విన్నకోట కృష్ణమూర్తి
విన్నకోట కృష్ణమూర్తి | |
---|---|
జననం | 1937 ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
ప్రసిద్ధి | రంగస్థల నటులు |
తండ్రి | కోటయ్య |
తల్లి | కొండమ్మ |
విన్నకోట కృష్ణమూర్తి ప్రముఖ రంగస్థల నటులు.
జననం
[మార్చు]కృష్ణమూర్తి 1937లో కోటయ్య, కొండమ్మ దంపతులకు ప్రకాశం జిల్లాలో జన్మించారు. గుంటూరు జిల్లా, తెనాలి మండలంలోని పినపాడు (తెనాలి) కి వచ్చి స్థిరపడ్డారు. తెనాలిలోని పోస్టల్ డిపార్టుమెంట్ లో పనిచేసి, పదవి విరమణ చేశారు.
రంగస్థల ప్రస్థానం
[మార్చు]కృష్ణమూర్తి తల్లిగారు కొండమ్మ పాటలు, అన్నగారు బృందావన భజన పాటలు పాడుతుండేవారు. అలా వారు పాడుతున్నప్పుడు విన్న కృష్ణమూర్తి తన స్నేహితుల దగ్గర పద్యాలు పాడుతుండేవారు.
లవకుశ నాటకంలోని సీత పాత్రతో రంగప్రవేశం చేశారు. ఎక్కువసార్లు సీత పాత్ర ధరించడం వల్ల వీరిని సీత అని పిలిచేవారు. శ్రీ వెంకటేశ్వర నాట్యమడలి వారి నాటకాలలో నటించారు. ఆకుల వెంకయ్య దగ్గర చింతామణి నాటకంలోని భవానీశంకరుడు పాత్రను నేర్చుకొని విజయవాడ, బాపట్ల మొదలైన ప్రాంతాలలో జరిగిన నాటకపోటీలలో పాల్గొని బహుమతులు అందుకున్నారు. బండారు రామారావు, పాతూరి రామకృష్ణమార్తి వంటి ప్రముఖ నటులతో కలిసి నటించారు.
నటించిన నాటకాలు - పాత్రలు
[మార్చు]- లవకుశ - సీత
- బాలనాగమ్మ - బాలనాగమ్మ, సంగు
- రాయభారం - కృష్ణుడు
- రామాంజనేయ యుద్ధం - రాముడు
- గయోపాఖ్యానం - కృష్ణుడు
- చింతామణి - భవానీశంకరుడు
సన్మానాలు
[మార్చు]1994లో తెనాలిలోని రామలింగేశ్వరపేటలో సన్మానించారు.
మూలాలు
[మార్చు]- విన్నకోట కృష్ణమూర్తి, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 334.