విద్యుదయస్కాంతం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
విద్యుదయస్కాంతం

విద్యుదయస్కాంతం అంటే ఒక తీగ ద్వారా విద్యుత్ ప్రవహింప జేయడం ద్వారా తాత్కాలికంగా అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించడం. ఈ చిన్న నియమం ఆధారంగా క్రేన్లు, విద్యుత్ మోటార్లు, హార్డ్ డిస్క్‌లు, టేప్ డ్రైవ్‌లు మొదలైన ఎన్నో పరికరాలు తయారు చేయబడ్డాయి.

సాధారణ అయస్కాంతాన్ని ఉక్కు లేదా ఇనుము తో తయారు చేస్తారు. దీనికి ఉత్తర దక్షిణ ధృవాలుంటాయి. వీటినే శాశ్వత అయస్కాంతం కూడా అంటారు. దీనికి భిన్నమైనది విద్యుదయస్కాంతం. విద్యుత్ ప్రవహించినంత సేపు మాత్రమే అందులో అయస్కాంతత్వం ఉంటుంది.

దీన్ని తయారు చేయడానికి ఓ బ్యాటరీ, లేదా విద్యుత్ ను ఉత్పత్తి చేసే సాధనం, ఒక తీగ ఉంటే చాలు.