వికీపీడియా చర్చ:భారతీయ భాషలలో ఉన్న వికీపీడియాల గణాంకాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రదీప్ గారు మళ్ళి ఒకసారి ఆ బాటు నడపంది. ఈ రెందు నెలలొ మంచి ప్రగతి సాధించాం అని నాకు అనిపిస్తోంది.ప్రగతి చూసిన వేంటనే సభ్యులకు కూడా ఉత్సాహం వస్తుంది--మాటలబాబు 19:55, 19 సెప్టెంబర్ 2007 (UTC)

ఈ పేజీని సృష్టించక ముందే ఎనిమిది వికీపీడియాలలోనూ బాట్లను నడపటం మొదలు పెట్టాను. రేపటికల్లా కొత్త గణాంకాలు వచ్చేస్తాయని అనుకుంటున్నాను :). __మాకినేని ప్రదీపు (+/-మా) 20:01, 19 సెప్టెంబర్ 2007 (UTC)
గత 15రోజుల్లో కూడా చాలా ప్రగతి సాధించాం!!! --వైజాసత్య 20:59, 19 సెప్టెంబర్ 2007 (UTC)
ఇప్పుడు 10KB కంటే ఎక్కువ సైజు ఉన్న వ్యాసాలు, తెలుగులోనే ఎక్కువగా ఉన్నాయి. ఇంతకు ముందు గణాంకాలు తీసినప్పుడు బెంగాలీ వికీపీడియా ఆ స్థానంలో ఉంది __మాకినేని ప్రదీపు (+/-మా) 00:11, 20 సెప్టెంబర్ 2007 (UTC)
ఇంకో విషయం, తమిళ వికీపీడియా గణాంకాలను పరిశీలిస్తే, వారు ఈ రెండు నెలలలోనే సుమారు 350 వ్యాసాలను (>2KB, <5KB) హోదాకు తీసుకుని వెళ్ళారు. అలాగే సుమారు 100 వ్యాసాలకు (>5KB, <10KB) హోదా కల్పించారు. అంటే సుమారుగా 450 వ్యాసాలను మెరుగు పరిచారు ..!!! __మాకినేని ప్రదీపు (+/-మా) 00:23, 20 సెప్టెంబర్ 2007 (UTC)
మనం ఎన్ని మెరుగు పరచామో కూడా వ్రాయండి.--మాటలబాబు 12:47, 20 సెప్టెంబర్ 2007 (UTC)
మనం సుమారుగా 250 వ్యాసాలను మెరుగు పరిచాము. __మాకినేని ప్రదీపు (+/-మా) 12:51, 20 సెప్టెంబర్ 2007 (UTC)

ఇంగ్లీషు శాతం

[మార్చు]

ప్రదీప్, ఇంగ్లీషు శాతాన్ని ఎలా తీసారు? __చదువరి (చర్చరచనలు) 04:59, 20 సెప్టెంబర్ 2007 (UTC)

నాకు స్క్రిప్టులో అర్ధమైన దాన్నిబట్టి అన్ని ప్రధాన నేంస్పేసులోని వ్యాసాల అక్షరాలలో ఇంగ్లీషు అక్షరాల శాతం అనుకుంటా ఇది. (మూసలు, మూసల పారామీటర్లు పరిగణనలోకి తీసుకుంటుందో లేదో?) --వైజాసత్య 05:13, 20 సెప్టెంబర్ 2007 (UTC)
స్క్రిప్టును కేవలం వ్యాసల నేంస్పేసులోనే నడుపుతున్నాను. మూసలు, వర్గాలు, వికీపీడియా లాంటి నేంస్పేసులలో ఉన్న పేజీలను పట్టించుకోదు. మూసల పారామీటర్లు ఆంగ్లంలో ఉంటే దానిని కూడా ఆంగ్లంగానే పరిగనిస్తుంది. వికీపీడియాలో ఉన్న అన్ని వ్యాసాలలో ఉన్న మొత్తం A-Z మరియు a-z అక్షరాల సంఖ్యను, మొత్తం అక్షరాల సంఖ్యతో భాగింస్తే ఇంగ్లీషు శాతం వస్తుంది. స్క్రిప్టు ఎవరికైనా చాలా సులువుగానే అర్ధమవుతుందనుకుంటా. __మాకినేని ప్రదీపు (+/-మా) 09:09, 20 సెప్టెంబర్ 2007 (UTC)
ప్రదిప్ గారు మరలా ఒక సందేహము. మనము తెలుగు వ్యాసాలలొ ఆంగ్ల మూలాలు ఉంచుతున్నాం కదా.మీబాటు ఆ ఆంగ్ల మూలాలు కుడా ఆంగ్ల శాతం క్రింద పరిగణిస్తుందా --మాటలబాబు 20:40, 21 సెప్టెంబర్ 2007 (UTC)
ఆ మూలాలు కూడా ఆంగ్లముగానే పరిగణింపబడతాయి --వైజాసత్య 23:44, 21 సెప్టెంబర్ 2007 (UTC)

బొమ్మల బరువు

[మార్చు]

తెవికీలో ఈమధ్య బొమ్మలను బాగా చేర్చాం. మన వ్యాసాల స్థాయిని బొమ్మల బరువు లేకుండా చూస్తే ఎలా ఉంటుందో!? బొమ్మలు వ్యాసానికి ముఖ్యం కాదని నా ఉద్దేశ్యమూ కాదు, 'మనది బలుపు కాదు, వాపు' అని నా అభిప్రాయమూ కాదు. కేవలం తెలుసుకుందామని, అంతే! ప్రదీప్, వీలయితే పెద్ద పేజీల్లో, బొమ్మలు లేకుండా, బరువెంతో కూడా చూస్తారా? __చదువరి (చర్చరచనలు) 05:07, 20 సెప్టెంబర్ 2007 (UTC)

వ్యాసాల బరువులో బొమ్మల బరువు గురించి అస్సలు పట్టించుకోనవసరంలేదు. మార్పు పేజీలో ఉన్న EDITBOXలో మనకు ఏదయితే కనపడుతుందో, బాటుకూడా దానిపైనే గణాంకాలు తీసుకుంటుంది. అంటే చేర్చిన ప్రతీ బొమ్మకూ దాని లింకు(సుమారు 50-200బైట్లు) మాత్రమే ఉంటుంది. అంటే 2-3కిలోబైట్లు ఉన్న వ్యాసాల గణాంకాలలో కూడా ఈ బొమ్మలు శాతాలలో పెద్దగా ప్రభావం చూపించవు. __మాకినేని ప్రదీపు (+/-మా) 09:15, 20 సెప్టెంబర్ 2007 (UTC)