వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/పుస్తకాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పెద్ద గారి సలహా[మార్చు]

ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యము తెవికీలో పుస్తకాలకు సంబంధించిన వ్యాసాలను గుర్తించి, వాటిని వర్గీకరించి, విశేషవ్యాసాల స్థాయిలో అభివృద్ధి చేయటం. కొన్ని పుస్తకాలు:

1. ఏడు తరాలు - అలెక్స్ హీలి (నీగ్రోల గురించిన గొప్ప పుస్తకం) 2. గీతాంజలి - రవీంద్రనాథ్ ఠాగూర్ (చలం అనువాదం ) 3. సత్య శోధన నా ప్రయోగాలు - మహాత్మగాంధీ 4. చివరకు మిగిలేది - బుచ్చిబాబు 5. శంఖారావం - ఎక్కిరాల కృష్ణమాచార్య 6. కన్యాశుల్కం -గురజాడ అప్పారావు

వివేకనంద రచనలు కూడ చదవదగినవి.

పుస్తకాలకు పేజీలు సృష్టిస్తున్నాను సహాయం చేయగలరు[మార్చు]

సహ సభ్యులకు, నమస్కారం. నేను పుస్తకాల పేజీలు సృష్టించుకుంటూ పోతున్నాను. పేజీలు పూర్తిచేస్తున్నాను. అయితే నేను సమాచార పెట్టె మాత్రం పెట్టడం లేదు. మీరు వీలు కుదిరినప్పుడు సమాచార పెట్టె పెట్టి మౌలికమైన సమాచారం చేర్చగలరు. పెట్టె నింపడానికి కావాల్సిన సమాచారం నేను పెట్టే రచన నేపథ్యం శీర్షికలో చాలా వరకు దొరుకుతుంది. ఆపైన నేను మిగిలిన కాస్త సమాచారం వీలువెంబడి చేర్చి సమగ్రం చేస్తాను. కృతజ్ఞతలతో.. --పవన్ సంతోష్ (చర్చ) 14:37, 10 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]