Jump to content

విజయానికి ఎనిమిది సూత్రాలు

వికీపీడియా నుండి
'
కృతికర్త: మల్లాది కామేశ్వర రావు
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): మెమరీ టెక్నిక్‌పై తెలుగులో తొలి పుస్తకం
ప్రచురణ: శ్రీ వెంకటేశ్వర బుక్ డిపో విజయవాడ
విడుదల: తొలి ముద్రణ 2011మే
పేజీలు: 271

విజయానికి ఎనిమిది సూత్రాలు రచయిత విశాలాంధ్ర దినపత్రిక ఉద్యోగి, పత్రికా సంపాదకత్వం వృత్తిగాఅ స్వీకరించిన మల్లాది కామేశ్వరరావు. ధారణాశక్తిని పెంపొందించడానికి ఉపకరించే తొలి ప్రయోగాత్మ పుస్తకమిది. విద్యార్థుల ధారణాశక్తిని పెంపొదిందించి ప్రగతిపధంలో నడిపించే లక్ష్యంతో వ్రాయబడిన ప్రయోగాత్మక పుస్తకం. ఈ పుస్తకలో ఆలోచనలకు మూలమైన మెదడు కంప్యూటర్‌తో పోల్చబడింది. మెదడుకున్న శక్తిని గిర్తించడం, ఆలోచనాతీరును మార్చుకోవడం, ధారణాశక్తిని అభివృద్ధిచేసుకోవడం ఎలాగో వివరించబడింది. చదువును ఆరాధించడం మంచి విద్యార్థిగా, మంచి శిస్యుడిగా, పలువురికి ఆదర్శంగా నిలవడానికి అవసరమైన మార్గాలు సూచించబడ్డాయి. తమను తాము మార్చుకుని ప్రపంచన్ని కొత్త దృష్టికోణంతో చూస్తూ విజయం సాధించడమెలాగో తెలియజేస్తుంది.

సాధారణంగా వ్యక్తిత్వ నిర్మాణం ( పర్సనాలిటీ బిల్డింగ్) గురించిన ఇలాంటి పుస్తకాలు ఆంగ్లభాషలో అత్యధికంగా లభిస్తున్నాయి. అచ్చ తెలుగులో సరళమైన భాషలో రచించబడి విద్యార్థులలో ప్రేరణకలిగించి ఉన్నతిని సాధించడానికి సహకారాన్ని అందించే ఇటువంటి ప్రయోగాత్మకమైన పుస్తకాలలో ఇది మొదటిదని పుసకం కడపటి పత్రంలో వివరించబడింది.

తొలిపలికులో రచయిత మనోభావం

[మార్చు]

జీవితం వడ్డించిన విస్తరికాదు. జీవితం అంతా సుఖంగా ఉండదు. కష్టలు ఉంటేనే సుఖం వద్తుంది.విజయానికి వెలచెల్లించాలి.ఊరకనే విజయం రాదు. ఒకవేళ ఊరకనే విజయం వస్తే అది ఎన్నాళ్ళో ఉండదు. అట్టి విజయాన్ని నిలుపుకునే శక్తి మీలో ఉండదు. అలాంటి విజయాన్ని మీరు కూడా మర్యాదగా చూడరు. అందుకే కష్టపడి విజయం సాధించండి. అనే ప్రోత్సాహ కరమైన మాటలతో మొదలౌతుందీ పుస్తకం.

రచయిత ముందుమాట

[మార్చు]

ముందుమాటలో మనసు. మనసు మీద ఆలోచనల ప్రభావం, అలోచనల ప్రభావం బాల్యం మీద ఉంటుంది, బాల్యావస్థలో తల్లితండ్రులు, సోదరులు, గురువులు, కుటుంబపరిస్థితుల పరిస్థితుల ప్రభావం పడుతుంది. ఇంకా టీ.విలు, సినిమాలు, క్రీడలు విద్యార్థుల మీద చూపే ప్రభావం గురించి వివరించ బడుతూ మనసును పక్కదారులు పట్టించే ఈ ప్రభావాల నుండి తప్పించుకోవడానికి మార్గదర్శం సూచించడం. విజయం సాధించడానికి మంచి పుస్తకాలను పఠించవలసిన అవసరం, ప్రపంచాన్ని చూడవలసిన దృష్టి కోణం మార్చుకోవడం, పనిలో నైపుణ్యం పెంపొదిచుకోవలసిన అవసరం గురించి రచయిత వివరణ చోటుచేసుకుంది.

ప్రముఖుల అభిప్రాయాలు

[మార్చు]

పుస్తకం గురించి అభిప్రాయ వెలిబుచ్చిన ప్రముఖులు విశాలాంధ్ర సంపాదకులు ఈడ్పుగంటి నాగేశ్వరరావు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్. టి.ఎస్ రావు, పి.హెచ్.డి, డాక్టర్ వై.దివాకర్ ముఖ్యులైతే రచయితకు పుస్తకరచనకు ప్రేరణ కలిగించిన ముఖ్యత్వం ఐ.ఎన్.ఐ రామ్‌కుమార్ పి.ఎం.జె.ఎఫ్ కు చెందుతుంది.

ఈడ్పుగంటి నాగేశ్వరరావు అభిప్రాయం

[మార్చు]

ఈడ్పుగంటి నాగేశ్వరరావు మాటలలో మనిషి ఎదుగుదల కావడానికి, ఆధునిక విఙానయుగంలో మనిషి పురోగతి సాధించడానికి ఏకాగ్రత అవసరమని ఆ ఏకాగ్రత సాధించడానికి ఈ పుస్తంకం సహకరిస్తుందని అభిప్రాయం వెలువడింది. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు లక్ష్యసాధన కొరకు పురోగమించడానికి ఈ పుస్తకం ఉపకరిస్తుందని ఆలోచనకు పదును పెడుతుందని కూడా అభిప్రాయం వెలువడింది.

డాక్టర్ టి.ఎస్ రావు

[మార్చు]

డాక్టర్ టి.ఎస్ రావు గారి మాటలలో ప్రతిఒక్కరు కలలు కనాలని వాటిని నీరుకార్చకుండా సాకారం చేసుకోవడానికి ప్రయత్నించాలని విజయాన్ని ఎవరూ అందించరని తమకు తామే సాధించాలని అభిప్రాయం వెలువడింది. అత్యున్నత స్థాయికి ఎదిగిన వారి నుండి స్ఫూర్తి తీసుకుని ముందుకు సాగాలని. వాహనం నడపడానికి ఇంధనంలా మనషిని పురోగమించడానికి సంకల్ప బలం కావాలని ఆ సంకల్పబలం ఈ పుస్తకం అందించగలదని ఆయన అభిప్రాయాల సారాంశం. ఈ పుస్తకం కనీసం లక్షమందిలో అలాంటి సంకల్పం కలిగించగలదని ఆయన అభిప్రాయపడడం కొసమెరుపు.

డాక్టర్ వై.దివాకర్

[మార్చు]

విజయం సాధించినవాడే సూత్రాలను వల్లించగలడు. విజయం సాధించడంలో తాను ఎదుర్కొన్న సమస్యలను అనుభవాలను క్రోడీకరించిన పుస్తకమిదని డాక్టర్ టి.ఎస్ రావు అభిప్రాయం. ఇవి విజయానికి సోపానాలు కాదని సోపానాలను అధిరోహించిన వారెవరైనా కిందకు దిగక తప్పదని ఇవి సూత్రాలని ఇవి శాశ్వతంగా మానవపురోగతికి తోడ్పడగలవని ఈ పుస్తకంలో అది సరళమైన శైలిలో వివరించబడిందని డాక్టర్ టి.ఎస్ రావు మాటలు వివరించాయి.

అక్షరలక్షలు

[మార్చు]

ఈ పుస్తకంలోని ప్రతిపేజీ చివర పేజీలోని సారాంశం అక్షరలక్షల విభాగంలో చోటుచేసుకుంది. అక్షరలక్షలలోని ప్రధాన అంశాలు.

  • విజయానికి ఎనిమిది విభాగంలో సూత్రాలు విభాగంలో అక్షరలక్షలు:-
  1. విజయాన్ని సాధించేవారు విభిన్నమైన పనులు చేయకున్నా అందరు చేసే పనిని విభిన్నంగా చేస్తారు.
  2. విజయం ఎలా సాధించాలో చాలా మందికి తెలుసు. తరువాత ఏమి చేయాలో ఎలా ప్రవర్తించాలో కొద్ది మందికి మాత్రమే తెలుసు.
  3. విజయం కొరకు ప్రత్నిస్తూనే ఉండాలి. ఎదురుచూస్తూనే ఉండాలి. చివరివరకు ప్రయత్నం కొనసాగుతూనే ఉండాలి.
  4. ఓటమిలోనూ అది తీసుకువచ్చే నిరాశలోనూ గొప్ప అవకాశం దాగి ఉన్నదని తెలుసుకోవాలి. ఓటమి అనే నివురు లోపల విజయం అన్న నిప్పుకణిక దాగి ఉంది.
  5. మనలని గొప్పవాడిని చేసే అర్హత పొరుగువాడికి ఉండదు.
  6. కొంతమంది అపజయానికి కారణం తెలుసుకుంటారు. దాని మీద దృష్టి కేంద్రీకరిస్తూ అపజయానికి కారణ అయిన పనిని తిరిగి చెయ్యరు. అయినా దృష్టిని మళ్ళించి ఆపైన ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే విజయానికి మార్గం సుగమం ఔతుంది. విజయం అహ్వానం కూడా పలుకుతుంది.

మైండ్ సెట్టింగ్

[మార్చు]

మొదటి సూత్రమైన మైండ్ సెట్టింగ్ విభాగంలో చోటుచేసుకున్న ఆసక్తికరమైన ప్రధానాంశాలు.

  1. మనిషి మెదడులో 10,000 కోట్ల నూరాన్లు ఉన్నాయి.
  2. న్యూరాన్లు ఎలా పనిచేస్తాయి ?
  3. మెదడు శక్తిని మనం పూర్తిగా వినియోగిస్తున్నామా ?
  4. మెదడు ఆడే ఆటలలో మరచిపోవడం ఒకటి.
  5. మెదడు పనితీరు మెతుగుపరచాలంటే.
  6. కథలు చదవడం మెదడుకు మంచి వ్యాయామం.
  7. మెదడును ఎప్పుడూ ఉత్సాహభరితంగా ఉంచుకోవాలి.
  8. అతి భయానికి కౌంసిలింగ్ అవశ్యం.

