విజయరాజ కుమార్ నరిశెట్టి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆచార్య రంగా అనుచరుడైన, నరిశెట్టి రాజయ్య. (పాతరెడ్డిపాలెం - చేబ్రోలు, గుంటూరు జిల్లా, గ్రామ నాయకుడు) కుమారుడైన విజయరాజ కుమార్ కు రాజకీయాలు తండ్రి నుంచే అబ్బాయి. రంగా రేచుకుక్కలని కమ్యూనిస్ట్ లు కోపంతో 1955 ఎన్నికలలో విజయరాజ కుమార్, వీరాచారిని అనేవారు.

బాల్యం[మార్చు]

విజయరాజ కుమార్ పాత రెడ్డిపాలెం (చేబ్రోలు) లో గుర్రపు స్వారి, ఈత, వివిధ క్రీడలలో చురుకుగా పాల్గొనేవాడు. టంగుటూరి సూర్యకుమారితో కలసి కేంబ్రిడ్జ్ మెట్రిక్ చదివాడు కాని పూర్తి చేయలేదు.

తొలి రోజులు[మార్చు]

సుభాష్ చంద్ర బోస్ పెట్టిన ఫార్వర్డ్ బ్లాక్ లో రాష్ట్ర నిర్వాహక కార్యదర్శిగా పనిచేశాడు. సుభాష్ చంద్ర బోస్ జీవిత చరిత్ర " విప్లవాధ్యక్షుడు" 1950 ప్రాంతాలలో ప్రచురించాడు. తండ్రి రాజయ్య ప్రోద్బలంతో, రంగా స్థాపించిన కృషికార్ లోక్ పార్టిలో చేరి ( చల్లపల్లి రాజకీయ పాఠశాలలో), నిర్వాహక కార్యదర్శిగా, ఉపన్యాసకుడుగా, కమ్యూనిస్టులకు సవాల్ గా పరిణమించాడు. తొలి ఎన్నికలలో విపరీతంగా పర్యటించి, సిద్ధాంత విశ్లేషకుడుగా పేరు తెచ్చుకున్నాడు. రంగా రచన Revolutionary Peasantsను విప్లవ రైతాంగంగా అనువదించి ప్రచురించాడు. వాహిని వగైరా పత్రికలలో వ్యాసాలు వ్రాశాడు. 1954 లో గౌతు లచ్చన్న పిలుపుమేరకు కల్లుగీత సత్యాగ్రహంలో పాల్గొని 6 మాసాలు రాజమండ్రి జైలు శిక్ష అనుభవించాడు.

వివాహం[మార్చు]

ఆంధ్ర సుప్రసిద్ధ ఎన్నికలలో (1955) ఐక్య కాంగ్రెస్ తరఫున తిరుగులేని ఉపన్యాసకుడుగా పేరు తెచ్చుకున్నాడు.1956లో ఆవుల గోపాలకృష్ణమూర్తి పౌరోహిత్యాన సెక్యులర్ వివాహం కన్యాకుమారితో గుంటూరు సరస్వతి మహల్ లో చేసుకున్నాడు. ఆచార్య రంగా, కొత్త రఘురామయ్యతో సహా అనేక మంది సమక్షంలో పెళ్ళి జరిగింది.

రాజకీయ జీవితం[మార్చు]

1957 లో ఆవుల గోపాలకృష్ణమూర్తితో కలసి విజయనగరంలో దేవకినందన్ పెట్టిన సభలో ప్రసంగించాడు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటి సెనేట్ సభ్యుడుగా 1958లో స్థానిక సంస్థల ప్రతినిధిగా ఎన్నిక అయ్యాడు.సెనేట్ అనుమతి లెకుండా ముఖ్య మంత్రి సంజీవరెడ్డికి గౌరవ డాక్టరేట్ యూనివర్శిటి ఇవ్వడంపై కోర్ట్ లో ఆవుల గోపాల కృష్ణమూర్తి అడ్వకేట్ గా పోరాడాడు. అది తేలేవరకు డాక్టర్ అని సంజీవరెడ్డి వాడలేదు.1959 లో స్వతంత్ర పార్టిలో కార్యదర్శిగా రంగా, లచ్చన్న, ఓబులరెడ్డితో పనిచేశాడు.1962 నుండి సంగారెడ్డిలో స్థిరపడి వ్యవసాయం చేసి, ప్రింటింగ్ ప్రెస్ నడిపాడు.

తెలంగాణాలో ఎస్.ఎన్.రెడ్డి, ఎస్.వి. పంతులు, వందేమాతరం రామచంద్రరావుతో సన్నిహితంగా పనిచేసాడు. జర్నలిస్ట్ లలో నర్రావుల సుబ్బారావు, గోవాడ సత్యారావు, విజయరాజ కుమార్ కు సన్నిహితులు. సూర్యదేవర రాజ్యలక్ష్మితో మంచి పరిచయం ఉంది. ఆలపాటి రవీంద్రనాథ్ తొ కూడా బాగా పరిచయం ఉంది. బుక్ లింక్స్ కె.బి.సత్యనారాయణ, డా.కె.సదాశివరావు, కోనూరి కన్నయ్య, పూదోట శౌరయ్య, విజయరాజ కుమార్ కు అతి సన్నిహితులు. చరణ్ సింగ్ తో దగ్గరగా పనిచేశాడు. ఆయన ఆర్థిక రచన తెలుగులో అనువదించగా, మరణానంతరం తెలుగు అకాడమి భారత రైతాంగ ఆర్థిక శాస్త్రంగా ప్రచురించింది.

మరణం[మార్చు]

1986 లో లివర్ వైఫల్యంవలన ఉస్మానియ హాస్పిటల్ లో మరణించాడు. ఆ సమయం లో, ఆయన తల్లి అంటోనమ్మ, తమ్ముడు ఇన్నయ్య (ప్రఖ్యాత హేతువాది, పాత్రికేయుడు), కుమారులు దేవరాజు, రాజేంద్ర, భార్య కన్యాకుమారి దగ్గరలో ఉన్నారు.