వికీపీడియా చర్చ:వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ జాబితా ఆసక్తికరంగా ఉంది. జాబితా ప్రక్కనే తెలుగు పేర్లను వ్రాయండి. నిదానంగా సమైక్య కృషిగా మొదలు పెడదాము.

అత్యాశ అనిపించినా గాని నాకు ఒక కోరిక కలుగుతున్నది. దీనికి సమాంతరంగా వికీపీడియా:తెలుగు వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు అన్న జాబితాను తయారు చేద్దాము. అందులో 1116 వ్యాసాల జాబితా పెడదాము. ఇది సభ్యులకు ఒక దిక్సూచిగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. "ప్రయత్నే ఫలీ". ఈ ప్రతిపాదనపై మీ అభిప్రాయాలను చెప్పగలరు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:07, 2 నవంబర్ 2008 (UTC)

జాబితా బాగానే ఉంది కాని మన తెలుగు నేలకు, ఆంద్రులకు సంబంధించి ఒక్క వ్యాసం కూడా లేదు. తమిళభాష ఉంది కాని తెలుగులేదు. భారతదేశానికి సంబంధించికూడా అతిస్వల్పంగా ఉన్నాయి. సత్యజిత్ రాయ్, అక్బర్, జవహర్ లాల్ నెగ్రూ, బుద్ధుడు, గాంధీ, మదర్ థెరీసా, భారతదేశం, కోల్కత, ముంబాయి, ఢిల్లీ, గంగానది, సింధూనది, హిమాలయాలు, ఎవరెస్ట్ శిఖరం, హిందీ, సంస్కృతం,తమిళం, రామాయణ, మహాభారతాలు, తాజ్‌మహల్ వ్యాసాలు ఇదివరకే తెవికీలో ఉన్నాయి. ఆ జాబితా ప్రకారం చేయాలంటే కష్టమే కాబట్టి ఆ జాబితాను దృష్టిలో ఉంచుకొని మనమే స్వయంగా జాబితా చేసుకోవడమే ఉత్తమం. తెలుగు జాతికి, తెలుగు సంస్కృతికి, తెలుగు వ్యక్తులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి కనీసం మూడో వంతు వ్యాసాలు దీనికే కేటాయించాలి. ఇక రెండో ప్రాధాన్యత భారతదేశ వ్యాసాలకు కేటాయించాలి. ముందుగా సభ్యులందరూ తలో చెయ్యి వేసి చేర్చాల్సిన వ్యాసాల పేర్లను తయారుచేసి ఆ తరువాత తుది జాబితాను రూపొందించవచ్చు. ఆ వ్యాసాలన్నీ తయారైతే తెవికీ ప్రస్తుతాని కంటే సమగ్ర రూపం దాల్చుతుంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 18:04, 2 నవంబర్ 2008 (UTC)

(1) వైజా సత్యా! ఈ జాబితాకు ఆంగ్లవికీ లింకు ఇవ్వలేదు! నాకు దొరకడంలేదు.

(2) ఈ జాబితాను చంద్రకాంతరావు గారు వేరే విధంగా అర్ధం చేసుకొన్నారనిపిస్తుంది. ఇది వికీమీడియా చర్చ ద్వారా తయారు చేసిన జాబితా గనుక మనం మార్చడం సబబు కాదు. వ్యాసాలు చేస్తామా వద్దా అనేది మనిష్టం. ఆ జాబితాను అలా ఎర్ర లింకులతో ఉంచేయవచ్చును. అయితే మీరు చెప్పిన లోటులను సవరించడానికే నేను తెలుగు వికీకి road map లాగా ఒక "సమాంతర జాబితా"ను ప్రతిపాదించాను. అందులో వ్యాసాలు షుమారు ఇలా ఊహించవచ్చును.

  • 20% - "తెలుగు" భాష, ప్రజలు, చరిత్ర, ప్రాంతంకు సంబంధించినవి
  • 20% - భారత దేశానికి సంబంధించినవి
  • 20% - ప్రపంచానికి సంబంధించిన భౌగోళిక, రాజకీయ వ్యాసాలు
  • 40% - ప్రాంతానితో సంబంధం లేనివి. - విద్య, విజ్ఞానం, సంస్కృతి, ఆరోగ్యం సంబంధమైనవి

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:21, 2 నవంబర్ 2008 (UTC)