అక్షరలక్షలు:-

  • మనిషి మెదడులో 10,000 కోట్ల నూరాన్లు ఉన్నాయి.
  1. మీ మెదడుకు మీరు ఏమి చెప్తే మీ జీవితానికి అదే చేసిపెడుతుంది.
  2. విజయాశిఖరాలను చేరుకున్న ప్రముఖులు అక్కడకు అకస్మాత్తుగా చేరుకోలేదు. మిగిలిన ప్రపంచం సుఖంగా నిద్రిస్తున్న సమయంలో కూడా వారు నిరంతరంగా

శ్రమిస్తూ ఉంటారు. వాఖ్య (హెచ్.డబ్ల్యూ. లాంగ్ ఫెలో )

  • న్యూరాన్లు ఎలా పనిచేస్తాయి ?
  1. పనిలో మార్పులేనప్పుడు విజయం వరించడం కష్టం. ఉత్తమమైన పనిని సరికొత్తగా ప్రారంభించండి.
  2. ఊహాశక్తి లేని మెదడు చివరకు నిర్వీర్యం ఔతుంది.
  • మెదడు శక్తిని మనం పూర్తిగా వినియోగిస్తున్నామా ?
  1. మనిషి మెదడు కొన్ని కోట్ల ఙానబిందువులకు నిలయం. దానిని ఎలా వాడుకోవాలో మనిషే నిర్ణయించుకోవాలి.
  2. నైపుణ్యంతో ఆలోచించి పనిచేసిన వారి గొప్పదనం ఎప్పటికైనా గుర్తింపబడుతుంది.
  • మెదడు ఆడే ఆటలలో మరచిపోవడం ఒకటి.
  1. చదివిన విషయం పునఃశ్చరణ చేసుకోకుంటే అది మరుగున పడుతుంది. పునఃశ్చరణ చేసుకున్న విషయం దీర్ఘకాలం గుర్తుంటుంది.
  2. మెదడును సక్రమంగా వాడుకున్న మనిషి యావత్ప్రపంచాన్ని శాసించగలడు.
  • మెదడు పనితీరు మెరుగుపరచాలంటే.
  1. క్రీడాకారులు విజయం సాధిస్తారు. క్రీడాకారులు ఓడిపోతారు. క్రీడాకారులు గెలుపు ఓటములతో పనిలేకుండా అభ్యాసం కొనసాగిస్తూనే ఉంటారు. ప్రతిఒక్క మనిషి వారిలా అభ్యాసం కొనసాగిస్తూనే ఉండాలి.
  2. ఒకద్వారం మూసి ఉంటే మరొక ద్వారం తెరచి ఉంటుంది. అయినా మనిషి మూసి ఉన్న ద్వారం వైపే చూస్తూ ఉంటే తెరచి ఉన్న ద్వారానికి ఎప్పటికీ చేరలేడు.
  3. విజయం ఒక్కసారిరయత్నిస్తే రాదు. విజయం లభించే వరకూ ప్రయత్నిస్తూనే ఉండాలి. ఒకటి, రెండు ఓటములు జీవితకాల ఓటమి కాదు అంతమాత్రాన మనిషి తనకు తాను చేతకానివాడు కాదు.
  • కథలు చదవడం మెదడుకు మంచి వ్యాయామం.
  1. అదృష్టం కొరకు వెతుకుతూ కాలయాపన చేస్తే అది మీ వద్దకు ఎన్నటికీ రాదు. ప్రయత్నమే అదృష్టానికి ఆహ్వానం.
  2. అవకాశాలన్నీ దేవుడు మీ కొరకు ఇచ్చినవే. వాటిని మీరందుకోకపోతే మరొకరు అందుకోవడం ఖాయం. విరుద్ధ భావాలు అవకాశాలను తన్ని వేస్తాయి. లేదా ఉపేక్షించేలా చేస్తాయి.
  3. చూడడం మీ ఇష్టం మీ ఇష్టం అనుసరిస్తూ మీ చూపు, మీ చూపును అనుసరిస్తూ ప్రయత్నం, దానిని అనుసరిస్తూ ఫలితం ఉంటాయి.
  4. ప్రారంభించి ఆపివేసిన పనులను పూర్తిచేయండి. పూర్తి అయిన తరువాత మీకు కలిగే భావాన్ని గమనించండి.
  5. అనుకూలమైన ఆలోచనలు మనిషికి బలం తీసుకువస్తాయి. ప్రతికూలమైన ఆలోచనలు మనిషి బలం లాగివేస్తాయి.
  6. విజయం అనేది " రహస్యం" కాదు. ప్రాథమిక సూత్రాలను పట్టువదలకుండా పనిచేస్తే ఫలితం కూడా అంతే. కొన్ని తప్పులు వరుసగా చేయడం వలన కలిగే ఫలితం " ఓటమి".
  • మెదడును ఎప్పుడూ ఉత్సాహభరితంగా ఉంచుకోవాలి.
  1. జీవితంలో ఏదీ అదృష్టం ద్వారా రాదు. స్వేదబిందువు చిందిస్తే అద్భుత ఫలితం మీ స్వంతం.
  2. వేల మైళ్ళ ప్రయాణాన్ని ఒక్క అడుగుతో ప్రారంభించాలి. (వాఖ్య- లావోస్)
  3. మిమ్మల్ని మీరే నమ్మకపోతే ఇతరుల్ని ఎలా నమ్ముతారు? ఇతరులు మిమ్మల్ని ఎలా నమ్ముతారు? ఎవరినీ నమ్మని వారు సాధించేది ఏదీ లేదు.
  4. ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినడం అలవాటు చేసుకుంటే - మీరు వృధాగా మాట్లాడడం తగ్గిస్తారు.
  • అతి భయానికి కౌంసిలింగ్ అవశ్యం.
  1. విజయం సాధించే వాళ్ళంతా మేధావులు కాదు. కాకుంటే వారు ఏకాగ్రతతో ఆలోచిస్తారు.
  2. సదా మీ ఆలోచనలు చెడ్డగా ఉండడం వలన మీ రక్తం అంతా విషపూరితం ఔతుంది.
  3. ఓర్పు అన్నింటికీ మూలం గుడ్డు పొదిగినప్పుడే పిల్ల వస్తుంది - పగులకొడితే రాదు ( వాఖ్య- అర్నాల్డ్ గ్లాస్కో)
  4. గొప్పలక్ష్యం సాధించడానికి ప్రయత్నించి విఫలం కావడం నేరం కాదు. గొప్ప లక్ష్యం లేకపోవడమే నేరం.

ఫలితం

[మార్చు]

మొదటి సూత్రాన్ని ఆచరిస్తే ఆత్మవిశ్వాసం, నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకోవడం, అనుకున్నది సాధించడం, చదివింది ధారణ చెయ్యడం, చదువడాన్ని ఆరాధనగా మార్చుకోవడం, మంచిస్నేహాలను ఏర్పరచుకోవడం సాధ్యమన్నది రచయిత అభిప్రాయం.

మోటివేషన్

[మార్చు]

మోటివేషన్ విభాగ్ంలో ప్రధాన సూత్రాలు.

  1. మంచి ఆలోచనా తీరు అంటే.
  2. బద్దకం వదిలించండి.
  3. భయాన్ని జయించండి.
  4. మంచి మాట తీరు అలవరచుకోండి.
  5. అనుకుంటే సరిపోదు-- ఆచరించాలి.
  6. కొంచెం ఆలోచించండి.

అక్షరలక్షలు :-

  1. మంచి ఆలోచనా తీరు అంటే.
  2. మనం చదివే పుస్తకాలే మన అలవాట్లకు, మన ఆలోచనలకు, మన కోరికలకు పునాదులు వేస్తాయి.
  3. ఆఫిల్ పండు కింద పడడం చూసిన న్యూటన్ భూమ్యాకర్షణ శక్తిని కనుగొన్నాడు. రైట్ బ్రదర్స్ విమానం కనుకున్నారన్నా, గ్రహం బెల్ టెలిఫోన్ కనుకొన్నాడన్నా, థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బు కనుకున్నాడన్నా, అందుకు వారి పూర్వజన్మసుకృతం కారణం కాదు వారి ఆలోచనలే ఈ అద్భుతసృష్టికి కారణం.
  • బద్దకం వదిలించండి.
  1. వాడని ఇనుము తుప్పుపడుతుంది. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. బద్ధకం మెదడును నిస్తేజం చేస్తుంది. (వాఖ్య- లియోనార్డ్ డావింసీ).
  2. ఎప్పటి పని అప్పుడే చేయాలి. జీవితంలో ప్రతిపనిని దానికి నిర్డేశించిన సమయంలో చేసెయ్యాలి. రెండోఅవకాశం కొరకు వాయిదా వెయ్యద్దు.
  3. నీ జీవితం నీది. దానిని నీకు దేవుడు ఇచ్చాడు. దానిని చెడగొట్టుకోవడం, బాగుచేసుకోవడం నీ ఇష్టం. చెడగొట్టుకుంటే దాని ఫలితం నువ్వే అనుభవించాలి.
  • భయాన్ని జయించండి.
  1. పిరికివాళ్ళు మరణానికి ముందు అనేకమార్లు మరణిస్తారు. ధైర్యవంతులు చావును ఒక్కమారే రుచి చూస్తారు. (వాఖ్య-విలియం).
  2. ఒక అలవాటును వదిలించుకోవాలన్నా, అలవరచుకోవాలన్నా, మూడువారాలపాటు బుద్ధిపూర్వకంగా, విడవకుండా చెయ్యాలి.
  3. చేయగలిగిన పనిని ఆచరించండి, హాని కలిగించే చెడుని విసర్జించండి, ఇలాచేస్తూ పోతే అదే ఒక అలవాటుగా మారుతుంది.
  • మంచి మాట తీరు అలవరచుకోండి.
  1. మంచి అలవాట్లను నేర్చుకోవడం కష్టం, కానీ అవి జీవితాన్ని సుగమం చేస్తాయి. చెడు అలవాట్లు సులభంగా అలవాడతాయి. కానీ జీవితంలో కష్టాలను కొనితెస్తాయి.
  • అనుకుంటే సరిపోదు-- ఆచరించాలి.
  1. అలవాటనేది మొదట బలహీనంగా మొదలై చివరకు బలమైనదిగా తయారౌతుంది.
  2. ఎక్కువమంది ప్రకృతి వైపరీత్యాలకంటే అనుచితమైన మాటలవల్లే బాధపడతారు. ఇష్టమొచ్చిన మాటలు మాట్లాడకండి. మాటలను ఎంచుకుని మరీ మాట్లాడండి. వివేకానికీ మూర్ఖతకీ తేడా అక్కడే ఉంది.
  • కొంచెం ఆలోచించండి
  1. మనం మరణించినప్పుడు ఒక మంచి వ్యక్తిని పోగొట్టుకున్నామే అని లోకం మనకోసం ఏడవాలి.ఇది జరగాలంటే మన జీవన నడవడిక ఎలా ఉండాలి ?
  2. ఎప్పుడూ నిజాన్ని చెప్పే వ్యక్తి అబద్ధం చెప్పిన మొదటిసారే పట్టుబడిపోతాడు. అలాగే ఎప్పుడూ అబద్దాలు చెప్పేవ్యక్తి మొదటిసారి నిజం చెబితే ఎవరూ నమ్మరు.

