వికీపీడియా చర్చ:శైలి/భాష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అసంపూర్ణం

[మార్చు]

ఈ భాషాశైలి పుట అసంపూర్ణముగానున్నది. ఇందు, ఇతర భాషా పదములు ఏ మేరకు ఉపయోగించవలెను? ఇంతకు మించి ఇతర భాషా పదములు వాడినచో మీ పై చర్యలు తీసికొనబడును అని ఎవరేని చెప్పెదరా? మొదలగు విషయములు ఏవియు లేవు. దయచేసి ఇచ్చట చర్చించి పుటలో చేర్చెదము. Hydkarthik (చర్చ) 07:53, 23 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Hydkarthik గారూ, అసలు మీ రేమనుకుంటున్నారో, మీ ప్రతిపాదనలేంటో రాయండి. వాటిపై చర్చిద్దాం. __చదువరి (చర్చరచనలు) 08:45, 23 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

శైలీ నియమాలు కావలసిన అనువాద సమస్యలు

[మార్చు]

1. ఆంగ్లంలో t, d అక్షరాలు, వారి వ్యాకరణం ప్రకారం తెలుగు ట, డ లకు సమానం కాదు. తెలుగు అక్షరాలు మూర్ధన్యాలు. అంటే నాలుక మడతపెట్టి పలికేవి. ఆంగ్ల అక్షరాలు దంత్యమూలీయాలు. అంటే నాలుకను పైచిగురుకు తాకించి పలికేవి. మన 'త,ద' అక్షరాలు దంత్యాలు. అంటే పళ్ళతో పలికేవి. ఆంగ్ల అవగాహన తక్కువ ఉన్న కాలంలో t, dలకీ 'త,ద' లకీ సంబంధం అందుకే కనబడేది. David-దావీదు. ప్రస్తుతం భారతీయ యాసల్లో 't,d' లు ట,డలు గా పలకబడటాన్ని గుర్తించారు. మంట, కంఠం, బండ అనేవి మణ్ట, కణ్ఠం, బణ్డ అనే వాటికి అనుస్వార రూపాలు. తంతు, గొంది అనేవి తన్తు, గొన్ది అనే పదాలకు అనుస్వార రూపాలు. ఆంగ్ల వ్యాకరణం ప్రకారం bandలో 'n' 'న' ను సూచిస్తుంది. ఇప్పుడు Indiaనీ ఇండ్య అని వ్రాయాలా లేక ఇన్డ్య అని వ్రాయాలా (వికీలో) లేక రెండూ ఆమోదించాలా ? ఇలాంటి పదాల్లో అనుస్వారం ఉపయోగం పై ఏకాభిప్రాయానికి రావలసి ఉంది.

2. సంస్కృత వ్యాకరణం ప్రకారం అనుస్వారం ఆ వర్గపు అనునాసికాన్ని సూచిస్తుంది. అంటే సంశయం అనేది సఞ్శయం అనే దానికి సంగ్రహ రూపం. కానీ తెలుగులో అనుస్వారం స్పర్శము కాని అక్షరాలు (శ,ష,స,హ,య,ర,ల,వ) ముందు వస్తే 'మ' గా పలుకుతున్నాం. సమ్శయంలా. హిందీ పదాల్లో మున్షీని ముంశీగా వ్రాస్తారు (ముఞ్శీ అని పలుకుతారు). ఇతర భాషల ప్రముఖుల పేర్లు తెలుగులో ఈ సందర్భంలో ఎలా వ్రాయాలి ? కొన్ని ఆంగ్ల పదాల దగ్గర కూడా ఈ సమస్య ఉంది. Install- ఇంస్టాల్, ఇన్‌స్టాల్. ఇన్స్టాల్ ? ఆంగ్ల పదాలను వ్రాయాల్సి వస్తే ఏ రూపానికి ప్రాధాన్యత ఇవ్వాలి ?

3. ఆంగ్లంలో ఞ లేదు. అంటే punch కాస్తా పంచ్ అవ్వదు. పన్చ్ అవుతుంది. ఇలా 'nch' ఉన్న ఆంగ్ల పదాలను తెలుగులో ఎలా వ్రాయాలి ?

4. ఆంగ్లంలో పదం చివర వచ్చే *le తెలుగులో ఌ అక్షరాన్ని సూచిస్తుంది. ఆంగ్ల పదం తెలుగులోకి వ్రాసేటప్పడు ఏం చేయాలి? shuttle అనే క్రీడ. షటిల్ అని వ్రాయాలా ? షటౢ అని వ్రాయాలా? ఎలా వ్రాసినా ఆమోదించాలా ?

