Jump to content

విఠల్ వెంకటేష్ కామత్

వికీపీడియా నుండి
విఠల్ వెంకటేష్ కామత్
జననం1953
జాతీయతభారతీయుడు
వృత్తికామత్ గ్రూపు హోటళ్ళ చైర్మన్
తల్లిదండ్రులువెంకటేష్ కామత్, ఇందిరా వి కామత్
వెబ్‌సైటుhttp://www.vithalkamat.com/index.html
ఇది విఠల్ కామత్ బొమ్

విఠల్ వెంకటేష్ కామత్ ఒక హోటల్ వ్యాపారి, విద్యావేత్త. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన ఇతను చిన్నతనంలో తన కుటుంబానికే చెందిన హోటల్లో పనిచేసాడు. ప్రస్తుతం ఆసియాలోనే మొట్టమొదటి పురస్కారం పొందిన ఎకోటెల్ హోటల్ ది ఆర్కిడ్‌ ఛైర్మన్ గా ఉన్నాడు. ప్రస్తుతం విస్తృతంగా వాడుతున్న "కామత్ పళ్ళెం" సృష్టికర్త ఇతనే.

పరిచయం

[మార్చు]

ఇతని తండ్రి వెంకటేష్ కామత్ హోటల్ లో కంచాలు కడిగి కుటుంబాన్ని పోషించాడు. వెంకటేష్ ఆరుగురు సంతానంలో విఠల్ ఒకడు. పని పట్ల నిశిత దృష్టి కలిగిన ఇతను ముంబై లోని బైకుల్లాలో మొదటి రెస్టారంట్ ని ఆరంభించాడు. తన జీవితాశయం కోసం భార్య మంగళ సూత్రాన్ని తాకట్టు పెట్టి, 1938 లో సత్కార్ అనే హోటల్ ని ఆరంభించాడు. అలా దినదిన ప్రవర్ధమానంగా తన హోటల్ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ సురుచి, సన్మాన్ ని స్థాపించాడు. ఇతని కుటుంబానికి ప్రపంచ వ్యాప్తంగా పలు గొలుసు కట్టు హోటల్ వ్యాపారాలు ఉన్నాయి. వాటిలో సత్కార్, స్వాగత్, కామత్ ప్లాజా, ఆర్కిడ్ మొదలైనవి ఉన్నాయి.

ఆర్కిడ్ హోటల్

[మార్చు]

కామత్ హోటల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద 372 గదులతో కూడిన ఆర్కిడ్ హోటల్‌ను ముంబైలో నిర్వహిస్తున్నారు. 1999-2000 లో వాడుక లోకి వచ్చిన ఈ కామత్ హోటల్ 275 గదులతో కూడుకుంది.ఆర్కిడ్ 1999 లో ఇకోటెల్ ఇండస్ట్రీ పయనీర్ పురస్కారాన్ని పొందింది. 2000 డిసెంబరు 6 న ఆర్కిడ్, ప్రపంచంలోని ఐదు హోటళ్ళలో ఒకటిగా మళ్ళీ గుర్తింపుని పొందింది.

స్వీయ చరిత్ర

[మార్చు]

ఇతను తన ఆత్మకథని ఇడ్లీ, ఆర్కిడ్ అండ్ విల్ పవర్ అనే పేరుతో వ్రాశాడు. దీనిని తెలుగు నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఇడ్లి-వడ-ఆకాశం అనే పేరుతో స్వేచ్ఛానువాదం చేశాడు. తరువాత ఈ పుస్తకం పేరును "ఇడ్లి-ఆర్కిడ్-ఆకాశం"గా మార్చాడు.

పురస్కారాలు

[మార్చు]
  • Industry pioneer award by hvs.
  • Dr. M.S. Swaminathan Award for Environmental Protection.
  • Following prestigious Awards have been won by "The Orchid" for the year 2000-2001
  • An International Certification from HVS ECO Services being awarded a 5 Globe ECOTEL rating in May 1997 and once again being re-certified as 5 Globe ECOTEL in December 2000.
  • Federation of Hotel and Restaurant Association of India (FHRAI) Environment Champion of the year - for large hotels.
  • Hotel & Catering International Management Association (HCIMA) Best Environment Policy 2000.
  • Regional Directors Tourism Award 2000.- Western & Central India- awarded for his contribution to the Tourism Industry.
  • National Tourism Award for best 5 star Hotel Western Region - January 2001.
  • PATA Gold Award given by PATA, Malaysia for best Corporate Environment Programme 2001- April, 2001.
  • ISO 14001 Certification 2001 - 24 May 2001.
  • Rotary Club of Mumbai North Island awarded for his concern towards environment protection and providing the 1st eco-friendly 5 star Hotel in Asia to the city of Mumbai.
  • British Airways Tourism for tomorrow Awards- Large Scale Tourism.
  • Paryavaran Shree Puraskar 2001-2002
  • Green
  • Globe Achievement Award 2000, IH & RA Green Hotelier & Restaurateur Environmental Award 1999 for outstanding contribution to sustainable tourism.

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]