Jump to content

మల్లాది కామేశ్వరరావు

వికీపీడియా నుండి
మల్లాది కామేశ్వరరావు
జననం1960
వృత్తివిశాలాంధ్ర దినపత్రిక లో ప్రధాన సహాయ సంపాదకుడు
ప్రసిద్ధితెలుగు రచయిత, నాటక రచయిత
తండ్రిమల్లాది వెంకట సత్యనారాయణ రావు
తల్లిసుబ్బలక్ష్మీ

మల్లాది కామేశ్వరరావు (Malladi Kameswara Rao) తెలుగు రచయితలలో ఒకరు. ఆయన కథలు, నాలుగు వందలకు పైగా కవితలు, అంబేద్కర్ జీవితచరిత్ర, విజయానికి ఎనిమిది సూత్రాలు వంటి వ్యక్తిత్వవికాస పుస్తకాల రచన, నవలా రచన చేసాడు. ఆయన అక్షర ప్రేమికుడనని ఆయానకే ప్రత్యేకమైన బాణిలో తెలియచేసాడు. ఆయన ముప్పైమూడేళ్ళు పత్రికా సంపాదకుడిగా పనిచేసాడు. గోదావరి, సర్కార్ ఎక్స్‌ప్రెస్, ఉదయం, ఆంధ్రజ్యోతి, బాలజ్యోతి, వనితా జ్యోతి, ఆంధ్రభూమి లలో తన సేవలందించి, ప్రస్తుతం విశాలాంధ్ర పత్రికలో ప్రధాన సహాయ సంపాదకుడు (ఛీఫ్ సబ్-ఎడిటర్) గా పనిచేస్తున్నాడు. అంతేకాక పలు పత్రికలలో పలు ప్రత్యేక ఫిచర్లు నిర్వహించాడు. ఆయన వ్రాసిన ఐదు వేలకు పైగా వ్యాసాలు పలు పత్రికలలో ప్రచురితమయ్యయి. ఉద్యోగ నిర్వహణలో భాగంగా నిర్వహించిన పలువురు ప్రముఖులతో ముఖాముఖి పరిచయాలు పత్రికలలో ప్రచురితమయ్యాయి.

కుటుంబం

[మార్చు]

ఆయన కాకినాడలో 1960లో మల్లాది వెంకట సత్యనారాయణ రావు, సుబ్బలక్ష్మీ దంపతులకు జన్మించాడు. మల్లాది గారి తండ్రి సంగీతంలో డబుల్ డిప్లొమా పొందాడు. కాకినాడ జెడ్.పి హైస్కూలులో సంగీతం అధ్యాపకుడు. ఆయన స్వయంగా హరికథా భాగవతార్. తల్లి మల్లాది సుబ్బలక్ష్మి గృహనిర్వాహకురాలు. భార్య పేరు దివ్య గృహనిర్వాహకురాలు. ఆయనకు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు విద్యాదిత్య బి.టెక్ పూర్తిచేసాడు. చిన్న కుమారుడు విద్యారణ్య బి.సి.ఎ (కంప్యూటర్ సైంసెస్) చేసి ఎం.ఎస్ చేయడానికి ప్రభుత్వ గ్రాంటును అందుకున్నాడు. ఆయనకు ఇద్దరు సోదరులున్నారు. వారిలో మల్లాది సత్యనారాయణ మూర్తి స్కూలు టీచర్‌గా పనిచేసి పదవీవిరమణ తీసుసుకున్నాడు. మరొక సోదరుడైన మల్లాది సుబ్బారావు పంచాయితీరాజ్, అసిస్టెంట్ ఇంజనీర్.

ఉద్యోగ బాధ్యతలు

[మార్చు]
  • 1979 నుండి 1984 వరకూ కాకినాడ ప్రాంతీయ దినపత్రికలు " గోదావరి టైంస్ ", " సర్కార్ ఎక్స్‌ప్రెస్ " రిపోర్టర్‌.
  • 1984 నుండి 1995 వరకు ఉదయం దినపత్రికలో సీనియర్ సబ్‌ఎడిటర్, డెస్క్‌ఇన్‌చార్జ్.
  • 1995 నుండి 1998 వరకు ఆంధ్రజ్యోతి వారపత్రిక, వనితాజ్యోతి, బాలజ్యోతి మాసపత్రికలలో సబ్‌ఎడిటర్.
  • 1999 నుండి 2009 వరకు ఫ్రీలేంస్ జర్నలిస్ట్, ధారణాశక్తి పెంపొందించే శిక్షకుడు.
  • ప్రస్తుతం " విశాలాంధ్ర " (హైదరాబాదు) లో చీఫ్ సబ్ ఎడిటర్, ఫీచర్ ఇంచార్జ్ బాధ్యతలు.