ఆ జాబితా నాకర్థమైనదే, అది వికీమీడియా (లింకు) వాళ్ళు తయారుచేసినది. ఆ జాబితాలోని వ్యాసాలు ప్రతి వికీలో ఉండాలనేది, ఎన్ని ఉన్నాయనేది తెల్సుకోవడం వారి అభిప్రాయం కావచ్చు. కాబట్టి ముందుగా ఆ జాబితాను ప్రతి వికీ భాషలోకి అనువదించాలని కోరినారు. కాని ఆ జాబితా పట్టించుకుంటే ప్రస్తుతం మనం తెవికీలో చేస్తున్న పనులను వాయిదా వేయవలసి వస్తుందని, మనమే దానికి బదులుగా ఒక కొత్త జాబితా తయారుచేయాలని (ఆ జాబితాను మార్చాలని నా ఉద్దేశ్యం కాదు, మార్చలేము కూడా) నా అభిప్రాయం పైన తెలియజేశాను. అంతేకాకుండా ఆ వ్యాసాల వల్ల తెవికీకి పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. సుమారు 50-60% వ్యాసాలు బాగున్నాయి. జాబితా తయారుపై వికీమీడియా వారి అభిప్రాయాలేంటో తెలుసుకోవాలి. జాబితాను మాత్రం అనువదించే పని చేపట్టుదాం. -- C.Chandra Kanth Rao(చర్చ) 20:07, 2 నవంబర్ 2008 (UTC)
ఈ జాబితాను ప్రాతిపదికగా తీసుకొని కృషి చేయాలని కాదు నా ఉద్దేశం. వికీమీడియా వాళ్ళు వివిధ వికీల విస్తృతిని అంచనా వేయటానికి ఈ జాబితాను తయారు చేశారు. వివిధ వికీల్లో ఎన్ని ఉన్నాయి. ఉన్నవి ఏ స్థాయిలో ఉన్నాయన్న విషయాలపై గణాంకాలు కూడా సేకరిస్తున్నారు. ఈ లింకు చూడండి. ఇతర భారతీయ వికీలతో పోల్చితే తెవికీలో ఉన్నవి తక్కువైనా వాటి సగటు పరిమాణం మాత్రం మిగిలిన భారతీయ వికీల్లో కంటే రెట్టింపు ఉండటం విశేషం. కాసుబాబు గారన్నట్టు తెలుగు వికీకి సంబంధించిన ఇలాంటిదే ఒక జాబితా తయారు చేసుకొని కృషి చేయటం సరైన పని. ఈ జాబితానూ కనీసం అనువదించి పెడితే..వ్రాయలనుకున్నవాళ్ళు వ్రాస్తారు. అలాగే మనం సులభంగా ట్రాక్ కూడా చేయటానికి వీలుగా ఉంటుంది..కానీ ముమ్మాటికీ తెలుగు సంబంధిత జాబితానే మన ప్రధాన మార్గదర్శకం. --వైజాసత్య 21:04, 2 నవంబర్ 2008 (UTC)

అనువాదం చేసేవారికి విజ్ఞప్తి[మార్చు]

పేర్లు అనువాదం చేసే వారు ఆంగ్ల పేర్లను తొలిగించకుండా ఉంటే మంచిది. వ్యాసం రాసేటప్పుడు ఆ లింకు ద్వారా వెళ్ళవచ్చు. ఎందుకంటే కొన్ని ఆంగ్ల పేర్లు ఉచ్ఛారణకు సంబంధం లేనివిగా ఉంటాయి. దానికొరకు ఆంగ్ల వికీలో వెదకటం కొద్దిగా ఇబ్బంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 16:04, 7 నవంబర్ 2008 (UTC)

మంచి సూచన --వైజాసత్య 16:43, 7 నవంబర్ 2008 (UTC)
అవును. ఇంగ్లీషు పేరు అలా ఉంచేసి, ప్రక్కన తెలుగు పేరు వ్రాయగలరు - --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:31, 7 నవంబర్ 2008 (UTC)
తెలుగు వ్యాసం ప్రారంభించేటపుడు అంతర్వికీ లింకులు చేరిస్తే సరి. వీటి నుంచి ఆంగ్ల వికీ చేరుకోవచ్చు కదా. రవిచంద్ర(చర్చ) 05:02, 12 నవంబర్ 2008 (UTC)
  • అలాగే తెలుగు వీకీలో ఉండవలసిన జాబితా తయారు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. చక్కగా పని మొదలు పెట్టచ్చు.--t.sujatha 17:10, 11 నవంబర్ 2008 (UTC)
కాసుబాబు గారూ, సుజాతగారు చక్కటి విషయం చెప్పారండి. ఇది అత్యాశ అయినా అనుభూతి బాగుంది. ఆవశ్యకత కూడా.
మెదటి దశ : వికీపీడియా:వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు
రెండవ దశ : వికీపీడియా:తెలుగు వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు. నిసార్ అహ్మద్ 17:33, 11 నవంబర్ 2008 (UTC)

New real time list of missing articles[మార్చు]

I suggest that you give a look to the Mix'n'match tool by Magnus Manske, and that you recommend it from this page. Thanks to Wikidata, it's able to tell you in real time what articles you're missing out of several reliable lists of relevant persons. --Nemo 17:06, 10 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]