విజయ్ శివ్‌తారే
విజయ్ శివ్‌తారే | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 నవంబర్ 23 | |||
గవర్నరు | సీ.పీ. రాధాకృష్ణన్ | ||
---|---|---|---|
ముందు | సంజయ్ జగ్తాప్ | ||
నియోజకవర్గం | పురందర్ | ||
జలవనరులు & నీటి సంరక్షణ మంత్రి శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2014 డిసెంబర్ 5 – 2019 అక్టోబర్ 24 | |||
పదవీ కాలం 2009 – 2019 అక్టోబర్ 24 | |||
ముందు | అశోక్ టేకవాడే | ||
తరువాత | సంజయ్ జగ్తాప్ | ||
నియోజకవర్గం | పురందర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | పురందర్ | 1959 డిసెంబరు 24||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | శివసేన | ||
జీవిత భాగస్వామి | మందాకినీ శివ్‌తారే | ||
సంతానం | వినయ్ శివ్‌తారే
డా.మమతా శివ్‌తారే-లాండే వినాస్ శివ్‌తారే | ||
నివాసం | పురందరేశ్వర, సాస్వాద్, పూణే | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
వెబ్‌సైటు | vijayshivtare.com |
విజయ్ శివ్‌తారే (జననం 1959 డిసెంబర్ 24) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పురందర్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2014 నుండి 2019 వరకు జలవనరులు & నీటి సంరక్షణ మంత్రి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]విజయ్ శివ్‌తారే శివసేన ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 మహారాష్ట్ర ఎన్నికలలో పురందర్ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి దుర్గాడే దిగంబర్ గణపత్ పై 23469 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2014 ఎన్నికలలో శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సంజయ్ జగ్తాప్ పై 8590 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]
విజయ్ శివ్‌తారే 2019 మహారాష్ట్ర ఎన్నికలలో పురందర్ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సంజయ్ జగ్తాప్ చేతిలో 31404 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2024 ఎన్నికలలో శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సంజయ్ జగ్తాప్ పై 24,188 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Who is Vijay Shivtare, the man playing spoiler on Baramati pitch for Ajit Pawar?" (in ఇంగ్లీష్). The Indian Express. 27 March 2024. Archived from the original on 2 January 2025. Retrieved 2 January 2025.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
- ↑ "Purandar Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 2 January 2025. Retrieved 2 January 2025.
- ↑ "Maharastra Assembly Election Results 2024 - Purandar" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 2 January 2025. Retrieved 2 January 2025.