విజయలక్ష్మి సాధో
డాక్టర్ విజయలక్ష్మి సాధో | |
---|---|
మధ్యప్రదేశ్ శాసనసభ సభ్యురాలు | |
Assumed office 2018 డిసెంబరు 11 | |
అంతకు ముందు వారు | రాజ్‌కుమార్ మెవ్ |
నియోజకవర్గం | మహేశ్వర్ శాసనసభ నియోజకవర్గం[1] |
సాంస్కృతిక, వైద్య విద్య అండ్ ఆయుష్ మంత్రి, మధ్యప్రదేశ్ ప్రభుత్వం | |
In office 2018 డిసెంబరు 25 – ఏప్రిల్ 2020 | |
ముఖ్యమంత్రి | శివరాజ్ సింగ్ చౌహాన్ |
తరువాత వారు | ఉషా ఠాకూర్, విశ్వాస్ సారంగ్ |
పార్లమెంటు సభ్యురాలు, రాజ్యసభ | |
In office 2010 జూన్ 30 – 2016 జూన్ 29 | |
తరువాత వారు | వివేక్ తంఖా |
నియోజకవర్గం | మధ్యప్రదేశ్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | [2] మండలేశ్వర్, ఖార్గోన్ జిల్లా, మధ్య భారత్, భారతదేశం | 1955 నవంబరు 13
జాతీయత | భారతీయురాలు |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
కళాశాల | గాంధీ మెడికల్ కాలేజ్, భోపాల్ |
నైపుణ్యం | సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకురాలు |
డాక్టర్ విజయలక్ష్మి సాధో (జననం 1955 నవంబరు 13) భారతీయ సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. ఆమె మాజీ పార్లమెంటు సభ్యురాలు (రాజ్యసభ), మధ్యప్రదేశ్ నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికయ్యింది.[3] ప్రస్తుతం, ఆమె మధ్యప్రదేశ్ విధానసభలో మహేశ్వర్ శాసనసభ నియోజకవర్గంనకు ప్రాతినిధ్యం వహిస్తున్నది.[1] ఆమె 2018 డిసెంబరు 25న మధ్యప్రదేశ్ రాష్ట్ర కొత్త ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది.[4]
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖర్గోన్ జిల్లాకు చెందిన మండలేశ్వర్‌లో 1955 నవంబర్ 13న విజయలక్ష్మి సాధో జన్మించింది. ఆమె భోపాల్‌లోని గాంధీ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పట్టాపుచ్చుకుంది.[3]
కెరీర్
[మార్చు]1985 నుండి 1992 వరకు మధ్యప్రదేశ్‌లోని ఇండియన్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఆమె ఉంది. ఆమె 1985 నుండి 1989 వరకు మధ్యప్రదేశ్ శాసనసభ సభ్యురాలిగా పనిచేసింది. ఆమె పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, మహిళా శిశు సంక్షేమ కమిటీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన తరగతుల సంక్షేమం కమిటీలకు సభ్యురాలుగా ఉంది.
1989 నుంచి 1990 వరకు పార్లమెంటరీ కార్యదర్శిగా ఆమె పనిచేసింది. మధ్యప్రదేశ్ నుండి 1993 నుండి 1998 వరకు ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ, జైళ్ల శాఖలకు ఆమె ప్రభుత్వ సభ్యురాలు. 1985 నుండి 2018 వరకు ఆమె 5 సార్లు మధ్యప్రదేశ్ శాసనసభకు ఎన్నికయింది. ఆమె 1990, 2003 ఎన్నికల్లో ఓడిపోయింది. కాగా, ఆమె 2013లో రాజ్యసభకు ఎన్నికైనందున ఆమె ఎన్నికల్లో పోటీ చేయలేదు.
ఏప్రిల్ 2010లో, ఆమె రాజ్యసభకు ఎన్నికయింది. ఆమె ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ కమిటీ, హింసను నిరోధించే బిల్లు ఎంపిక కమిటీ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సలహా కమిటీ, కేంద్ర పర్యవేక్షక బోర్డుపై కమిటీ.. మొదలైన వాటికి సభ్యురాలిగా వ్యవహరించింది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Maheshwar Election Result 2018 Live Updates: Candidate List, Winner, MLA, Leading, Trailing, Margin". 11 December 2018. Archived from the original on 13 December 2018.
- ↑ "Department Of Public Relations,Madhya Pradesh". www.mpinfo.org. Archived from the original on 2019-08-02. Retrieved 2020-07-13.
- ↑ 3.0 3.1 "WebPage of Dr. Vijayalaxmi Sadho Member of Parliament (RAJYA SABHA)". Retrieved 22 March 2014.
- ↑ PTI (2018-12-25). "Madhya Pradesh CM Kamal Nath expands Cabinet, inducts 28 ministers". Mint (in ఇంగ్లీష్). Retrieved 2018-12-27.