విజయ్ శంకేశ్వర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజయ్ శంఖేశ్వర్
జననం
విజయ్ బసవన్నెప్ప శంఖేశ్వర్

(1950-08-02) 1950 ఆగస్టు 2 (వయసు 73)[1]
గడగ్‌, కర్ణాటక, భారతదేశం
జాతీయత భారతీయుడు
క్రియాశీల సంవత్సరాలు1967–ప్రస్తుతం
బిరుదువీఆర్ఎల్ గ్రూప్ ఛైర్మన్ & ఎండీ
రాజకీయ పార్టీబీజేపీ (1993-2003) (2014-ప్రస్తుతం)
బోర్డు సభ్యులువీఆర్ఎల్ గ్రూప్[2]
జీవిత భాగస్వామిలలితా
పిల్లలు4[3]

విజ‌‌‌‌య్ శంకేశ్వర్ భారతదేశానికి చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. భారతదేశంలోని అతిపెద్ద లాజిస్టిక్స్ సంస్థ వీఆర్ఎల్ ట్రావెల్స్ వ్యవస్థాకుడు. ఆయనకు భారత ప్రభుత్వం 2020లో ప‌‌‌‌ద్మశ్రీ పురస్కారంతో సన్మానించింది.

రాజకీయ జీవితం[మార్చు]

విజయానంద్ బీజేపీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి బీజేపీ నుంచి నార్త్ ధర్వాడ్ నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికైయ్యాడు. ఆయన బీజేపీ తరుపున కర్ణాటకలో నార్త్ ధార్వాడ్‌లో ఎంపీగా గెలిచిన మొదటి వ్యక్తి. విజయానంద్ 1993, 1998, 1999 మూడు సార్లు బీజేపీ తరుపున ఎంపీగా గెలిచాడు. ఆయన ఆ తర్వాత బీజేపీతో విభేదించి కన్నడనాడు పార్టీని స్థాపించి తిరిగి మళ్లీ బీజేపీలో ఆ పార్టీని విలీనం చేసాడు.

సంవత్సరం పదవులు
1993 సభ్యుడు, BJP, జిల్లా. ధార్వాడ్, కర్ణాటక (జిల్లా & రాష్ట్ర స్థాయిలో వివిధ పదవులు నిర్వహించారు)
1996 11వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యాడు
1996-97 సభ్యుడు, ఫైనాన్స్ కమిటీ; సభ్యుడు, కన్సల్టేటివ్ కమిటీ, ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ
1998 12వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యాడు (2వసారి)
1998-99 రవాణా
1999 13వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యాడు (3వసారి)[4]
1999-2000 సభ్యుడు, వాణిజ్య కమిటీ; సభ్యుడు, రవాణా & పర్యాటక కమిటీ

ఇతర వ్యాపారాలు[మార్చు]

ఆయన విజయ కర్ణాటక పత్రికను స్థాపించి నెంబర్ వన్ సర్కులేషన్ ఉన్న పత్రికగా వెలుగుతున్న సమయంలో 2007లో టైమ్స్‌కు విక్రయించాడు. ఆయన ఆ తర్వాత తన కుమారుడు ఆనంద్‌తో కలిసి మళ్లీ విజయవాణి పత్రికను 2012లో స్థాపించి 8 లక్షల సర్కులేషన్‌తో నెంబర్ డైలీ న్యూస్ పేపర్‌గా ఉంది.

సినిమా[మార్చు]

విజయానంద్ జీవిత చరిత్రపై 2022లో వీఆర్ఎల్ ఫిలిం ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై[5] ఆయన కుమారుడు ఆనంద్ సంకేశ్వర్ 'విజయానంద్' సినిమాను నిర్మించాడు.[6]

మూలాలు[మార్చు]

  1. "Sankeshwar, Shri Vijay - Members Bioprofile". lokasabha.nic.in.
  2. "Board of Directors of VRL". vrlgroup.in. Archived from the original on 6 జూన్ 2017. Retrieved 4 June 2017.
  3. "Instagram".
  4. Lok Sabha (2022). "Vijay Sankeshwar". Archived from the original on 2 January 2023. Retrieved 2 January 2023.
  5. V6 Velugu (11 November 2022). "వి.ఆర్‌.ఎల్ ఫిల్మ్‌ ప్రొడ‌క్షన్స్ బ్యానర్‌లో విజయానంద్ చిత్రం". Archived from the original on 2 January 2023. Retrieved 2 January 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Eenadu (3 August 2022). "'విజయానంద్‌' ప్రయాణం". Archived from the original on 2 January 2023. Retrieved 2 January 2023.