విజయానంద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజయానంద్
దర్శకత్వంరిషికా శ‌‌‌‌ర్మ
నిర్మాతఆనంద్ సంకేశ్వర్
తారాగణంనిహాల్ రాజ్‌‌‌‌పుత్
అనంత్ నాగ్
అనీష్ కురువిల్లా
ఛాయాగ్రహణంకీర్తన్ పూజారి
కూర్పుహేమంత్ కుమార్
సంగీతంగోపీ సుందర్
నిర్మాణ
సంస్థ
వీఆర్ఎల్ ఫిల్మ్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
09 డిసెంబర్ 2022
దేశం భారతదేశం
భాషతెలుగు

విజయానంద్ 2022లో తెలుగులో విడుదలైన సినిమా. వీఆర్ఎల్ ట్రావెల్స్ వ్యవస్థాకుడు ప‌‌‌‌ద్మశ్రీ విజ‌‌‌‌య్ శంకేశ్వర్ జీవితాధారంగా ఈ సినిమాను వీఆర్ఎల్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆనంద్ సంకేశ్వర్ నిర్మించగా, రిషికా శ‌‌‌‌ర్మ దర్శకత్వం వహించింది.[1] నిహాల్, అనంత్ నాగ్, రవిచంద్రన్, భరత్ బోపన్న, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై 2022 నవంబర్ 21న విడుదల చేయగా[2], సినిమా డిసెంబర్ 09న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది.[3][4]

కథ[మార్చు]

విజయ్ సంకేశ్వర్ (నిహాల్) వాళ్ల తండ్రి కర్ణాటకలో ఒక మాములు ప్రింటింగ్ ప్రెస్ యజామాని. తన తండ్రి ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేయడం ఇష్టముండని విజయ్ సంకేశ్వర్, 1976లో ఒక ట్రక్కుతో లాజిస్టిక్ కంపెనీని స్థాపిస్తాడు. ఈ క్రమంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొంటారు. ఈ క్రమంలో ఒక్క ట్రక్కుతో మొదలైన ఆయన ప్రస్థానం వేల ట్రక్కుల యాజమాని అవుతాడు. కర్ణాటకలో 45 ఏళ్లలోనే అగ్ర వ్యాపారవేత్తగా ఎదుగుతాడు. ఈ క్రమంలో ఆయన ఒక పత్రికను కూడా స్థాపించాల్సి వస్తోంది. అందకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి ? చివరకు తాను నమ్ముకున్న దారిలో ఎలా విజయాన్ని సొంతం చేసుకున్నాడనేడే మిగతా సినిమా కథ.[5]

నటీనటులు[మార్చు]

 • నిహాల్ రాజ్‌‌‌‌పుత్[6]
 • అనంత్ నాగ్
 • వి.ర‌విచంద్రన్‌
 • భరత్ బోపన్న
 • అనీష్ కురువిల్లా
 • సిరి ప్రహ్లాద్‌‌‌‌
 • షైన్ శెట్టి
 • అర్చన కొట్టిగే
 • విన‌య ప్రసాద్‌
 • ప్రకాష్ బెల‌వాడి

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్: వీఆర్ఎల్ ఫిల్మ్ ప్రొడక్షన్స్[7]
 • నిర్మాత: ఆనంద్ సంకేశ్వర్
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రిషికా శ‌‌‌‌ర్మ
 • ఎడిటర్: హేమంత్ కుమార్
 • సినిమాటోగ్రఫీ: కీర్తన్ పూజారి
 • సంగీతం: గోపీ సుందర్

మూలాలు[మార్చు]

 1. Eenadu (3 August 2022). "'విజయానంద్‌' ప్రయాణం". Archived from the original on 2 January 2023. Retrieved 2 January 2023.
 2. V6 Velugu (21 November 2022). "'విజయానంద్' సినిమా ట్రైలర్ విడుదల". Archived from the original on 2 January 2023. Retrieved 2 January 2023.
 3. Sakshi (5 December 2022). "ఈ వారం సినీ ప్రియులకు పండగే.. ఏకంగా 17 సినిమాలు రిలీజ్". Archived from the original on 5 December 2022. Retrieved 5 December 2022.
 4. Namasthe Telangana (2 December 2022). "డిసెంబరు 9న సినిమాల జాతర..!". Archived from the original on 2 January 2023. Retrieved 2 January 2023.
 5. NTV (9 December 2022). "విజయానంద్ (కన్నడ డబ్బింగ్)". Archived from the original on 2 January 2023. Retrieved 2 January 2023.
 6. V6 Velugu (28 November 2022). "ఇదొక సినిమా కాదు.. ఎమోషన్ : నిహాల్ రాజ్‌‌‌‌పుత్‌‌‌‌". Archived from the original on 2 January 2023. Retrieved 2 January 2023.
 7. V6 Velugu (11 November 2022). "వి.ఆర్‌.ఎల్ ఫిల్మ్‌ ప్రొడ‌క్షన్స్ బ్యానర్‌లో విజయానంద్ చిత్రం". Archived from the original on 2 January 2023. Retrieved 2 January 2023.

బయటి లింకులు[మార్చు]