ఫలితం

[మార్చు]

రెండవ సూత్రం ఆచరిస్తే ఏ పనైనా సాధించగలమన్న ధీమా, నిజాయితీతో కూడిన విజయంపట్ల మక్కువ, సాధించే వరకు ఆగని ప్రయత్నం, నైపుణ్యంగా లక్ష్యంగా పనిచెయ్యడం, తక్కువగా మాట్లాడడం, ఎక్కువగా వినడమూ చదవడమూ, మంచి కొరకు ఆలోచిస్తూ, మంచి జరుగుతుందని భావిస్తూ, అందరూ మంచిగా ఉండాలని కోరుకోవడం అలవాడతాయని రచయిత భావం.

విన్నర్ యాటిట్యూడ్

[మార్చు]
  1. విజేతల లక్షణాలు.
  2. విజయం సాధించాలంటే బర్నింగ్ డిజైర్ (ప్రజ్వలించే కోరిక) ఉండాలి.
  3. వాదించకండి - చర్చించండి.
  4. విజయం రాదు, సాధించాలి.
  5. క్యాంపస్ ఇంటర్వ్యూ అంటే టెన్షనే.
  6. క్యాంపస్ ఇంటర్వ్యూలో నెగ్గాలంటే --

అక్షరలక్షలు:-

  • విజేతల లక్షణాలు
  1. ఒర్పువల్ల విశ్వాసం కలుగుతుంది. నిర్ణయించుకునే శక్తి లభిస్తుంది. వివేకంతో కూడిన దృష్టికోణం అలవడుతుంది. ఇది విజయానికి దారి తీస్తుంది.

(వాఖ్య- బ్రియాన్ ఆడంస్ )

  1. మర్యాద మంచి నడవడి ఎప్పుడూ కలిసే ఉంటాయి. బయటి వారితోనే కాక ఇంట్లో ఉన్నవారితోకూడా మంచిగా నడచుకోవడం అనేది చాలా ముఖ్యం. మర్యాద అంటే మంచి నడవడి అలవరచుకోవడమే.
  2. లక్ష్యం లేని పయనం ఎటువైపు సాగినా ఫలితం ఒక్కటే.
  • విజయం సాధించాలంటే బర్నింగ్ డిజైర్ (ప్రజ్వలించే కోరిక) ఉండాలి.
  1. ప్రయత్నంచేసి విఫలమయ్యేవారు, అసలు ఏప్రయత్నం చెయ్యకుండానే విజయం సాధించేవారికంటే మెరుగైనవారే. (వాఖ్య-లాయిడ్ జోంస్)
  2. మీరు ఏదైనా పనిచేసే ముందు - నేనీ పని చేస్తే మ అమ్మ " భలేచేసావు " మెచ్చుకుంటుందా లేక " ఇలా చేసావేమిటి " అని సిగ్గుతో తలదించుకుంటుందా ? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అప్పుడా పని చెయ్యాలో వద్దో మీకే తెలుస్తుంది.
  • వాదించకండి - చర్చించండి.
  1. మీరు ఇంట్లోగానీ, ఆఫీసులోగానీ, ఒంటరిగాగానీ, ఇతరులతో కలిసిగానీ - ఏదైనా ఒక పనిచేస్తున్నప్పుడు నేను చేస్తున్న పని నా పిల్లలు చూస్తే, వాళ్ళు దానిని చూడడం నేను ఇష్టపడతానా ? లేక సిగ్గుపడతానా ? " అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అప్పుడా పనిచేయాలో వద్దో మీకే తెలుస్తుంది.
  2. పిరికివాళ్ళు మృత్యువుకు ముందే పలుమార్లు మరణిస్తారు. ధైర్యవంతులు చావును ఒకేసారి రుచిచూస్తారు. (వాఖ్య-విలియం షేక్స్‌పియర్)
  • విజయం రాదు, సాధించాలి.
  1. ఒకవేళ కొలంబస్ వెనక్కి తిరిగి (వెళ్ళిపోయి) ఉంటే ఆయనను ఎవరూ నిందించేవారు కాదు - కానీ ఆయనను ఎవరూ గుర్తుపెట్టుకునేవారు కాదు.
  2. వినయం అంటే తమని తాము తక్కువగా భావిస్తారని అర్ధం కాదు. తమ గురించి తాము తక్కువగా ఆలోచిస్తారని మాత్రమే అర్ధం.
  3. వేల మైళ్ళ పయనం ఒక్క అడుగుతోనే మొదలౌతుంది. ( చైనీయుల సామెత)
  • క్యాంపస్ ఇంటర్వ్యూ అంటే టెన్షనే.
  1. నేడు మళ్ళీ తిరిగి రాదు దానిని పూర్తిగా ఉపయోగించుకుంటాను. నేను ఇంకొకరిని ఎప్పుడూ కాను. నన్ను నేను పూర్తిగా ఉపయోగించుకుంటాను.
  2. గెలిచినవాడు గెలవక ముందే గెలవాలని అనుకున్నవాడే ! గెలిచేవాడు ముందే గెలిచిన చిత్రాన్ని మనసులో ముద్రించుకున్నవాడే !
  • క్యాంపస్ ఇంటర్వ్యూలో నెగ్గాలంటే --
  1. " బాస్ ఎప్పుడూ తనమూడ్‌తో నిమిత్తం లేకుండా వచ్చిన వారు చెప్పింది వినాలి. వచ్చిన వారు చెప్పింది విని కంపెనీకి ఏది లాభదాయకమో యోచించి నిర్ణయించాలి.
  2. పోటీ పరీక్షలకు ఆసక్తితో, అభిమానంతో చదవాలి. దానిని ఒక జీవన్మరణ సమస్యగా తీసుకోకూడదు.
  3. నీ ఆశయసాధనలో వెయ్యిసార్లు విఫలమైనా ఫరవాలేదు. మరొకసారి ప్రయత్నించు. ( వాఖ్య- వివేకానంద)

ఫలితం

[మార్చు]

మూడవ సూత్రం ఆచరణలోకి వస్తే అతి పెద్ద లక్ష్యం ఏర్పరుచుకోవడం, సదా లక్ష్యం గురించి ఆలోచించడం, ప్రథమస్థానంలో ఉండాలని కోరుకోవడం, అందుకొరకు తపిస్తూ అనుక్షణం కృషిచేయడం, నేర్చుకోవలసినది చాలా ఉందని తెలుసుకోవడం, నిజాన్ని ప్రేమిస్తూ నిజమే మాట్లాడడం, గొప్పలు చెప్పకపోవడం, అందరితో మంచిగా మసలడం, మంచి మాటతీరు అలవరచుకోవడం, విశ్లేషాత్మకంగా ఆలోచించడం అలవడతాయని రచయిత మనోభావం.

స్టడీ స్కిల్స్

[మార్చు]

ఈ విభాగంలో ప్రధాన సూత్రాలు.

  1. చదువుకోవడం ఎంత సులభమో !
  2. ఒక విషయాన్ని మరచిపోకుండా గుర్తుపెట్టుకోవాలంటే !
  3. అక్షరమాలను అమలు చేద్దాం !
  4. ప్రశ్నించడం నేర్చుకోండి.
  5. ఎలా ప్రశించాలి ?
  6. శ్రద్ధగా వినడం ఒక కళ!
  7. ఎలా చదవాలో తెలుసుకోవాలి.
  8. ఆసక్తిగా చదవండి.
  9. పునఃశ్చరణ వలన ప్రయోజనం అధికం.
  10. చదువుకోడానికి తెల్లవారుఝామే మంచిదా ?
  11. పరీక్షల్లో విజయం సాధించాలంటే !