5. ఴ అక్షరం. తమిళ, మలయాళ ప్రాంత పేర్లూ ఇతర నామవాచకాలు ఎలా వ్రాయాలి ? తమిళ/తమిఴ/తమిళ(ఴ)/తమిఴ(ళ) ? లేక ఎలా వ్రాసినా ఒప్పేనా ?

6. వేరే భాషలో చేసిన వ్యాఖ్యలు. ఒక పుస్తకంపై ఆంగ్లంలో ప్రముఖ విమర్శకుడు అభిప్రాయం చెబుతాడు. అతని ఆంగ్ల వ్యాఖ్యను వ్రాసి దానికి తెలుగు అనువాదం కింద పేర్కోవాలా ? లేక నేరుగా తెలుగులోకి అనువదించాలా ?

7. అనువాదానికి అనువాదాలు. ఉదాహరణకు సుమేరు నాగరికత కావ్యాలు. వీటిని సుమేరు భాషలో ఇచ్చి, ప్రక్కన ఎవరో sumerologist చేసిన ఆంగ్ల అనువాదమిస్తారు. మనం తెలుగులోకి అనువదిస్తే, సహజంగా ఆంగ్ల అనువాదాన్ని అనువదిస్తాము. అప్పుడు ఫలానా చరిత్రాకారుని ఆంగ్ల అనువాదానికి వికీ సమర్పకుల తెలుగు అనువాదమని వ్రాయాలా ?

8. ఒడియా, బెంగాలీ భాషాపదాలను వ్రాయాలంటే 'బ' ని ఎలా వ్రాయాలి ? రబీంద్రనాథ్ ఠాగూర్/రవీంద్రనాథ్ ఠాగూర్ ?

ఇవన్నీ నిర్ణయాలు తీసుకోవలసిన కొన్ని విషయాలు. వాటిని దృష్టికి తెచ్చే ఉద్దేశం ఈ టపాది. వీటిలో మొదటి 5 అంశాలూ కొంచెం చాదస్తం అన్న మాట వాస్తవమే కానీ, ఆఖరి మూడు విషయాలు గమనార్హం. Inquisitive creature (చర్చ) 06:15, 3 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@Inquisitive creature గారూ, ఈ విషయాలను చర్చకు తెచ్చినందుకు ధన్యవాదాలు సార్. మొదటి ఐదూ చాదస్తమని మీరు అన్నారు గానీ.., 2 వది చర్చనీయాంశమేనని నాకు అనిపిస్తోంది. అయితే చర్చను ఇక్కడ కాకుండా విధాన ప్రతిపాదనగా మొదలుపెట్టి, చర్చించి తగిన విధానాన్ని రూపొందించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. పై అంశాలన్నిటితో పాటు, ఇంకా ఇతర అంశాలేమైనా ఉంటే వాటిని కూడా చేర్చి, మీరే ఆ పేజీని మొదలు పెట్టాలని కోరుతున్నాను. __ చదువరి (చర్చరచనలు) 08:28, 3 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari మీ స్పందనకు నెనర్లు. విధాన ప్రతిపాదన పేజీ అంటే ఇలాంటినా —వికీపీడియా:మొలకపేజీల నియంత్రణ విధానం? కానీ పక్షంలో ఒక ఉదాహరణ పేజీ లంకె ఇవ్వగలరు Inquisitive creature (చర్చ) 11:02, 3 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Inquisitive creature గారూ, వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/తేదీ ఆకృతి ఎలా ఉండాలి అనే పేజీ చూడండి. ఇలాంటి పేజీలో చర్చ జరిపి, దానిలో తీసుకున్న నిర్ణయాన్ని "శైలి" పేజీలో చేర్చుకుందాం. __ చదువరి (చర్చరచనలు) 14:13, 3 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

సాధు రూపాలు

[మార్చు]

థ-ధ. స్థానం మొదటి రూపం. స్ధానం నేడు అదనపు సాధు రూపం. మహేశ్ అసలు రూపం. మహేష్ అదనపు రూపం. ఈ అదనపు రూపలపై మార్గదర్శకాలు చర్చించవలసి ఉంది. Inquisitive creature (చర్చ) 06:23, 3 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]