Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

వికీపీడియా:తెవికీ వార్త/2010-07-01/మాటామంతీ-వైజాసత్య

వికీపీడియా నుండి
తెవికీ వార్త
తెవికీ వార్త
మాటామంతీ-వైజాసత్య

మాటామంతీ-వైజాసత్య

వైజాసత్య , జులై 1, 2010


రవి వైజాసత్య
  • వికీపీడియా పరిచయం ఎప్పుడు, ఎలా

2005 ఏప్రిల్లో ఒకరోజు ఇంటర్నెట్టుపై గూగూల్లో ఏదో విషయమై శోధిస్తుండగా ముత్యాల్లాంటి మొదటిపేజీ అనే తెలుగు పదాలు కనిపించి “అరే! గూగూల్లో శోధనా ఫలితాల్లో తెలుగు కూడా వస్తుందా?” అని ఆశ్చర్యపోయి ఆ లింకు మీద క్లిక్ చేసి తెలుగు వికీపీడియాలో అడుగుపెట్టాను. అసలు వికీపీడియా అన్న విజ్ఞానపు ఖని ఉందన్న విషయం కూడా మొదటి సారి అప్పుడే తెలిసింది. చాలామంది వికీపీడియా పరిచయమై, ఆ తర్వాత వికీపీడియా తెలుగులో కూడా ఉంది అని ఆశ్చర్యపోతుంటారు. కానీ, నా విషయంలో రివర్సులో జరిగింది. ఆంగ్ల వికీ ఉందని తెలుసుకున్న తర్వాత అందులో కొన్నాళ్ళు కృషిచేశాను. తెలుగులో టైపు చెయ్యాలంటే చాలా ప్రయాస పడాల్సివచ్చి దీనికంటే ఆంగ్ల వికే నయమనిపించేది. కానీ అప్పుడప్పుడు తెలుగుతో కూడా కుస్తీ పడుతుండేవాన్ని. ఆ తర్వాత పద్మతో పరిచయం, లేఖినితో స్నేహంతో తెవికీప్రయాణం సరదాగా సాగింది.

  • సభ్యుడుగా/నిర్వహకులుగా ఇప్పటివరకు జరిపిన కృషి, గుర్తింపులు

అందరూ కలిసి చేస్తున్న పనిని కాస్త క్రమబద్దీకరించే ప్రయత్నం చేశాను.

  • ప్రస్తుతం తెవికీలో చేస్తున్న కృషి

రోజువారీ నిర్వహణ వ్యవహారాలు పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ ఒక సాధారణ సభ్యునిగా సమాచారాన్ని పోగుచేసి వ్యాసాలను అభివృద్ధి పరచటం, దిద్దటం ఇష్టం. అవి సమయం దొరికినప్పుడు చేయటానికి ప్రయత్నిస్తుంటాను.

  • వికీ సమాచారానికి మీకు ముఖ్యమైన వనరులు

ఏదైనా అంశాన్ని గూగుల్ ఉపయోగించి క్షుణ్ణంగా శోధిస్తాను. గూగూల్ బుక్స్ తరచూ ఉపయోగిస్తాను. శాశ్వతమైన లింకుల్లేని తెలుగు పత్రికలను మూలంగా ఉదహరించడం నాకిష్టముండదు. తెలుగులో కూడా వెతికే అలవాటుండం వళ్ళ మిగతా వాళ్లకు సాధారణంగా తట్టని సమాచారం కూడా నాకు దొరుకుతుంది. ఆర్కైవ్స్.ఆర్గ్ లోని తెలుగు గ్రంథాలుకూడా చక్కని వనరు. బాగా సమయమున్నప్పుడు గ్రంథాలయాలకు వెళ్ళి సమాచారం సేకరించేవాన్ని, కానీ ఇప్పుడు కుదరట్లేదు.

  • వికీ కృషి లో నచ్చినవి/ నచ్చనివి/హాస్య సంఘటనలు

బోల్డన్ని.. నిర్వాహణా వ్యవహారాలు తప్పనిసరై నిర్వహించాల్సి వచ్చింది కానీ, అవేవీ లేకుండా కేవలం సమాచారాన్ని శోధించడం, వ్యాసాలు వ్రాయటం ఇష్టం. నాలో అంతర్లీనంగా ఉన్న ఆ డిటెక్టివ్ జీనే వికీపీడియా దోమ నన్ను కుట్టడానికి దోహదం చేసిందనుకుంటా.

  • వికీ ఉపయోగపడిన విధం

వివిధ రంగాల్లో నాకు తెలిసిన విషయాల విస్తృతి అమాంతగా పెరగటమే కాకుండా అన్నింటికంటే ముఖ్యంగా నాకు తెలుగు చాలా మెరుగుపడటానికి వికీ చాలా దోహదం చేసింది. వికీకి ముందు నా తెలుగు ఒక పదేళ్ళ కుర్రవాడి స్థాయిలో ఉండేదంటే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. (ఇప్పుడేదో పండితుని స్థాయికి చేరానని కాదు!)