రచనలు

[మార్చు]
మట్టిలో మాణిక్యం ముఖపత్రం
మాటవరుస

మల్లాదికామేశ్వరావు కలం నుండి వెలువడిన రచనలు 100 కంటే అధికమైన కథలు. వివిధ దినపత్రికలు, వారపత్రికలు, మాసపత్రికలలో ముఖాముఖి పరిచయాల నిర్వహణ, కవితలు ప్రచురణ. అంతేకాక మల్లాది కామేశ్వరరావు కలం నుండి [1] విజయానికి ఎనిమిది సూత్రాలు అనే ధారణాశక్తిని పెంపొదించి వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే పుస్తక రచన, మట్టిలో మాణిక్యం-అంబేద్కర్ అనే జీవితచరిత్ర పుస్తకాలు వెలువడ్డాయి. పత్రికా ముఖంగా ప్రత్యేక ఫీచర్స్:-

  • ఎ.ఐ.ఆర్ పత్రికలో " ఈ మాసపు పాటలు " కథలు, పద్యాలు, కవితలు, 100 పైగా డాక్యుమెంటరీలు.
  • వనితాజ్యోతి పత్రికలో " త్రినేత్రి", సృజనప్రియాలో " మరదలుపిల్ల" ధారావాహికలు ప్రచురితమయ్యాయి.
  • వివిధ పత్రికలలో 50 కంటే అధికంగా కార్టూనులు (1981-1985)

ప్రత్యేక ఫీచర్లు

[మార్చు]
  • ఆంధ్రజ్యోతిలో " రాజకీయల వ్యంగ్య చిత్రణ " ఊహాలోకం " , సామాజిక సంఘటనల వ్యంగ్యచిత్రణ " మాయా లోకం ", " గళ్ళనుడికట్టు" అనే ఫజిల్..
  • వనితాజ్యోతిలో " యువతరం-నవతరం " వ్యాసపరంపర. మ్యాగజిన్ రూపకల్పనలో భాగస్వామ్యం, ప్రత్యేక ముఖాముఖి పరిచయాలు.
  • బాల జ్యోతిలో " ఫన్‌పేజి " పేరుతో రెండు సంవత్సరాల నిర్వహించబడింది.
  • మహానగర్ ఈవెనింగ్ దినపత్రికలో " నిజంగా నిజం " పేరుతో ప్రముఖులతో ముఖాముఖి పరిచయాలు.
  • ఆంధ్రభూమి దినపత్రికలో జనరల్ నాలెడ్జ్ పెంచే ఫజిల్ " మాటకట్టు " .
  • ఆంధ్రభూమిలో ఆదివారం ప్రత్యేకం అనుబంధంలో " మాల్లాది మాటకచేరీ " పేరుతో ఆసక్తిఅరమైన హాస్యంతో కూడిన ఫీచర్.
  • విశాలాంధ్రలో ఆదివారం సంచికలో వందకు పైగా వ్యాసాలతో పాటు "నాలో నేను", "అబద్దాల కథలు" మొదలైన పలురకాల శీర్షికలు నిర్వహించారు.

నాటకాల దర్శకత్వం

[మార్చు]
బయోస్కోప్ & వైద్యోనారాయణో హరి ప్రదర్శన.
ఒక లైలా కోసం నాటకానికి దాసరి నుండి అవార్డు అందుకుంటున్న మల్లాది.

మాల్లాది కామేశ్వరరావుకు రచలనలే కాక నాటకాల దర్శకత్వంలో ప్రవేశం ఉంది. 1978 నుండి 1984 వరకు సంగీత నాటకాలలో ఆయన మూకాభినయం చోటుచేసుకుంది. కాకినాడ ప్రదర్శనలో " బయాస్కోప్ & వైద్యోనారాయణ హరి ", విశాఖపట్నం, భీమవరం, గుంటూరు, మద్రాసు కళాసాగర్‌లో చలనచిత్ర నేపథ్యగాయకుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, చలనచిత్ర దర్శకుడు కీ.శే జంద్యాల, జిత్‌మోహన్ మిత్ర, తంబు, చలనచిత్ర ప్రముఖులతో కలిసి దాదాపు 50 రంగస్థల ప్రదర్శనలలో భాగస్వామ్యం వహించాడు.

1998 ఉదయం యానివర్సరీ సందర్భంలో ప్రదర్శించిన " ఒక లైలా కోసం " సంగీత నాటకానికి రచన, దర్శకత్వం వహించాడు. అంతేకాక ఆనాటకంలో కథానాయిక పాత్ర వహించాడు. ఈ నాటకంలో అతని దర్శకత్వ ప్రతిభ, నటనకు ప్రముఖ దర్శకుడు, వివిధరంగాలలో నైపుణ్యం కలిగిన దాసరి నారాయణరావు (ఉదయం ఛైర్మన్) నుండి అవార్డు పొందాడు.

ప్రత్యేక ఆసక్తులు

[మార్చు]

యువకులకు వారి భవిష్యత్తు కొరకు సలహాలు, సూచనలు అందించి వారిని లక్ష్యం వైపు నడిపించడం, వారి వ్యక్తిత్వ వికాసానికి శిక్షణ ఇవ్వడం, వారి ధారణాశక్తి పెంచుకోవడానికి సూచనలు ఇవ్వడము. పుస్తకాలు చదవడం, కుటుంబానికి కొంత సమయం కేటాయిస్తూ సంగీతం వినడం. కంప్యూటర్ గేంస్ ఆడడం.

  • హాబీలు :- చెస్, కేరంస్ ఆడడం, ఫజిల్స్ పూర్తిచేయడం.
  • విండోస్ ఆపరేటింగ్ పరిచయం, పేజ్ మేకర్,

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.