వినోద్ భాయ్ చావ్డా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వినోద్ చావ్డా
వినోద్ భాయ్ చావ్డా


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
16 మే 2014
ముందు పూనంబెన్ జాట్
నియోజకవర్గం కచ్చ్

వ్యక్తిగత వివరాలు

జననం (1979-03-06) 1979 మార్చి 6 (వయసు 45)
సుఖ్‌పర్ నఖ్త్రానా, గుజరాత్ , భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు లఖమషి, రసిలా బెన్
జీవిత భాగస్వామి సావిత్రి బెన్
సంతానం 2
నివాసం భుజ్ , కచ్ , గుజరాత్
వృత్తి న్యాయవాది
మూలం [1]

వినోద్ లఖమషి చావ్డా (జననం 6 మార్చి 1979) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన కచ్చ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

వినోద్ భాయ్ చావ్డా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి కుత్బుల్లాపూర్ జిల్లా పంచాయతీలో సామాజిక న్యాయ కమిటీ చైర్మన్‌గా పని చేసి ఆ తరువాత 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కచ్చ్ నుండి పోటీ చేసి నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి దినేష్‌భాయ్ పర్మార్ పై 2,54,482 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 1 సెప్టెంబర్ 2014 నుండి 2019 వరకు పార్లమెంట్‌లో రవాణా, పర్యాటకం & సంస్కృతిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, 12 నవంబర్ 2014 నుండి 25 మే 2019 వరకు కన్సల్టేటివ్ కమిటీ, సామాజిక న్యాయం & సాధికారత మంత్రి & లైబ్రరీ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.

వినోద్ భాయ్ చావ్డా 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కచ్చ్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నరేష్ నారన్ భాయ్ మహేశ్వరిపై 3,05,513 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 13 సెప్టెంబర్ 2019 నుండి 4 జూన్ 2024 వరకు పార్లమెంట్‌లో పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్‌పై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, 16 సెప్టెంబర్ 2019 నుండి 4 జూన్ 2024 వరకు లాభదాయక కార్యాలయాలపై జాయింట్ కమిటీ సభ్యుడిగా, కన్సల్టేటివ్ కమిటీ, సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.[3]

వినోద్ భాయ్ చావ్డా 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కచ్చ్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నితీష్ భాయ్ లాలన్ పై 268782 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (2024). "Vinodbhai Chavda" (in ఇంగ్లీష్). Archived from the original on 25 July 2024. Retrieved 25 July 2024.
  2. TimelineDaily (6 March 2024). "Vinod Lakhamashi Chavda: BJP Candidate From Kachchh Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 16 July 2024. Retrieved 16 July 2024.
  3. News18 (23 May 2019). "Kachchh Election Results 2019 Live Updates (Kutch): Chavda Vinod Lakhamshi of BJP Wins" (in ఇంగ్లీష్). Archived from the original on 25 July 2024. Retrieved 25 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. The Times of India (7 June 2024). "Kachchh election results 2024 live updates: BJP's Chavda Vinod Lakhamshi wins, while Congress' Nitesh Parbatbhai Lalan loses". Archived from the original on 25 July 2024. Retrieved 25 July 2024.