అక్షర లక్షలు :-

  • చదువుకోవడం ఎంత సులభమో !
  1. భగవంతుడు మనల్ని ప్రయత్నం చెయ్యమంటున్నాడే కాని, విజయమే ముఖ్యమైని చెప్పలేదు. (వాఖ్య-మదర్ థెరీసా)
  2. మంచి జరుగుతుందని నమ్మండి. ప్రతిపనికి ముందు ప్రార్థించండి. దేవుణ్ణి తోడుగా ఉండమని అడగండి. దేవుడు తోడుగా ఉన్నాడని నమ్మండి.
  3. మానవుడు దేనినైతే వెతుకుతున్నాడో అది అతడికి అతి సమీపంలో ఉంది. అయినా దానిని అతడు అక్కడక్కడా వెతుకుతుంటాడు.
  4. ఎదుటి వాడికి ఏది ఇస్తే అదే వస్తుంది. ప్రేమను ఇవ్వండి. ప్రేమే వస్తుంది. మంచిని ఇవ్వండి మంచే లభిస్తుంది.
  • ఒక విషయాన్ని మరచిపోకుండా గుర్తుపెట్టుకోవాలంటే !
  1. అందరికీ గౌరవాన్ని ఇవ్వండి. కొందరితోనే సన్నిహితంగా ఉండండి. అదికూడా బాగా పరీక్షించిన తరువాతనే (జార్జివాషింగ్టన్)
  2. ఒక విషయం పూర్తిగా తెలవడాన్ని " పాండిత్యం " అంటారు. సమయానుకూలంగా ప్రవర్తించడాన్ని " సమయస్పూర్తి అంటారు. పరిష్కారం ఆలోచించడాన్ని " ప్రఙత " అంటారు. ఇవన్నీ కలిస్తే వచ్చేది ఙానం అంటారు. ఙానం లేని చదువు వృధా !
  3. పసిపిల్లవాడి వంటి విశ్వాసం ఉండాలి. తల్లిని చూడాలని పసిపిల్లవాడు ఎలా ఆశపడతాడో అలా అటువంటి ఆరాటం ఉండాలి. అటువంటి ఆరాటం కలిగిన మరుక్షణం భగవంతుడు దర్శనం ఇస్తాడు.
  • అక్షరమాలను అమలు చేద్దాం !
  1. నిరంతరం మనం దేని గురించి ఆలోచిస్తామో, దానిలాగే తయారౌతాము, యద్భావం తద్భవతి అంటే ఇదే !
  2. జీవితంలో బాగుపడ్డవారు ఎక్కువగా విన్నవారే, వారు ఎదుటివారిని చెప్పనిస్తారు.
  3. సంసారం అనేది తల్లి ఆడించే ఆట. ఆమె లీల. దాగుడుమూతల ఆటలో దొంగను తప్పించుకుని వచ్చి తల్లిని తాకినవాడు పండిపోతాడు. ఆట కొనసాగడం జగన్మాతకు వినోదం.
  4. ఎల్లప్పుడూ నేర్చుకునే వ్యవస్థలో ఉండండి. కాలేజిలో నేర్చుకున్నది సరిపోదు. అది సమాచారం మాత్రమే. విఙానం కాదు. కేవలం కాలేజిలో నేర్చుకున్నదాని వలన గొప్పవారు కాలేరు.
  • ప్రశ్నించడం నేర్చుకోండి.
  1. అవకాశాలు మనపక్కనే ఉంటాయి. ఎక్కడికో వెళ్ళవలసిన పనిలేదు. వాటిని గుర్తిస్తేచాలు.
  2. వాయిదావేసే స్వభావం ఉండకూడదు. ఎప్పటి పనులు అప్పుడే చేసుకోవాలి.
  3. అవకాశాన్ని గుర్తించగలగడం, అందుబాటులోకి వచ్చినప్పుడు అందుకోగల్గడం తెలుసుకోవాలి.
  • ఎలా ప్రశించాలి ?
  1. మీరు మానసికంగా చైతన్యంగా ఉన్నప్పుడు అన్ని విషయాలూ ఉత్సాహంగా తెలుసుకుంటారు.
  2. చదువు వచ్చీ పుస్తకాలు చదవని వ్యక్తికీ, చదువు రాని వ్యక్తికీ పెద్ద తేడా లేదు. ( వాఖ్య- మార్క్‌ట్వెయిన్)
  3. మంచిగా ఉండడంలో గొప్పకీర్తి ఉందనడాన్ని మహానుభావులు మాత్రమే గుర్తిస్తారు. ( వాఖ్య- సోఫిక్లిన్)
  4. యదార్ధాలన్ని చాలా తేలికైన విషయాలే, పాటించాల్సి వచ్చినప్పుడే కష్టాలు ఎదురౌతాయి.
  • శ్రద్ధగా వినడం ఒక కళ.
  1. ఈ భూమిమీద మానవుడుగా పుట్టడం కంటే అద్భుతమైనది ఏదీలేదు. (వాఖ్య- గోర్కే)
  2. కేవలం బలమైన పట్టుదల, ఆత్మవిశ్వాసాల వల్ల మాత్రమే విజయం సాధించగలరు.
  • ఎలా చదవాలో తెలుసుకోవాలి.
  1. అసలు నిచ్చెన ఎక్కాలన్న తాపత్రయమే మీకు లేకుంటే ఇతరులు మిమ్మల్ని ఎలా ఎక్కించగలరు?
  2. ప్రపంచంలో 70% మంది " భగవంతుడు నా తలరాతను ఇలగే వ్రాసాడు. నాకు అదృష్టంలేదు. నాకు బిడియం. నేను అందరిలో కలిసిపోలేను. నాకు సృజనాత్మకత లేదు " అనుకుంటారు. వారి నెగిటివ్ (ప్రతికూల) ఆలోచనలే వారిని వెనక్కి నెట్టేస్తుంటాయి.
  3. మీరు దేనినైనా విశాలదృక్పథంతో అర్ధం చేసుకుంటే దాని పట్ల మీ భావాలను మార్చుకోగలరు.
  • ఆసక్తిగా చదవండి.
  1. ఒక లక్ష్యంతో కృషిచేస్తే ప్రతివ్యక్తికీ నేడు కాకపోతే రేపైనా బాగుపడే అవకాశం వచ్చితీరుతుంది.
  2. ఏమిటి ? ఎందుకు ? ఎలా ? అని ప్రశ్నించడం ద్వారా, తప్పుల నుండి గుణపాఠం నేర్చుకోవడం ద్వారా మీ ఆలోచనలకు ఒక పునాది ఏర్పడుతుంది. అదే మీరు జీవించినంత కాలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.
  • పునఃశ్చరణ వలన ప్రయోజనం అధికం.
  1. మీరు పెరిగిన వాతావరణం పరిస్థితులే మీ ప్రవర్తనను వ్యక్తిత్వాన్ని రూపొందిస్తాయి. మీ బాహ్య ప్రవర్తనను నిర్ణయించేది మీ అంతర్గత ఆలోచనా విధానమే.
  2. వేల మైళ్ళ ప్రయాణాన్ని కూడా ఒక్క అడుగుతోనే ఆరంభించాలి. (వాఖ్య- లావోస్)
  • చదువుకోడానికి తెల్లవారుఝామే మంచిదా ?
  1. జీవితంలో ఒక లక్ష్యం కలిగి ఉండు. దాని సాధనకు శాయశక్తులా ప్రయత్నించు.
  2. ఎవరికైతే తమ మీద తమకు విశ్వాసం ఉంటుందో. వారు దేన్నైనా సాధిస్తారు.
  • పరీక్షల్లో విజయం సాధించాలంటే !
  1. ఎప్పుడో చదివిన సబ్జెక్టును ఇప్పుడు మీకు అవసరం లేకపోయినా పునఃశ్చరణ చేసారనుకోండి - దానిని ఇక మీరు జీవితంలో మరచిపోలేరు. సాధారణంగా విద్యార్థులు పరీక్షల సమయం వచ్చినప్పుడే హడావిడిగా బట్టీ పడుతుంటారు. హడావిడి చదువు త్వరగా గుర్తుకు రాదు.
  2. నిజానికి చరిత్ర అన్నది లేదు. ఉన్నవి అన్నీ జీవిత చరిత్రలే. (వాఖ్య - ఎమర్సన్).

ఫలితం

[మార్చు]

నాలుగవ సూత్రం అవగాహన చేసుకుంటే చదువంటే సరదాగా మారడం, చదువుకంటే మరేది ఇష్టం కాకపోవడం, చదవడం ద్వారా మరింతగా నేర్చుకుటూ ఉండడం, ఎవరిని వారు ఇష్టపడడం, తాముచేసే పనిని ఇష్టపడడం, సందేహాలను ఎప్పటికప్పుడు తీర్చుకుంటూ ఉండడం, చదువుకునే విద్యార్థుతోనే మైత్రి గడపడం, కాలక్షేపం చేసే కబుర్లకు దూరంగా ఉండడం, ముఖ్యమైన పాయింట్లను వ్రాసుకుంటూ తరచుగా గుర్తుచేసుకుంటూ ఉండడం, కాలేజీకి ఒక్కరోజుకూడా శలవు పెట్టకపోవడం నడవడితో అందరికీ అభిమానపాత్రుడవడం వంటివి అలవడతాయి.

టైం మేనేజ్మెంట్ (సమయపాలన)

[మార్చు]
  1. అత్యంతవిలువైనది సమయమే.
  2. అందరికీ 24 గంటలే.
  3. కాలిక్యులేటెడ్ మెంటాలిటీ
  4. లక్ష్యసాధనకు పర్ఫెక్ట్ ప్లానింగ్ అవసరం
  5. సరైన ప్లానింగ్ ఉండాల్సిందే
  6. విజయం కావాలంటే కాలంతో పరిగెత్తాలి
  7. వాయిదాల విధానం మంచిది కాదు.
  8. రిక్రియేషన్ కోసం టైం కేటాయించాలి.
  9. నిద్రతక్కువైతే ఇబ్బందే

అక్షరలక్షలు

  • అత్యంతవిలువైనది సమయమే.
  1. దేన్నైనా మనం చాలా కాలం ఆచరించినటైతే అది మనవ్యక్తిత్వంలో భాగమై చాలాకాలం ఉండిపోతుంది.
  2. మీ కోసం మీరు చేసే పోరాటంలో మీకు కావలసింది మీరు పొందినప్పుడు ప్రపంచం మిమ్మల్ని ఒకరోజుకు రాజును చేస్తుంది.
  3. వచ్చిన అవకాశం మళ్ళీరాదు. అంతకంటే మంచిది రావచ్చు, చెడ్డదైనా రావచ్చు.
  4. స్వతంత్రంగా ఆలోచించడాన్ని స్వతంత్రంగా బ్రతకడాన్ని నేర్పేదే విద్య.
  • కాలిక్యులేటెడ్ మెంటాలిటీ
  1. స్కూల్లో మొద్దుగా ఉన్నంత మాత్రాన పనికిరాని వాడని అనుకోనక్కరలేదు. గొప్పవాళ్ళమెదళ్ళు కాస్తంత ఆలస్యంగా వికసిస్తాయి మరి !
  2. మీలో గొప్ప లక్షణాలు ఉంటే సరిపోదు. వాటిని సరిగా మేనేజ్ మెంట్ చెయ్యడమే గొప్పదనం. (ఫ్రెంచ్ తత్వవేత్త)
  • కాలిక్యులేటెడ్ మెంటాలిటీ
  1. మీ ఆలోచనల నిర్మాతలు మీరే. ఈ ప్రపంచంలో మీ ఆలోచనలను మీరే ప్రభావితం చెయ్యగలరు. వేరే వాళ్ళు ఎవరూ మీ ఆలోచనలను అదుపు చెయ్యలేరు. మీకు ఇష్టం లేని విషయాలను

మీరు మరచిపోవాలంటే మీరు ఆ వైపు నుండి మళ్ళించ గలగాలి.

