విభావరి దేశ్‌పాండే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విభావరి దేశ్‌పాండే
విభావరి దేశ్‌పాండే (2019)
జననం
విభావరి దీక్షిత్[1]

వృత్తినటి, రచయిత్రి, దర్శకురాలు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ
జీవిత భాగస్వామి
హృషికేశ్ దేశ్‌పాండే
(m. 2001)
పిల్లలు1

విభావరి దేశ్‌పాండే మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టివి, సినిమా నటి, రచయిత్రి, దర్శకురాలు.

జననం, విద్య

[మార్చు]

విభావరి మహారాష్ట్రలోని పూణేలో జన్మించింది. పూణేలోని గార్వేర్ హైస్కూల్ నుండి పాఠశాల విద్యను, ఫెర్గూసన్ కళాశాల నుండి ఆర్ట్స్ అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

విభావరి తండ్రి ఉపేంద్ర దీక్షిత్ 1931లో పూణేలో ఆమె తాత స్థాపించిన ఇంటర్నేషనల్ బుక్ సర్వీస్ అనే పుస్తక దుకాణాన్ని నడుపుతున్నాడు. ఆమె తల్లి మనీషా దీక్షిత్ పండితురాలు, రచయిత్రి, నాటకరంగ విమర్శకురాలు. అమ్మమ్మ ముక్తాబాయి దీక్షిత్ కూడా మరాఠీలో ప్రసిద్ధ కథా-నాటక రచయిత్రి.[2]

కళారంగం

[మార్చు]

రచయిత్రి, దర్శకురాలు

[మార్చు]

కళాశాలలో నాటకాలలో నటన, ఆఫ్-స్క్రీన్ పనులతో దేశ్‌పాండే కళారంగంలోకి వచ్చింది. ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నిర్వహించిన వివిధ కోర్సులకు, ప్రముఖ నాటకరంగ ప్రముఖుడు సత్యదేవ్ దూబే నిర్వహించిన వర్క్‌షాప్‌లకు కూడా హాజరయింది. నాటకరంగంలో ఆఫ్-స్క్రీన్ రచన విభాగంలో పనిచేసింది. స్టార్ ప్రవాహ్ లో ప్రసారమైన మరాఠీ టీవీ సీరియల్ అగ్నిహోత్రకు కూడా మాటలు రాసింది.

పిల్లల కోసం నాటకాలను రూపొందించే ఇండో-జర్మన్ గ్రూప్ " గ్రిప్స్"తో దేశ్‌పాండే నాటకరంగంలో చురుకుగా పాల్గొన్నది.[3] నటన, స్క్రిప్ట్‌లు రాయడంతోపాటు, కన్నడ నాటకం గుమ్మా బండ గుమ్మకు కూడా దర్శకత్వం వహించింది.[4]

2009 వచ్చిన హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ అనే సినిమాలో భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే భార్య సరస్వతి ఫాల్కే పాత్రను పోషించింది. భారతదేశపు మొట్టమొదటి పూర్తి-నిడివి చలనచిత్రం రాజా హరిశ్చంద్ర రూపొందించే దిశగా తన భర్త ప్రయాణంలో సహాయం అందించిన భార్యగా దేశ్‌పాండే పాత్ర ఉంటుంది.[5] ఈ సినిమాలోని సరస్వతి పాత్రకు ఉత్తమ నటి అవార్డును కూడా అందుకుంది.[6] 2010లో, ఆమె నటరంగ్ చిత్రంలో గుణ భార్య ద్వారక పాత్రను పోషించింది. 2011లో దేశ్‌పాండే గొప్ప మరాఠీ గాయకుడు, రంగస్థల నటుడు బాల గంధర్వ భార్యగా మరొక చారిత్రాత్మక పాత్రను పోషించింది. [7]

నటించినవి

[మార్చు]
సినిమాలు
సంవత్సరం పేరు పాత్ర ఇతర వివరాలు
2004 శ్వాస్ రిసెప్షనిస్ట్
2004 సాచ్య ఆత్ ఘరత్ కేతకి
2007 దమ్ కాట అనన్య తల్లి హిందీ సినిమా
2008 ముంబై మేరీ జాన్ అర్చన కదమ్ హిందీ సినిమా
2009 హరిశ్చంద్రచి ఫ్యాక్టరీ దాదాసాహెబ్ ఫాల్కే భార్య సరస్వతి ఫాల్కే
2010 నటరంగ్ ద్వారకా కాగల్కర్
2011 బాలగంధర్వ బాలగంధర్వ భార్య లక్ష్మి
2011 డియోల్ కవిత కోడలు
2012 చింటూ చింటూ తల్లి
2012 తుజా ధర్మ కొంటా? భూలాబాయి
2013 పోస్ట్‌కార్డ్ లిసా ఖంబ్లే
2017 తుమ్హారీ సులు కానిస్టేబుల్
2017 టిక్లీ అండ్ లక్ష్మి బాంబ్ లక్ష్మి
వెబ్ సిరీస్
సంవత్సరం శీర్షిక పాత్ర
2018 సెక్రెడ్ గేమ్స్ గైతోండే తల్లి
2019 మాయానగరి: సిటీ ఆఫ్ డ్రీమ్స్ పురుషోత్తముని భార్య
2020 బ్రీత్: ఇంటూ దీ షాడోస్ ప్రకాష్ కాంబ్లే కాలేజీ స్నేహితుడు
నాటకరంగం
శీర్షిక భాష పాత్ర మూలాలు
ఎంహెచ్-12 ముక్కం పోస్ట్ పూణే మరాఠీ నటి [8]
గుమ్మా బండ గుమ్మా కన్నడ దర్శకుడు [4]
గయాబ్ గీత్ మరాఠీ దర్శకుడు

మూలాలు

[మార్చు]
  1. "#puneonmymind: Vibhawari Dixit Deshpande, theatre artiste and actor on how Pune has always offered space to explore and expand culture". Hindustan Times (in ఇంగ్లీష్). 23 July 2018. Retrieved 2022-12-13.
  2. "विभावरी देशपांडेचे वडील". Maharashtra Times. 22 January 2012. Archived from the original on 2014-01-07. Retrieved 2022-12-13.
  3. Ainapure, Mrunmayi. "Coming to Grips with reality". The Times of India. Pune. Archived from the original on 18 February 2013. Retrieved 2022-12-13.
  4. 4.0 4.1 Mehar, Rakesh (6 December 2006). "All a child's play". The Hindu. Bangalore. Retrieved 2022-12-13.
  5. Masand, Rajeev (30 January 2010). "Watch out for 'Harishchandrachi Factory'". IBN Live. Archived from the original on 11 November 2010. Retrieved 2022-12-13.
  6. Badam, Ramola Talwar. "Bachchan accepts and confers honours in Marathi films". The National (Abu Dhabi). Retrieved 2022-12-13.
  7. Gokhale, Shanta (26 May 2011). "The real reel". The Times of India. Archived from the original on 7 January 2014. Retrieved 2022-12-13.
  8. "Vibhawari Deshpande and Prasad Oak". Daily News and Analysis. Pune. Retrieved 2022-12-13.

బయటి లింకులు

[మార్చు]