విమానం (2023 సినిమా)
| విమానం | |
|---|---|
| దర్శకత్వం | శివ ప్రసాద్ యానాల |
| రచన | శివ ప్రసాద్ యానాల |
| మాటలు | హను రావూరి |
| నిర్మాత | కిరణ్ కొర్రపాటి |
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | వివేక్ కాలేపు |
| కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
| సంగీతం | చరణ్ అర్జున్ |
నిర్మాణ సంస్థలు | జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ |
విడుదల తేదీ | 2023 జూన్ 9 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
విమానం 2023లో తెలుగులో విడుదలైన సినిమా. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై కిరణ్ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాకు శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహించాడు. సముద్రఖని, అనసూయ భరధ్వాజ్, మీరా జాస్మిన్, మాస్టర్ ధ్రువన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మే 13న,[1] ట్రైలర్‌ను 2022 జూన్ 1న విడుదల చేయగా,[2] సినిమాను జూన్ 09న విడుదల చేశారు.[3]
కథ
[మార్చు]కథ వీరయ్య (సముద్రఖని) వికలాంగుడు. సులభ్ కాంప్లెక్స్ నిర్వహిస్తూ జీవిస్తుంతాడు. భార్య చనిపోవటంతో అన్నీ తానై తన కుమారుడు రాజు (ధ్రువన్)ను చూసుకుంటూ అతడే జీవితంగా జీవిస్తుంతాడు.ఈ క్రమంలో కొడుకు రాజు నెల రోజుల కంటే ఎక్కువ బతకడు అనే చేదు నిజం తెలుస్తుంది. కొడుకు రాజుకు విమానం ఎక్కాలని కోరిక బలంగా ఉంటుంది. ఆ తర్వాత ఏమైంది? పేదరికంలో బ్రతుకుతున్న వీరయ్య తన కొడుకును విమానం ఎక్కిస్తాడా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[4]
నటీనటులు
[మార్చు]- సముద్రఖని
- అనసూయ భరధ్వాజ్- సుమతి [5]
- మీరా జాస్మిన్
- మాస్టర్ ధ్రువన్
- రాహుల్ రామకృష్ణ
- ధన్‌రాజ్
- రాజేంద్రన్
పాటల జాబితా
[మార్చు]- రేలా రేలా, రచన: చరణ్ అర్జున్ , గానం.మంగ్లి
- సుమతి , రచన: చరన్ అర్జున్, గానం. చరన్ అర్జున్.
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్
- నిర్మాత: కిరణ్ కొర్రపాటి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివ ప్రసాద్ యానాల[6]
- సంగీతం & పాటలు: చరణ్ అర్జున్
- సినిమాటోగ్రఫీ: వివేక్ కాలేపు
- ఆర్ట్ : జె.జె. మూర్తి
- ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్
- మాటలు : హను రావూరి
మూలాలు
[మార్చు]- ↑ A. B. P. Desam (14 May 2023). "అన్నీ ఇచ్చేవాడిని దేవుడు కాదు, నాన్న అంటారు - ఈ బుడ్డోడిని మర్చిపోలేం!". the original నుండి 4 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 June 2023.
- ↑ A. B. P. Desam (1 June 2023). "కొడుకును ఫ్లైట్ ఎక్కించేందుకు కన్నతండ్రి ఆవేదన, కంటతడి పెట్టిస్తున్న 'విమానం' ట్రైలర్". the original నుండి 4 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 June 2023.
- ↑ Eenadu (4 June 2023). "తండ్రీతనయుల విమానం గోల". the original నుండి 4 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 June 2023.
- ↑ Eenadu (9 June 2023). "రివ్యూ: విమానం.. సముద్రఖని, అనసూయల చిత్రం ఎలా ఉంది?". the original నుండి 11 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 June 2023.
- ↑ Eenadu (22 May 2023). "'విమానం' నుంచి అనసూయ 'సుమతీ...' లిరికల్ సాంగ్". the original నుండి 4 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 June 2023.
- ↑ The Hindu (8 June 2023). "From 'Jabardasth' to 'Vimanam', director Siva Prasad Yanala's unlikely journey" (in Indian English). ఒరిజినల్ నుండి 14 జూన్ 2023 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 October 2023.