  1. క్రోధం వచ్చినప్పుడు ఒక్క క్షణం పాటు ఓర్పు వహిస్తే వందదినాల విచారం తప్పుతుంది.
  • లక్ష్యసాధనకు పర్ఫెక్ట్ ప్లానింగ్ అవసరం
  1. మీలో ఉన్న చేదు ఆలోచనలకు భరతవాక్యం పలకండి. మీకు నలువైపులా సహకారం లభిస్తుంది. మీలోని బలహీనమైన రుగ్మతలకు ఆలోచనలను ఆలోచనలు మీ అవకాశాలకు ఆటంకంగా నిలుస్తాయి. మీ ఆలోచనలను అదుపులో పెట్టుకోండి అప్పుడు .. మీ విధిని మీరు అదుపులో పెట్టుకోగలరు.
  2. ఈ రోజు చేగలిగిన దేనిని రేపటికి వాయిదా వేయెద్దు. ( వాఖ్య: బెంజిమిన్ ఫ్రాంక్లిన్)
  3. ఒక విషయాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకోవడం వలన అది శాశ్వత ఙాపకశక్తిగా మారుతుంది. 5 నుండి 20 మార్లు పునఃశ్చరణ చేయాలి. ఒక సబ్జెక్టును అదే పనిగా 4 గంటలు చదవడం కంటే 4 సార్లు పునఃశ్చరణ చేసుకోవడం వలన సులభంగా గుర్తుంచుకోవచ్చు.
  • సరైన ప్లానింగ్ ఉండాల్సిందే
  1. మీ తప్పులను పొరపాట్లను గుర్తించి వాటిని మీ ఙాపకాల గని నుండి ఏరి పారవేయండి.
  2. నీ ఆశయసాధనలో వెయ్యిసార్లు విఫలమైనా ఫరవా లేదు. మరోసారి ప్రయత్నించు. (స్వామి వివేకానంద)
  3. మీరెప్పుడు పాజిటివ్‌గా ఆలోచించే వారిమద్య మానసిక పరిపక్వత సాధించిన వారి దగ్గర, విజయం రుచిచూసిన వ్యక్తుల మద్య మీ సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. పాజిటివ్‌గా ఆలోచించే వారి మాటల్లో ఎప్పుడూ ఉత్తేజం, చురుకుదనం, అపారమైన శక్తి ఉట్టిపడుతూ ఉంటాయి. ఆ లక్షణాలు మీలో కూడా అభివృద్ధికావడానికి వారు సహకరిస్తారు.
  • విజయం కావాలంటే కాలంతో పరిగెత్తాలి
  1. అందరూ అంగీకరించడం విజయం కాదు. విజయం, సంతోషం ఒకదాని వెంట ఒకటి ఉంటాయి. కోరుకున్నది లభించడం విజయం, విజయం లభించడం వల్ల కలిగేది సంతోషం.
  2. ఒక ప్రతిభావంతుని అసలు విజయం ఆ కంపెనీలో తన స్థానం ఏమిటో తెలుసుకుని తన పరిధిలో తన తెలివిని వినియోగించడంపై ఆధారపడి ఉంటుంది.
  3. విజేత ఇతరులతో ఎంతబాగా కలిసిపోయి ఉంటాడంటే అతను చెప్పిన మాటను ఎవరూ "కాదు" అనరు.
  4. అసాధ్యం అంటే " అంబానీలకన్నా ధనవంతుడు ఔదామనుకోవడం. లేదా ఐశ్వర్యారాయ్ కంటే అందంగా ఉండాలని అనుకోవడం అసాధ్యమే.అయితే - చాలా కొద్దిమంది ఈ విషయంలో అతి కొద్దిమంది మాత్రమే ఈ విషయంలో విజయం సాధించగలరనుకోవచ్చు.
  5. జీవితంలో మనం ఎంతటి ఉన్నత స్థానానికి వెళ్ళాం. అనే దానిని బట్టి విజయం ఉండదు. ఎన్నిసార్లు మనం వెనుతిరిగాం, కింద పడ్డాం, ఓటమిని చవిచూసాం అనే దాని మీద విజయం ఉంటుంది.
  • వాయిదాల విధానం మంచిది కాదు.
  1. మొదటి ప్రయత్నంలో చాలామంది విజేతలు పరాజితులే. అనుభవాలను గొప్పపాఠాలుగ తీసుకుని తమలక్ష్యం వైపు దృష్టిని నిలిపి ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటిని ఏవిధంగా ఎదుర్కొనవచ్చునో వ్యూహరచనలు చేసుకుని విజేతలగా నిలుస్తారు.
  2. గురువు కేవలం మానవమాత్రుడు కాదు. సచ్చిదానంద పరబ్రహ్మమే గురువు. గురువు అనుగ్రహం వలన భగవంతుడు కనిపిస్తాడు. అప్పుడు గురువు, ఆ ఇష్టదేవతా రూపంలో దర్శనమిచ్చి భగవంతునిలో లీనమౌతాడు. (రామకృరష్ణ పరమహంస).
  • రిక్రియేషన్ కోసం టైం కేటాయించాలి.
  1. ఆనందం ఒక సీతాకోక చిలుక లాంటిది. మీరు వెంటనే తరిమితే అది ఎగిరి పోతుంది. కదలకుండా నిలబడితే అది వచ్చి నీ భుజం మీద వాలుతుంది.
  2. నమ్మకంతోటీ ఓర్పుతోటి సరైనవి చేస్తూ పొండి. ఫలితాలు కంటికి కనిపించకపోయినా, ఏదో మంచి జరుగుతూనే ఉంటుంది.
  3. చెవులు రిక్కించుకుని వినడం మీ హృదయకవాటాలు తెరచుకుని ఉన్నాయనడానికి చక్కని నిదర్శనం. (డేవిడ్ ఆగస్ బర్‌గర్)
  • నిద్రతక్కువైతే ఇబ్బందే
  1. ఒకవేళ మీ పొరుగువాని పట్ల అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు నిద్రపోగలిగితే మీ వంతు కోసం ఎదురుచూడండి. ఎందుకంటే అతని తర్వాత ఉన్నది మీరే కనుక !
  2. తమ ఙాన్నత్యాన్ని గుర్తించకపోవడమే గొప్ప అఙానం. అటువంటి అఙానాన్ని అమాయకత్వం అనలేము.
  3. ఏపొరపాటు చేయని వ్యక్తి మీకు తారసపడ్డాడంటే జీవితంలో ఏమీ చేయని వ్యక్తిని మీరు కలుసుకున్నారని అనుకోవచ్చు.
  4. చిన్నవయసులో ఉన్నప్పుడు క్రమశిక్షణ లేని పిల్లలు కేవలం మీ నిద్రనే పాడు చేస్తారు. కానీ, పెరిగిన తరువాత వాళ్ళు మీ జీవితాన్ని కలవరపరుస్తారు.
  5. ఏపనైన చేసి ముగించండి. ముగించిన ప్రతి పని సంతోషం ఇస్తుందని తెలుసుకోండి.

ఫలితం

[మార్చు]

ఐదవ సూత్రం ఆచరిస్తే ఒక్కక్షణం కూడా వ్యర్ధం చేయక దినచర్యను ప్రణాళికా బద్ధం చేసుకుంటారు. ఉదయాన్నే నిద్రలేవడం, ఏ పనీ వాయిదా వేయక ఎప్పటి పని అప్పుడు చెయ్యడం, ఫంచ్యువాలిటీని ఇష్టపడడం, ప్రాధాన్యతా క్రమంలో పనిచెయ్యడం, సినిమాలకు, టి.వి లకు సమయం వ్యర్ధం చేయకూడదని తెలుసుకుంటారు. నిద్రను అశ్రద్ధ చేయకపోవడం, కాలేజీకి సకాలంలో వెళ్ళడం, స్నేహితులతో కలాక్షేపంలో సమయం వ్యర్ధం చెయ్యకపోవడం అలవడతాయని రచయిత అభిప్రాయం.

కాన్సన్‌ట్రేషన్

[మార్చు]
  1. దేనిమీదా మనసు నిలవడం లేదు.
  2. ఏదీ గుర్తుకురావడం లేదు.
  3. ఏకాగ్రత - ప్రయోజనం.
  4. ఏకాగ్రత లోపిస్తే ఏమి జరుగుతుంది?
  5. మెమరీ పెరగడానికి టెక్నిక్స్ ఏవైనా ఉన్నాయా ..?
  6. ఇమేజ్ క్రియేషన్
  7. లింకింగ్ మెథడ్.
  8. మెమరీ కోడ్స్.
  9. మేజర్ సిస్టం.
  10. మెంటల్ ఫైలింగ్ సిస్టం.
  11. వంశవృక్షం చిట్కా పొందండి.
  12. జర్నీ మెథడ్.
  13. ఫోటోగ్రఫీ మెథడ్స్.
  14. స్పీడ్ రీడింగ్.
  15. సబ్జెక్ట్ సారాంశం గుర్తు పెట్టుకోవాలంటే కథగా చదవవచ్చు.
  • దేనిమీదా మనసు నిలవడం లేదు.
  1. చదవడం ఎలాగో తెలుసుకోవడం - ఏమి చదవాలో తెలుసుకోవడం కంటే ముఖ్యమైనది కాదు.
  2. మీ దేశం మీకేమి చేసింది ? అని అడక్కండి. మీరు దేశానికి ఏమి చేసారు ? అని అడగండి. ( జాన్.ఎఫ్.కెనడీ)
  3. మీరు పడిపోవడం ముఖ్యం కాదు. లేచి ప్రయత్నించారా ? లేదా ? అన్నదే ముఖ్యం. ( వింస్ లాంబార్డీ)
  • ఏదీ గుర్తుకురావడం లేదు.
  1. నమ్మకం మీ స్వంత సృష్టి. ఎలా నమ్మితే అలా జరుగుతుంది.
  2. పుస్తకపఠనానికి మించిన వినోదం, కలకాలం నిలిచే ఆనందం మరొకటి లేదు. ( ఠాగూర్)
  3. ఏపనైన చేసి ముగించండి. ముగించిన ప్రతి పని సంతోషం ఇస్తుందని తెలుసుకోండి.
  • ఏదీ గుర్తుకురావడం లేదు.
  1. మనుష్యులు నాలుగురకాలు..! తనకు తెలియనిదేదీ లేదనుకునేవాడు అఙాని. తనకు తెలిసిందే నిజమని చెప్పేవాడు మూర్ఖుడు. కొత్తని ఒప్పుకోలేని వాడు అహంబావి. తనకున్న

మిడి మిడి ఙానంతో అవతలివారిని అపహాస్యంచేసి ఆనందించేవాడు నీచుడు.

