Jump to content

విజయ్ పాల్

వికీపీడియా నుండి
విజయ్ పాల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
టి. విజయ్ పాల్
మరణించిన తేదీ (aged 64)
హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
పాత్రబ్యాట్ మెన్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1974/75–1982/83హైదరాబాదు క్రికెట్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్ లిస్ట్ ఏ
మ్యాచ్‌లు 34 1
చేసిన పరుగులు 1,583 7
బ్యాటింగు సగటు 35.97 7.00
100లు/50లు 2/10 0/0
అత్యధిక స్కోరు 156* 7
వేసిన బంతులు
వికెట్లు
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు n/a
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 14/– 0/–
మూలం: ఇఎస్పిఎన్ క్రిక్ ఇన్ఫో, 2019 ఆగస్టు 18

టి. విజయ్ పాల్ (మ. 16 డిసెంబరు 2016) తెలంగాణకు చెందిన భారత ఫస్ట్ క్లాస్ క్రికెటర్. హైదరాబాదు క్రికెట్ జట్టు తరఫున ఆడిన విజయ్, పదవీ విరమణ తర్వాత క్రికెట్ కోచ్‌గా, సెలెక్టర్‌గా పనిచేశాడు.[1]

క్రీడారంగం

[మార్చు]

1971/72 సీజన్ లో వజీర్ సుల్తాన్ టొబాకో XI మ్యాచ్ తో ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన పాల్, తరువాత 1974/75, 1982/83 సీజన్లలో రంజీ ట్రోఫీలో హైదరాబాదు జట్టుకు ప్రాతినిధ్యం వహించి, మొత్తం 34 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో ఆడాడు. "దృఢమైన, కాంపాక్ట్" మిడిల్-ఆర్డర్ బ్యాట్స్ మాన్ అయిన[2] పాల్ తన ఫస్ట్-క్లాస్ కెరీర్ లో రెండు సెంచరీలతోపాటు 35.97 సగటుతో 1583 పరుగులు చేశాడు.[3] స్థానిక క్రికెట్ లీగ్‌లలో ఆంధ్రా బ్యాంక్ తరఫున ఆడాడు, గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ టైటిల్స్ కోసం జట్టుకు నాయకత్వం వహించాడు.[2]

1984లో పదవీ విరమణ చేసిన పాల్, క్రికెటర్లకు శిక్షణ ఇవ్వడంకోసం క్రికెట్ కోచ్ గా మారాడు. సికింద్రాబాదులోని జింఖానా క్రికెట్ మైదానం, శ్రీ రామకృష్ణ విద్యాలయ భవన్, కాప్రాలోని కాల్ పబ్లిక్ స్కూల్ తదితర ప్రాంతాలలో శిక్షణ ఇచ్చాడు.[4] "నగరంలో మంచి పేరున్న కోచ్ లలో పాల్ ఒకడు" అని తెలంగాణ టుడే పేర్కొంది.[5] తొలిరోజుల్లో పాల్ దగ్గర శిక్షణ పొందిన క్రికెటర్లలో ప్రగ్యాన్ ఓజా, అంబటి రాయుడు కూడా ఉన్నారు.[2] పాల్ సెలెక్టర్‌గా కూడా పనిచేశాడు.[4]

మరణం

[మార్చు]

పాల్ తన 64 సంవత్సరాల వయసులో 2016, డిసెంబరు 16న మరణించాడు. ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Wisden Obituaries, 2016". Cricinfo. ఫిబ్రవరి 20 2018. {{cite web}}: Check date values in: |date= (help)
  2. 2.0 2.1 2.2 Das, N. Jagannath (డిసెంబరు 16 2016). "Former Ranji player T Vijaya Paul passes away". Telangana Today. Retrieved జూలై 22 2021. {{cite news}}: Check date values in: |access-date= and |date= (help)
  3. "Vijay Paul". CricketArchive. Retrieved జూలై 22 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  4. 4.0 4.1 4.2 "Hyderabad coach Vijay Paul no more". Deccan Chronicle. డిసెంబరు 17 2016. Retrieved జూలై 22 2021. {{cite news}}: Check date values in: |access-date= and |date= (help)
  5. "Cricket academies bloom all over Hyderabad". Telangana Today. మార్చి 18 2018. Retrieved జూలై 22 2021. {{cite news}}: Check date values in: |access-date= and |date= (help)

బయటి లింకులు

[మార్చు]