వికీపీడియా చర్చ:తెవికీ వార్త/2010-07-01/మాటామంతీ-వైజాసత్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • తెవికీ వార్త బాగుంది. ఇందుకు కృషి చేసిన అర్జున రావు గారికి అభినందనలు. దీనిలో పాల్గొని తన అభిప్రాయాలు మన అందరితో పంచుకున్న రవి గారికి ధన్యవాదాలు.--t.sujatha 06:07, 1 జూలై 2010 (UTC)
  • నాదో చిన్న ప్రశ్న. కొన్ని భారతీయ భాషలలో wiki ని వికి లేక వికీ గా రాస్తున్నారు. తెవికీ కూడా వికి గా మొదలై, వికీగా మారిందనుకుంటాను, మీకు దీనిగురించి తెలిస్తే వివరిస్తారా? అర్జున 07:13, 1 జూలై 2010 (UTC)
ఈ విషయంలో నాకంత అవగాహన లేదండి. నేను చూస్తున్న నాటి నుండి ఇలానే అంటే తెవికీగానే చూస్తున్నాను బహుశా వైజా సత్యగారిలాంటి వారు చెప్పగలరనుకుంటాను. ఆయన ఇక్కడ ప్రారంభం నుండి పని చేస్తున్నారు.--t.sujatha 07:21, 1 జూలై 2010 (UTC)
వ్యక్తిగతంగా నేను దాని ఉఛ్ఛారణ వికిపీడియా అనే భావించాను. కానీ తర్వాత వచ్చిన సభ్యులు (చదువరి తదితర సభ్యులు) తెలుగులో ఉఛ్ఛారణ వికీపీడియాకి దగ్గరగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అందుకని అలా కొనసాగింది. వెంటనే వెంటనే రెండు గుడి దీర్ఘాల ఉఛ్ఛారణ వాడుకలో చాలా అరుదని నా అభిప్రాయం. (కానీ ఇది నా వ్యక్తిగతంగా స్ఫురించిన విషయం మాత్రమే. ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు) --వైజాసత్య 02:44, 2 జూలై 2010 (UTC)
వికీపీడియా శ్రవణ వ్యాసం(ఇంగ్లీషు) ప్రకారం వికి సరిగా వుంది. అయితే మనము అరువుతెచ్చుకున్న పరభాష పదాలలో సాధారణంగా గుడి దీర్ఘము వాడుతున్నాము. ఉదా: పేజీ, ఇంగ్లీషు . అయితే ఈమధ్య పత్రికలలో ఇంగ్లిషు అని వాడుతున్నారు. అర్జున 04:39, 2 జూలై 2010 (UTC)