  • తెవికీ భవిష్యత్తుకి కలలు

కేవలం తెలుగు వికీపీడియాలోనే ఉండగల కొన్ని తెలుగు అంశాలున్నాయి. అవి వీలైనంత క్షుణ్ణంగా తెవికీలో పొందుపరచాలి. అలాంటి వ్యాసాలకు ప్రాధాన్యత నిస్తూ, తెవికీలో కనీసం ఒక్క వెయ్యి వ్యాసాలను విశేషవ్యాసాల స్థాయిలో తీర్చిదిద్ది ఒక తెలుగు వికీపీడియా సిడీని విడుదల చేసి అన్ని గ్రామ పాఠశాలల్లోనూ పంచిపెట్టాలి.

  • తోటి సభ్యులు నుండి మీ కోరికలు

వికీలో పట్టువిడుపుతో వ్యవహరించండి. శైలి, సమాచారం కంటే సముదాయం ముఖ్యమైనది. వికీ స్ఫూర్తిని గుర్తించండి. మీరు వ్రాసింది ఎవరూ దిద్దకూడదనుకుంటే మీ వికీ ప్రయాణం అట్టేకాలం సాగదు, సాగినా ఆనందదాయకంగా ఉండదు.

  • భారత కాలమానం ప్రకారం వికీ పీడియాలో కృషి చేసే రోజు(లు)/సమయం

సాధారణంగా మధ్యాహ్నం. (మరీ అప్పుడేగా మాకు అపరాత్రయ్యేది)

  • తోటి సభ్యులు సంప్రదించాలనుకుంటే, మీ కిష్టమైన సంప్రదింపు విధం

ఈ-మెయిల్ ఫర్వాలేదు.

  • తెవికీ వార్త చదువరులకి సందేశం

తెవికీ మనం ముందు తరాలకిచ్చే కానుక. వ్యక్తికి బహువచనం శక్తి అని శ్రీశ్రీ అన్నట్టు అందరం తలా ఒక చెయ్యి వేసి తెవికీ ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను.

+వ్యాఖ్య చేర్చుఈ కథనాన్ని చర్చించండి
  • తెవికీ వార్త బాగుంది. ఇందుకు కృషి చేసిన అర్జున రావు గారికి అభినందనలు. దీనిలో పాల్గొని తన అభిప్రాయాలు మన అందరితో పంచుకున్న రవి గారికి ధన్యవాదాలు.--t.sujatha 06:07, 1 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]
  • నాదో చిన్న ప్రశ్న. కొన్ని భారతీయ భాషలలో wiki ని వికి లేక వికీ గా రాస్తున్నారు. తెవికీ కూడా వికి గా మొదలై, వికీగా మారిందనుకుంటాను, మీకు దీనిగురించి తెలిస్తే వివరిస్తారా? అర్జున 07:13, 1 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ విషయంలో నాకంత అవగాహన లేదండి. నేను చూస్తున్న నాటి నుండి ఇలానే అంటే తెవికీగానే చూస్తున్నాను బహుశా వైజా సత్యగారిలాంటి వారు చెప్పగలరనుకుంటాను. ఆయన ఇక్కడ ప్రారంభం నుండి పని చేస్తున్నారు.--t.sujatha 07:21, 1 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యక్తిగతంగా నేను దాని ఉఛ్ఛారణ వికిపీడియా అనే భావించాను. కానీ తర్వాత వచ్చిన సభ్యులు (చదువరి తదితర సభ్యులు) తెలుగులో ఉఛ్ఛారణ వికీపీడియాకి దగ్గరగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అందుకని అలా కొనసాగింది. వెంటనే వెంటనే రెండు గుడి దీర్ఘాల ఉఛ్ఛారణ వాడుకలో చాలా అరుదని నా అభిప్రాయం. (కానీ ఇది నా వ్యక్తిగతంగా స్ఫురించిన విషయం మాత్రమే. ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు) --వైజాసత్య 02:44, 2 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియా శ్రవణ వ్యాసం(ఇంగ్లీషు) ప్రకారం వికి సరిగా వుంది. అయితే మనము అరువుతెచ్చుకున్న పరభాష పదాలలో సాధారణంగా గుడి దీర్ఘము వాడుతున్నాము. ఉదా: పేజీ, ఇంగ్లీషు . అయితే ఈమధ్య పత్రికలలో ఇంగ్లిషు అని వాడుతున్నారు. అర్జున 04:39, 2 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]