వికీపీడియా చర్చ:తెవికీ వార్త
స్వరూపం
మార్చి 2018 నుంచి తెవికీ వార్త పున:ప్రారంభిద్దామా?
[మార్చు]తెవికీ వార్త గతంలో సంవత్సరన్నర పైగా కాలం విజయవంతంగా వాడుకరి:Arjunaraoc నడిపించారు. కొందరు వికీపీడియన్లతో మాటామంతీలు, కార్యక్రమాల నివేదికలు, పర్యటనల వివరాలు వంటివి అందజేశారు. ఇంత చక్కని ప్రయత్నాన్ని మరోసారి ప్రారంభించుకుందామన్న ఆలోచన వచ్చింది. ముందుగా ప్రతిపాదిస్తున్నాను. దీనికి నేను సంపాదకత్వం వహించి ముందుకు తీసుకుపోదలిచాను, సహసభ్యులు ముందుకువస్తే సంపాదక మండలి ఏర్పడితే ఇంకా బావుంటుంది. 2011-2013 వరకూ నాకున్న పాక్షిక పాత్రికేయ అనుభవం ఇందుకు పనికిరావచ్చు. ఉత్సాహపూరితంగా దీన్ని ముందుకు తీసుకుపోదాం. ఏమంటారు? --పవన్ సంతోష్ (చర్చ) 12:29, 14 ఫిబ్రవరి 2018 (UTC)
- పవన్ సంతోష్ గారికి. మీ ప్రతిపాదన ఆహ్వానించదగినది. అయితే మీరు, సహసభ్యులు కొంత సమయం కేటాయించవలసివస్తుంది. అప్పట్లో పోలిస్తే క్రియాశీలక వికీపీడియన్లు ఏమైనా పెరిగితే మీ ప్రయత్నం విజయవంతం కాగలదు. ఏమైనా కనీసం ఐదుగురి మద్దతైనా వుంటే ముందుకి సాగండి. నేను అప్పట్లో వాడిన వికీమూసల కోడ్ నేర్చుకోవటానికి సహాయం కావలిస్తే సంప్రదించండి. --అర్జున (చర్చ) 07:36, 1 మార్చి 2018 (UTC)