  1. విజేతకు ఓటమి పొందిన వ్యక్తికి తేడా ఒక్కటే, విజేత ప్రయత్నాన్ని ఆపడు.
  2. సూర్యమండలంలో కొంచెం చోటు కావాలంటే కొన్ని బొబ్బలు తప్పవు. (డీన్‌అబ్బీ)
  • ఏకాగ్రత లోపిస్తే ఏమి జరుగుతుంది?
  1. ఏవ్యక్తి అయినా తాను కష్టపడినందువలన పొందవలసింది పొందాను అనుకుంటే అది గర్వమౌతుంది.
  2. మహాత్మా గాంధీ వద్ద ధనం లేదు తుపాకులు లేవు. అయితే- లక్షలాది జనాన్ని కదిలించే శక్తి ఉంది. వారి నమ్మకాన్ని ఆయన పొందారు. ఆయన వెంట వారు నడిచారు.
  3. ప్రతిష్ఠ అనేది ఇతరులు మనగురించి ఏమని ఆలోచిస్తున్నారో తెలియజేస్తున్నది. సౌశీల్యం వల్ల మనమెవరో మనకు తెలుస్తుంది.
  • మెమరీ పెరగడానికి టెక్నిక్స్ ఏవైనా ఉన్నాయా ..?
  1. నాయకత్వం వహించలేని వ్యక్తి, అనుసరించలేని వ్యక్తి, ఈ సంఘానికి తప్పక ఇబ్బందులు కలిగిస్తాయి.
  2. నా ఆలోచనే నేను ..! నేనే నా ఆలోచన.. ! కనుకనే నేను ఆగను ..! నా మనుగడకు ఆధారం నా ఆలోచనే.. ! ఆలోచించకుండా ఉండలేను .. ! (వాఖ్య: జాపాల్ సార్ త్రే)
  • ఇమేజ్ క్రియేషన్
  1. మీరు ఏమి చేసినా, ఏం చేయకున్నా, ఎక్కడ ఉన్నా గంటకు అరవై నిమిషాల వేగంతో కాలంతో భవిష్యత్తు వైపు పయనిస్తూనే ఉన్నారు. (చెస్టర్ ఫీల్డ్)
  2. మన మనోస్థితిని బట్టి, మన దృక్ప్రదాన్ని బట్టి జీవితం మంచిదిగా గానీ, చెడ్డదిగా గానీ కనిపిస్తుంది. అగ్ని స్వతసిద్ధంగా మంచిదీకాదు చెడ్డదీ కాదు, చలికాచుకున్నప్పుడు అగ్ని మంచిది అంటాం. అదే అగ్ని చేతికి తగిలి కాలితే చెడ్డది అంటాం ( వివేకానంద).
  • లింకింగ్ మెథడ్.
  1. ఈగ సువాసనగల కస్తూరి బొట్టు మీద వాలకుండా, దుర్వాసనగల చీముపట్టిన కురుపు మీదనే వాలుతుంది. అలాగే అయోగ్యుడు మంచివాని దగ్గర కాకుండా అయోగ్యుని వద్దకే వెళ్తాడు. (భాస్కరశతకం).
  2. వేలికి ముల్లు గుచ్చుకుంటే మరో ముల్లును ఉపయోగించి ఆ ముల్లును తొలగిస్తాం. కానీ, పని తీరగానే రెండింటినీ పారేస్తాం. రెండో ముల్లును భ్ద్రపరచుకోవడం అనవసరం కదా ! (వివేకానంద).
  • మెమరీ కోడ్స్.
  1. మోటివేషన్ మహాబలీయమైనది. అది మీలో ప్రేరణ కలిగించి మిమ్మల్ని కార్యరంగంలోకి దూకిస్తుంది. ప్రేరణ అనేది ఏకాగ్రతకు ఆయువుపట్టు లాంటిది.
  2. ప్రతిమనిషీ ప్రపంచాన్ని మార్చాలనేవాడే కాని తనను తాను మార్చాలని అనుకోడెందుకో.. (టాల్ స్టాయ్)
  3. మాట్లాడే విషయం మాత్రమే కాదు. మాట్లాడే పద్ధతి కూడా ముఖ్యమైనదే. సరైన పద్ధతిలో, భాషలో చెప్పినప్పుడే ఇతరులు దాన్ని సవ్యంగా స్వీకరిస్తారు.
  4. నేను ఈ శిఖరం ఎక్కితే పడతానేమో అని భయపడేవాడు నిరాశావాది. నిర్భయంగా అధిరోహించేవాడు ఆశావాది.
  • మేజర్ సిస్టం.
  1. కంప్యూటర్లు వచ్చినందు వలన నీకు ఉపాధి అవకాశాలు దూరం కాలేదు. కాలంతోపాటు మారడానికి నీవు ఇష్టపడనందు వలననే నువ్వు నిరుద్యోగివయ్యావు.
  2. తనకు తెలియనిదాన్ని ఎక్కడ ఎవరిని అడిగి తెలుసుకోవాలో తెలిసినవాడే విద్యావంతుడు.
  3. పైకి పోవాలంటే కిందికి వంగి పనిచేయాలి. కింద స్థానం నుండి పైస్థానానికి ప్రమోషన్ పొందాలంటే కిందస్థానంలో చక్కగా పనిచేయాలి.
  • మెంటల్ ఫైలింగ్ సిస్టం.
  1. మీరు పద్ధతులు నేర్చుకుంటే పద్ధతులకే పరిమితమై పోతారు. సూత్రాలను అవగాహన చేసుకుంటే పద్ధతులను మీరే అవగాహన చేసుకోవచ్చు. (వాఖ్య: ఎమర్సన్)
  2. మీరో పుస్తకాన్ని మిత్రుడికి చదవాల్సిందిగా సిఫార్సు చేస్తున్నప్పుడు ఆ పుస్తకం గురించి మరీ పొగిడేయవద్దు. మీరెక్కువ పొగిడితే ఆ పుస్తకం గురించి మిత్రుడికి విరక్తి కలగవచ్చు. (వాఖ్య: హెంరీ మిల్లర్)
  3. కొన్ని పుస్తకాలను రుచి చూసి వదలాలి. మరి కొన్ని దిగమింగాలి. మరోరకం పుస్తకాలను మింగి జీర్ణం చేసుకోవాలి.
  • వంశవృక్షం చిట్కా పాటించండి.
  1. ఒక కొత్తభావం ప్రతిపాదించే ప్రతి వ్యక్తీ మొదట పిచ్చి సన్యాసిలాగే కనిపిస్తాడు. (వాఖ్య: మార్క్ ట్వైన్)
  2. ఎలా చేద్దామా అని ఆలోచిస్తున్నన్నాళ్ళు మీరు ఏమీ చేయలేరు. మీ ఆలోచనలకు స్వస్తి చెబితేనే మీరు చేసేదేదో చక్కగా చేయగలరు. (వాఖ్య: విలియం హాజ్లిట్)
  3. విద్య అంటే కేవలం అధ్యయనం కాదు. విద్య అంటే మెదడు తాలూకు శక్తులకు వ్యాయామం ఇవ్వడ వాటిని అభివృద్ధిపరచడం. (వాఖ్య: మేసన్)
  4. మనగొప్పతనం అసలు కిందపడకపోవడంలో లేదు. పడిన ప్రతిసారీ మళ్ళీ లేవడంలోనే గొప్పతనం ఉంది.. (వాఖ్య:కంఫ్యూషియస్)
  • జర్నీ మెథడ్.
  1. మనిషి ఎన్నేళ్ళు జీవించాడు. అన్నదానికంటే జీవించిన కాలంలో ఏమి సాధించాడు అన్నదే ముఖ్యం. (వాఖ్య:హెరిడాన్)
  2. సంగీతం ద్వారా మానసిక జబ్బులను నయం చేయవచ్చు. మెదడు ఏకాగ్రత చూపడానికి సంగీతం ఉపయోగపడుతుంది.
  • ఫోటోగ్రఫీ మెథడ్స్.
  1. పరీక్షల్లో మీరు ఉత్తీర్ణులు కావాలంటే మీరు సబ్జెక్టు మీద పూర్తి అవగాహన సాధించాలి.
  2. మిమ్మల్ని మీ ప్రతిభని తక్కువగా అంచనా వేసుకుని జీవించడం మరణంతో సమానం ..!
  • స్పీడ్ రీడింగ్.
  1. ఓర్పు అన్నింటికీ మూలం. గుడ్డు పొదిగినప్పుడే పిల్ల వస్తుంది. కానీ బద్దలు చేయడం వల్ల కాదు. (వాఖ్య: అర్నాల్డ్ గ్లాస్కో)
  2. ప్రపంచంలో మానవుడు సాధించిన అద్భుతవిజయాలు వెనుక ఉన్న మహాశక్తి మెదడు. మెదడును ఉపయోగించుకోవడం తెలిస్తే ప్రతిఒక్కరూ మేధావి కాగలరు. !
  • సబ్జెక్ట్ సారాంశం గుర్తు పెట్టుకోవాలంటే కథగా చదవవచ్చు.
  1. చదువు వచ్చి పుస్తకాలు చదవని వ్యక్తికి చదువురాని వ్యక్తికి పెద్ద తేడా లేదు. (మార్క్: ట్వైన్)
  2. ఏదైనా ముఖ్యమైన విషయం నేర్చుకునేటప్పుడు చిన్న చిన్న పేరాలుగా విభజించుకుని చదవడం వల్ల ఎంతో సులభంగా గుర్తుంచుకోవచ్చు. ఙాపకశక్తిని వృద్ధిపరచుకోవడానికి ఇది మంచి సూత్రం.

ఫలితం

[మార్చు]

ఆరవ సూత్రం ఆచరిస్తే మీరేమి చదివితే అది గుర్తుంటుంది, ఏకాగ్రతను సాధించడం తెలుసుకుంటారు, మంచి ఆలోచనాతీరు అలవరచుకుంటారు, పాఠాలు ఏకాగ్రతతో వినగలుగుతారు, తరగతిలో ప్రథమస్థానంలో ఉంటారు, చెస్, క్యారమ్స్ వంటి ఆటలమీద పట్టుసాధిస్తారు, యోగా చెయ్యడం మీ దినచర్యలో భాగమౌతుంది, లలిత సంగీతాన్ని ఇష్టపడతారు, మరచిపోతానేమో అన్న భయం పోతుంది, సదా చలాకీకా ఉంటారు, ఇంకా నేర్చుకోవాలనే తపన కలిగుంటారు, కథల పుస్తకాల మీద మక్కువ ఏర్పడుతుంది అన్నది రచయిత అభిప్రాయం.

టెన్షన్

[మార్చు]

టెన్షన్ ప్రధాన సూత్రాలు

  1. ఒత్తిడి అంటే ఏమిటి ?
  2. ఒత్తిడి ఎందుకు వస్తుంది ?
  3. కాన్సెప్ట్ స్కూళ్ళ ఒత్తిడి.
  4. బండెడు పుస్తకాలు అవసరమా?
  5. భయం ముసుగులో పిల్లల చదువులు.
  6. కాన్వెన్ట్ చదువుల కష్టాలు.
  7. వ్యాపారంగా మారిపోతున్న విద్య!
  8. టెన్షన్ పెట్టే టెన్త్ క్లాస్.
  9. కాలేజీ జీవితమంటే తమాషా కాదు !
  10. కాలేజీల్లో అడుగడుగునా వ్యాపారమే !
  11. అనుక్షణం టెన్షనే !
  12. మెరిట్ సెక్షన్లు.
  13. ఇంటర్ కాలేజీల్లో హంటర్ విద్య.
  14. ఎంసెట్టెన్షన్ ఓవర్ ఏక్షన్.
  15. చదువుకుంటున్నామా ? చదువు కొంటున్నామా ?
  16. ఎంసెట్ ర్యాంక్.. ఇంజనీరింగుసీటు
  17. ప్రొఫెషనల్ కాలేజీల్లో అంతా టెన్షనే !
  18. విద్యార్థులపై పొలిటికల్ టెన్షన్ !
  19. టెన్షన్ తగ్గించే చదువు.

