలు) 00:50, 3 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]