విధు వినోద్ చోప్రా
విధు వినోద్ చోప్రా | |
---|---|
జననం | శ్రీనగర్, జమ్మూ అండ్ కాశ్మీర్, భారతదేశం | 1952 సెప్టెంబరు 5
వృత్తి |
|
జీవిత భాగస్వామి |
|
పిల్లలు | ఇషా చోప్రా, అగ్ని చోప్రా, జుని చోప్రా |
విధు వినోద్ చోప్రా (జననం 1952 సెప్టెంబరు 5) భారతదేశానికి చెందిన సినీ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్ & ఎడిటర్. ఆయన దర్శకుడిగా పారిందా (1988), 1942: ఎ లవ్ స్టోరీ (1994) దర్శకత్వం వహించాడు. విధు వినోద్ చోప్రా తన నిర్మాణ సంస్థ వినోద్ చోప్రా ఫిల్మ్స్‌పై మున్నా భాయ్ ఫిల్మ్ సిరీస్, 3 ఇడియట్స్ (2009), పీకే (2014), సంజు (2018) లాంటి హిట్ సినిమాలను నిర్మించాడు.
వివాహం
[మార్చు]విధు వినోద్ చోప్రా మూడుసార్లు వివాహం చేసుకున్నాడు. ఆయన మొదటి భార్య సంపాదకురాలు రేణు సలుజా (m. 1976-1983), ఆయన ఆ తరువాత ఎస్. సుఖ్‌దేవ్ (1933-1979) కుమార్తె సినీనిర్మాత షబ్నం సుఖ్‌దేవ్ (m. 1985-1989) ని రెండో వివాహం చేసుకున్నాడు. వారికీ ఒక కుమార్తె ఇషా చోప్రా ఉంది. ఇషా డ్యాన్స్ ఇన్‌స్ట్రక్టర్, కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తుంది.[1][2]
విధు వినోద్ చోప్రా భారతీయ సినీ విమర్శకురాలు అనుపమ చోప్రాను 1990 జూన్ 1న మూడో వివాహం చేసుకున్నాడు.[3] వారికీ కుమారుడు అగ్ని చోప్రా, కుమార్తె జుని చోప్రా ఉన్నారు.[4]
సినీ జీవితం
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర (లు) | గమనికలు |
---|---|---|---|
2023 | 12వ ఫెయిల్ | దర్శకుడు, రచయిత, నిర్మాత | పోస్ట్ ప్రొడక్షన్ |
2020 | షికారా | నిర్మాత, దర్శకుడు, రచయిత (రాహుల్ పండిత, అభిజత్ జోషితో సహ రచయిత) | [5] |
2019 | ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా | నిర్మాత | |
2018 | సంజు | నిర్మాత | |
2016 | వజీర్ | నిర్మాత, రచయిత, సంపాదకుడు | |
2015 | బ్రోకెన్ హార్సెస్[6] | నిర్మాత, దర్శకుడు, రచయిత | |
2014 | పీకే | నిర్మాత | |
2012 | ఫెరారీ కి సవారీ | నిర్మాత, రచయిత | |
2009 | 3 ఇడియట్స్ | నిర్మాత, స్క్రీన్‌ప్లే అసోసియేట్ | సంపూర్ణ వినోదాన్ని అందించే ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు
ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు ఉత్తమ స్క్రీన్ ప్లేకి ఫిల్మ్ ఫేర్ అవార్డు |
2007 | ఏకలవ్య :ది రాయల్ గార్డ్ | నిర్మాత, దర్శకుడు, రచయిత | |
2006 | లగే రహో మున్నా భాయ్ | నిర్మాత, స్క్రీన్ ప్లే అసోసియేట్, గీత రచయిత | సంపూర్ణ వినోదాన్ని అందించే ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు
ఉత్తమ కథకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు నామినేట్ చేయబడింది – ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు నామినేట్ చేయబడింది – ఉత్తమ స్క్రీన్ ప్లే కోసం ఫిల్మ్ ఫేర్ అవార్డు |
2005 | పరిణీత | నిర్మాత, కథ, సంభాషణల రచయిత, పర్యవేక్షక ఎడిటర్ | ఉత్తమ తొలి దర్శకుడిగా ఇందిరా గాంధీ అవార్డునామినేట్ చేయబడింది – ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు |
2003 | మున్నా భాయ్ ఎం.బీ.బీ.ఎస్ | నిర్మాత, రచయిత | సంపూర్ణ వినోదాన్ని అందించే ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు
ఉత్తమ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డు (క్రిటిక్స్) ఉత్తమ స్క్రీన్ ప్లేకి ఫిల్మ్ ఫేర్ అవార్డు నామినేట్ చేయబడింది – ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు |
2000 | మిషన్ కాశ్మీర్ | నిర్మాత, దర్శకుడు, రచయిత | నామినేట్ చేయబడింది – ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
నామినేట్ చేయబడింది – ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు |
1998 | కరీబ్ | నిర్మాత, దర్శకుడు, రచయిత | |
1994 | 1942: ఎ లవ్ స్టోరీ | నిర్మాత, దర్శకుడు, రచయిత | నామినేట్ చేయబడింది – ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
నామినేట్ చేయబడింది – ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు |
1989 | పారిందా | నిర్మాత, దర్శకుడు, రచయిత | ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
నామినేట్ చేయబడింది – ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు |
1985 | ఖామోష్ | నిర్మాత, దర్శకుడు, రచయిత | |
1983 | జాన్ బి దో యారో | నటుడు (దుశ్శాసన), ప్రొడక్షన్ కంట్రోలర్ | |
1981 | సజాయే మౌత్ | దర్శకుడు, రచయిత | |
1978 | ఆన్ ఎన్‌కౌంటర్ విత్ ఫేసెస్ | దర్శకుడు (డాక్యుమెంటరీ) | నామినేట్ చేయబడింది – ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కోసం అకాడమీ అవార్డు |
1976 | మర్డర్ యట్ మంకీ హిల్ | దర్శకుడు (డిప్లొమా ఫిల్మ్), రచయిత, నటుడు (అక్తర్) | ఉత్తమ ప్రయోగాత్మక చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం |
మూలాలు
[మార్చు]- ↑ Vidhu Vinod Chopra wives. . bollywoodshaadis.com
- ↑ Watch: A documentary revisits S. Sukhdev's life and career. Scroll.in.
- ↑ "Sleeping with the Enemy". OPEN Magazine (in ఇంగ్లీష్). 6 May 2010. Retrieved 2019-07-23.
- ↑ "Zuni Chopra, the quirky millennial author, at her candid best". in.com (in ఇంగ్లీష్). Archived from the original on 2018-10-19. Retrieved 2019-07-23.
- ↑ "Vidhu Vinod Chopra's upcoming film Shikara, described as a 'love letter from Kashmir', to release on 8 November". Firstpost. 29 August 2019. Retrieved 29 August 2019.
- ↑ "Broken Horses Is An Epic Disaster - Box Office India". boxofficeindia.com. Retrieved 2018-06-29.