అక్షరలక్షలు:-

  • ఒత్తిడి అంటే ఏమిటి ?
  1. మీరు ఎలా తయారు కావాలన్నా అందుకు మీరే బధ్యులు !
  2. ఆలోచనలే వ్యక్తి జీవితాన్ని నిర్ధేశిస్తాయి.
  3. మానవుడి ప్రవర్తన, వ్యక్తిత్వం అతని ఆలోచనలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటాయి.
  4. మీ ఆత్మవిశ్వాసం ముందు ఏ శక్తి నిలువలేదు. ఏ లక్ష్యాన్ని మీరు అవలీలగా సాధించగలరు. మీమీద మీకున్న నమ్మకంతోనే మిమ్మల్ని మీరు జయించగలుగుతారు.
  • ఓత్తిడి ఎందుకు వస్తుంది ?
  1. ఎవరైతే మంచి కలలు కంటారో, ఎవరి హృదయంలో లక్ష్యం స్థిరంగా ఉంటుందో వాళ్ళే ఏదో ఒకరోజు తమ కలలను నిజం చేసుకుంటారు.
  2. ఇతరులు కనీసం చూడలేని లక్ష్యాన్ని సైతం ఛేదించగలిగిన వాడే నిజమైన జీనియస్.
  3. ఎవరైతే అనుమానం భయం అనే రెండు పెనుభూతాలను జయించగలరో వారే అపజయాన్ని కూడా జయించగలరు.
  • కాన్సెప్ట్ స్కూళ్ళ ఒత్తిడి.
  1. మీరు మీ భవిష్యత్తును మార్చుకోవాలంటే ప్రస్తుతం మీ ఆలోచనా స్థితిని మార్చుకోవాలి.
  2. మీ ప్రస్తుత స్థితికి మీరే బాధ్యులు..! మీ ఆనందానికి గానీ మీ బాధకు గానీ మీరే కారణం..! మీరు ఎలా ఆలోచిస్తే అలా ఔతారు !
  3. మీరు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరాలంటే ఈ భూమి మీద ప్రతి ఒక్కరి మంచి కోరుకోండి. అందరితో నవ్వుతూ ఉల్లాసంగా గడపండి.
  • బండెడు పుస్తకాలు అవసరమా?
  1. గతం నుండి గుణపాఠం నేర్చుకుని వర్తమానాన్ని సవ్యంగా ఉపయోగించుకుని భవిష్యత్తుపట్ల ఆశావహ దృక్పధంతో ముందుకు పయనించడం వివేకవంతుని లక్షణం.
  2. మిమ్మల్ని మీరు తెలుసుకోవడంలోనే మీ విజయం ఆధారపడి ఉంది.
  • భయం ముసుగులో పిల్లల చదువులు.
  1. భూమి మీద మనిషంత గొప్పవాడు ఎవరూ లేరు. మనిషిలో మెదడంత గొప్ప అవయవం మరొకటి లేదు. (వాఖ్య: విలియం హామిల్టన్)
  2. మంచి ఆలోచలనలు మంచి చర్చలు ఎప్పుడూ వ్యతిరేక ఫలితం ఇవ్వవు. చెడు ఆలోచనలు చెడు చర్చలు ఎప్పుడూ మంచి ఫలితాన్ని ఇవ్వవు.
  • కాన్వెన్ట్ చదువుల కష్టాలు.
  1. మీ ఆలోచనలలో అపారమైన ఉత్సాహం స్ఫూర్తి ఉన్నప్పుడు మీరు కాలాన్ని జయించగలుగుతారు.
  2. పదిరూపాయల విలువగల ఫలితం లభించేదానికి వందరూపాయల విలువగల సమయాన్ని వెచ్చించేవాడు అవివేకి.
  • టెన్షన్ పెట్టే టెన్త్ క్లాస్.
  1. మీరు దేనిమీదైతే పూర్తి ఏకాగ్రత కనబరచగలరో దాన్ని మీ నియంత్రణలో ఉంచుకోగలరు.
  2. ఒక మూర్ఖుడిని పొగిడే మూర్ఖుడు ఎప్పుడూ దరిదాపులలో ఉంటూనే ఉంటాడు. (నికోలస్ బొలీస్)
  3. అవగాహన చేసుకోవడం కష్టం. అవగాహన చేసుకున్నాక కార్యాచరణ తేలికే. (వాఖ్య-సన్యట్ సేన్)
  • కాలేజీ జీవితమంటే తమాషా కాదు !
  1. పొరపాటు చెయ్యడం తప్పుకాదు..! చేసిన పొరపాటును తిరిగి తిరిగి చెయ్యడం తప్పు..! (వాక్య:బ్రియాంట్)
  2. ముందు మీ ఆలోచనలను మార్చుకోండి. అప్పుడు మీ ప్రపంచాన్ని మార్చుకోవడం తేలిక (వాఖ్య:నార్కిన్ విన్సెంట్ పీలే)
  3. ఆలోచించడం అనే నైపుణ్యం పరిధి అనంతం మీ బ్రెయిన్‌కు స్వేచ్ఛనివ్వండి. ఆ స్వేచ్ఛనుంచి అద్భుతమైన ఆలోచనా నైపుణ్యం ఉద్భవిస్తుంది.
  4. మీరు విధిచేతిలో కీలు బొమ్మలు కాదు. మీ ఆలోచనలే మీ విధిని నిర్ణయిస్తాయి.
  • కాలేజీల్లో అడుగడుగునా వ్యాపారమే !
  1. మీలో గొప్ప ఆలోచనలుంటే సరిపోదు. వాటిని సరిగ్గా మేనేజ్ చెయ్యడమే గొప్పదనం (వాఖ్య: ఫ్రెంచ్ తత్వవేత్త)
  2. ఒకే సబ్జెక్టును వెంటవెంటనే చదవడం వలన ఎక్కువగా ఙాపకం ఉంచుకోవడం కష్టమౌతుంది.
  3. వినడం అనేది ఒక నైపుణ్యం ఎక్కువ వినడం వల్ల విషయ పరిఙానం పెరుగుతుందనడం అతిశయోక్తికాదు.
  • అనుక్షణం టెన్షనే !
  1. ముందు మీ ఆలోచనలను మార్చుకోండి. అప్పుడు మారిన ప్రపంచం మీ ముందు దర్శనం ఇస్తుంది.
  2. శ్రద్ధగా వినడం వలన ఙాపకశక్తి పెరుగుతుంది..! శ్రద్ధగా వినడం ఏకాగ్రతవల్లే సాధ్యపడుతుంది..! విన్న విషయాన్ని మళ్ళీమళ్ళీ పునఃశ్చరణ చేసుకుంటే ఎక్కువకాలం గుర్తుంటుంది..!
  • మెరిట్ సెక్షన్లు.
  1. ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత సృజనాత్మక శక్తి ఉంటుంది. అయితే కొద్దిమంది మాత్రమే దాన్ని గుర్తించి వెలికి తీస్తున్నారు.
  2. ప్రపంచాన్ని మీరు మార్చలేరు. మీరు మారితే ప్రపంచం మారినట్లు కనిపిస్తుంది. కొత్త మనిషిగా మీరు కొత్త ప్రపంచంలో కొత్తగా...
  3. విజయం సాధింవచడానికి మీరు ఎంత ఎక్కువ కష్టం అనుభవిస్తే దాని ఫలితం అంత ఎక్కువ ఆనందం ఇస్తుంది. (వాఖ్య: పీలే)
  • ఇంటర్ కాలేజీల్లో హంటర్ విద్య.
  1. వెయ్యి మంది మిత్రులను సంపాదిస్తే అందులో నిజమైన మిత్రుడు ఒక్కడు కూడా ఉండకపోవచ్చు.
  2. సరైన విద్య సాధారణ వ్యక్తిని అసాధారణంగా మార్చివేయగలదు.
  3. తరువాత ఏమి చేయాలో తెలుసుకోవడమే వివేకమంటే..!
  • ఎమ్సెట్టెంషన్ ఓ ఓవరేక్షన్.
  1. మనిషన్న తరువాత రోజూ ఒక మంచి పాట వినాలి. ఒక మంచి పద్యం చదవాలి. ఓ అందమైన చిత్రం చూడాలి. వీటికంటే ముఖ్యం- ఇంగితం ఉన్న నాలుగుముక్కలు మాట్లాడాలి. (వాఖ్య:గోత్)
  2. ఏవ్యక్తి తన సమకాలికులకు గొప్పవాడుగా కనిపించడు. ఏ యజమాని తన సేవకులకు గొప్పవాడుగా కనిపించడు. (వాఖ్య:కోల్టన్)
  • చదువుకుంటున్నామా ? చదువు కొంటున్నామా ?
  1. మిమ్మల గురించి మీరు ఎంత ఎక్కువగా మాట్లాడితే - మీరు అన్ని అబద్ధాలు ఆడాల్సివస్తుంది. (జిమ్మర్సన్)
  2. మీ ఆలోచనలను మీలో మీరు అణిచివేసారంటే ఙాపకశక్తిని కోల్పోతారు.
  • ఎంసెట్ ర్యాంక్.. ఇంజనీరింగుసీటు.
  1. శ్రమనీ ఆయుధమైతే విజయం నీ బానిస ఔతుంది.
  2. మంచి మెదడు ఉంటే చాలదు దానిని వినియోగించటమే ముఖ్యవిషయం.
  • ప్రొఫెషనల్ కాలేజీల్లో అంతా టెన్షన్ !
  1. చెడ్డ అభిరుచికంటే మంచి అభిరుచి మేలు. అయితే ఏ అభిరుచి లేనిదానికంటే ఏదో ఒక అభిరుచి ఉండడం కొంతమేలే. (అర్నాల్డ్ బెనెట్)
  2. మీరు లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే సగం గమ్యం చేరినట్లే.
  1. మనకు దేనిగురించి ఒక శాతంలో లక్షోవంతు కూడా తెలీదు. ఇది సత్యం.. (వాఖ్య: థామస్ ఎడిసన్)
  2. ఇతరులు తప్పు చేస్తే చూసి ఆనందిస్తామని ఎదురుచూసే వ్యక్తి ఎన్నడూ ఒప్పు చెయ్యలేడు.
  3. నేడుచెయ్యాల్సిన పనిని రేపటికి వాయిదా వేయకు. (వాఖ్య:బెంజిమిన్ ఫ్రాంక్లిన్)

ఫలితం

[మార్చు]

ఏడవ సూత్రం ఆచరిస్తే సిలబస్‌ను చూసి భయపడకపోవడం, టెక్స్ట్ బుక్స్ అధికంగా చదువడం, తెలుసుకోవాలనే ఉత్సాహం అధికమవడం,, మెదడును సదా ఫ్రీగా ఉంచుకోవడం, మీకు సంబంధం లేని విషయాలలో జోక్యంచేసుకోకుండా ఉండడం, హోంవర్క్ పెండింగులో పెట్టకపోవడం, వందశాతం హాజర్ సాధించడం, ఉపాద్యాయుల అభిమానపాత్రులవడం, ఉత్తమ ర్యాంకును సాధించడం, ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేస్తూ చదువుకోవడం, పబ్లిక్ పరీక్షలంటే చెస్ ఆడినంత ఆహ్లాదం అనుకోవడం, మంచి చేవ్రాత సాధించడ అలవడతాయని రచయిత మనోభావం.

పేరెంట్స్ రెస్పాన్సిబులుటీ (తల్లితండ్రుల బాధ్యత)

[మార్చు]
  1. ప్రాథమిక విద్య తల్లితండ్రుల బాధ్యత.
  2. చిన్నారులను పాఠశాలకు ఎప్పుడు పంపాలి ?
  3. మంచి స్కూలులో చేర్చితే బాధ్యత తీరిపోతుందా ?
  4. నిరంతర పర్యవేక్షణ ఉండాలి.
  5. యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ డాడ్..

అక్షరలక్షలు :-

  1. చిన్నపిల్లల్లో సృజనాత్మకత మెండుగా ఉంటుంది. ప్రశ్నలతో పెద్దవాళ్ళను ఊపిరాడనివ్వరు. ఆ తత్వాన్ని పెంచుతూ ఉన్నప్పుడు పిల్లలలు పెద్ద అయిన తరువాత మేధావులుగా అయ్యే అవకాశం ఉంది.
  2. కిరీటం పెట్టుకున్నవారికి తలనొప్పి తప్పదు.
  3. బాధ్యతలు నెత్తి మీద వేసుకున్నవాడు భారం మోయక తప్పదు.
  • చిన్నారులను పాఠశాలకు ఎప్పుడు పంపాలి ?
  1. తలమీది తెల్ల వెండ్రుకలు వయసునే సూచిస్తాయి. వివేకాన్ని అవి సూచించలేవు.
  2. మీ ఆలోచనలకు లక్ష్యం ఉంటేనే అద్భుతమైన కార్యాలు సాధ్యమౌతాయి.
  3. మీరు ఒక్కరు మారితే ఈ ప్రపంచంలో కనీసం ఒక్క మూర్ఖుడు అయినా తగ్గినట్లే.
  • మంచి స్కూలులో చేర్చితే బాధ్యత తీరిపోతుందా ?
  1. మనప్రవర్తన బట్టే అవతలివ్యక్తి ప్రవర్తించే తీరు ఉంటుంది. మన ఉద్దేశాలు మంచివైతే, ఇతరుల ఉద్ధేశాలు కూడా మంచివేనని మనం అభిప్రాయపడతాం. మన ఉద్దేశాలు చెడ్డవైనప్పుడు ఎదుటి వాడి ఉద్దేశాలు కూడా చెడ్డవేనని అనుకుంటాం.
  2. మోసం చేసి గెలవడం కన్నా గౌరవంగా ఓడిపోవడం మంచిది. గౌరవంగా ఓటమి పొందడం - బాగా అభ్యాసం చేసి పోటీకి సిద్ధం కాలేదన్న విషయాన్ని తెలియజేస్తుంది. కానీ- కపటంగా గెలవడంం అసలు వ్యక్తిత్వమే లోపించిందన్న విషయాన్ని తెలుపుతుంది.
  3. అతనొక తండ్రి మాత్రమే కాని తనకున్నదంతా ఇస్తాడు. తన చిన్న పిల్లల దారి సుగమం చేయడానికి (ఎడ్గార్‌గెస్ట్)
  • నిరంతర పర్యవేక్షణ ఉండాలి.
  1. మన కుటుంబంతో మనం ఎంత సమయం గడుపుతామనే దానికన్నా. ఎలా గడుపుతామనేదే ముఖ్యం. ఆలోచించండి- ఇది నిజమేనా?
  2. ఇతరులు నీవల్ల కాదన్నది చేసి చూపించడంలోనే ఉంది అసలైన ఆనందం. (వాల్టర్ బ్యాగట్)
  3. మీ పిల్లలకు మంచివిలువలు నేర్చాలంటే, నిజానికి మీ మనుమళ్ళకు, మనువరాండ్లకు మంచివిలువలు మీరు నేర్పుతున్నారన్నమాట.
  4. అంతా తెలుసుకుని ప్రయత్నిస్తామని అనుకునే వారు ఎప్పటికీ ప్రారంభించలేరు.
  • యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ డాడ్..
  1. స్త్రీ బిడ్డ పుట్టేటప్పుడు అనుభవించిన ప్రసవవేదన కంటే ఎత్తుకుని తన బిడ్డను ఆడించే అనుభవాన్ని గాఢంగా ఙాపకం ఉంచుకుంటుంది. పిల్లల ఆటపాటల్లో తన ఇబ్బందులను బాధలని మర్చిపోయి తన బిడ్డ ఉన్నతి కోసం అనుక్షణం పరితపించే ఆ మాతృహృదయం రుణం మనం తీర్చుకోగలమా !
  2. ఈ భూమి మీద మనం స్థలం ఆక్రమించినందుకు మనమిచ్చే బాడుగే సమాజానికి మనం చేసే సేవ.
  3. చాలా మందికి వారికి తెలియనిది చాలా ఉందని తెలియదు.

ఫలితం

[మార్చు]

ఎనిమిదవ సూత్రం తల్లితండుల బాధ్యతను సూచిస్తుంది. ఈ సూత్రం పాటిస్తే మీలో బిడ్డ తప్పుచెయ్యడనే విశ్వాసం బలపడడం, బిడ్డ తెలివైనవాడనే నమ్మడం, బుద్ధిమంతుడుడని అనుకోవడం, బిడ్డ నిజమేచెబుతాడని నమ్మడం, బిడ్డ సమయాన్ని వ్యర్ధం చెయ్యడని భావించడం, బిడ్డ ఉత్తముడని అనుకోవడం, బిడ్డబాగా చదువుతాడని భావించడం, తరగతిలో ప్రథముడుగా ఉంటాడని విశ్వసించడం, బిడ్డకు మీరే మంచి స్నేహితులని భావించడం, మీ బిడ్డ మీకు లోకం.. ఫ్రాణం.. సర్వస్వం.. అనుకోవడం ప్రాప్తిస్తాయని రచయిత మనోభిప్రాయం.

ముచ్చటగా మూడు వ్యాసాలు

[మార్చు]
  1. మొదటి వ్యాసంలో మాతృత్వం విలువ గురించి చెప్పబడిది. ఇందులో శిశువుకు అమ్మ అందించే సాయం, ఆటలు పాటలు నేర్పుతూ లాలించడం, తొలిపలుకులు పలుకిస్తూ తీయగా మాట్లాడుతూ భాషాఙానం కలిగించడం, త్రికరణశుద్ధిగా దైవభక్తిని నూరిపోయడం, మంచి చెడుల నడుమ ప్రాణాలకు తెగించి రక్షణ కల్పించడం వంటి బాధ్యతలను నెరవేర్చే దేవతగా చిత్రించి అమ్మంటే మొదటి గురువని, సమాజంలో వ్యక్తి వికాసానికి తల్లి గురుతరమైన బాధ్యత వహిస్తుందని రచయితచేత మాతృత్వం విలువలు హృద్యంగా చిత్రించబడ్డాయి.
  2. రెండవ వ్యాసం తండ్రి విలివలను తెలుపుతుంది. బిడ్డచేత తండ్రి వేయించే తొలి అడుగులు, తండ్రి సదా బిడ్డకు నేర్పే బుద్ధిమతి పిల్లలకు ఒక్కోసారి విసుగనిపించినా తాను అనుభవించే సమయంలో అది అనుభవంలోకి వస్తుందని రచయితచేత తెలియజేయబడింది. తండ్రి వెంట ఉన్నప్పుడు ఉండే భద్రత తండ్రివెంట వెళ్ళి పోతుందని. అయినప్పటికీ ఇది ప్రతిఒక్కరికీ ఆలస్యంగా తాను అనుభవించే సమయంలోనే తెలియవస్తుందని. ఈ బాధ తండ్రి నుండి బిడ్డలకు, బిడ్డల నుండి మనుమలకు వారసత్వంగా సంక్రమిస్తుందని రచయితచేత సమాజానికి హెచ్చరిక జారీ చేయబడింది.
  3. మూడవ వ్యాసంలో ఇప్పటి సమాజం పెద్దలపట్ల చూపుతున్న నిర్లకక్ష్యం ఎత్తి చూపబడింది. తల్లి కొంగుచాటున ఆడుకున్న రోజులు, తండ్రి కాళ్ళకు అడ్డుపడి తానూ వెంట వస్తానని వెంట బడిన రోజులు, నాయనమ్మ ఒడిలో కూర్చుని హాయిగా కబుర్లు విన్న రోజులు, తాతయ్య మీసాలతో ఆదుకున్న రోజులూ మరచి పోవడం. తల్లితండ్రులు తమను పెంచిపెద్దచేయడానికి చేసిన త్యాతాలను విస్మరించి వారిని తమ సుఖానికి అడ్డుగా భావించడం. అవమానాలు భరిస్తూ తల్లి తండ్రి కన్నీటిని దిగమింగుతూ పిల్లల పంచన బతుకు వెళ్ళదీస్తున్నారని. సమాజంలో నేటి యువతకు పెద్దల పట్ల నిర్లక్ష్యభావం అధికమౌతుందని గౌరవమర్యాదలు సన్నగిల్లుతున్నాయని రచయిత వ్యధను వ్యక్త పరుస్తూ ఈ పరిస్థితి ముందు తరాలకు కొనసాగుతుందని వీరిని కూడా వీరి పిల్లలు నిర్లక్ష్యానికి గురి చేయవచ్చని రచయితచేత భవిష్యత్తు సూచించబడింది.

ముక్తాయింపు

[మార్చు]

చివరిగా రచయిత " మీరీ ప్రపంచాన్ని మొత్తంగా మార్చలేరు, దేశాన్నంతా మార్చలేరు, రాష్ట్రాన్ని సంపూర్ణంగా మార్చలేరు, మీ జిల్లాను కూడా మార్చలేరు, మీ గ్రామాన్ని సైతం మార్చలేరు, ఆఖరికి మీ కుటుంబాన్నీ మార్చలేరు అయినప్పటికీ మిమ్మల్ని మీరు మార్చుకోవడం మీచేతిలో ఉంది. మీరు మారితే మిమ్మల్ని చూసిన కొందరైనా మారడానికి అవకాశం ఉంది. అప్పుడీ ప్రపంచం మీకు కొత్తగా కనిపిస్తుంది. మార్పు మీ నుండి ఆరంభం కావాలి అందుకీ ఆక్షరం ప్రేరణ కలిగించాలి అంటూ రచయితచేత ముక్తాయింపు ఇవ్వబడింది.

వెలుపలి లింకులు

[మార్చు]