వియత్నాంలో హిందూమతం
వియత్నాంలో హిందూమతాన్ని ప్రధానంగా చామ్ జాతి ప్రజలు ఆచరిస్తారు. [1] [2] ప్రస్తుతం ఉనికిలో ఉన్న రెండు భారత మూలాల్లేని స్థానిక హిందూ ప్రజల్లో బలమోన్ చామ్ శాఖ ఒకటి. [3] ప్రస్తుతం వియత్నాంలో దాదాపు 60,000 మంది హిందువులు నివసిస్తున్నారు. [4]
చామ్ హిందువులు
[మార్చు]వియత్నాంలోని చామ్‌లలో ఎక్కువ మంది (దీనిని తూర్పు చామ్ అని కూడా పిలుస్తారు) హిందువులు. కంబోడియను చామ్‌లు ఎక్కువగా ముస్లింలు. [5] హిందూ చామ్‌లను బాలమోన్ (బాని) చామ్ లేదా బాలమోన్ హిందూ అంటారు . [6] వారు శైవారాధనలో ఒక రూపాన్ని ఆచరిస్తారు. [7] చాలా మంది చామ్ హిందువులు క్షత్రియ వర్ణానికి చెందినవారు. [8] కానీ గణనీయమైన మైనారిటీ మైనారిటీ సంఖ్యలో బ్రాహ్మణులు కూడా ఉన్నారు. [9] వియత్నాంలో చాలా మంది చామ్‌లు నివసించే నిన్హ్ థువాన్ ప్రావిన్స్‌లో, చామ్ బాలమోన్ (హిందూ చామ్) సంఖ్య 32,000; నిన్హ్ థువాన్ లోని 22 గ్రామాలలో 15 హిందూ గ్రామాలు. [10] ప్రస్తుతం పో ఇను నుగర్, పో రోమ్, పో క్లాంగ్ గిరై, పో డాం అనే నాలుగు దేవాలయాల్లో పూజలు జరుగుతున్నాయి. మియూ పో నగర్, డేన్ థోథాప్ పో పటావ్, డేన్ పో కబ్రా కొన్ని ఇతర హిందూ దేవాలయాలు. [3]
చామ్ హిందువులు చనిపోయినప్పుడు, పవిత్ర వృషభమైన నంది, వారి ఆత్మను పవిత్ర భారత భూమికి తీసుకెళ్లడానికి వస్తుందని నమ్ముతారు. [11] చామ్ హిందువుల ప్రధాన పండుగ కేట్ పండుగ, [12] లేదా ఎంబాంగ్ కేట్. అక్టోబరు ప్రారంభంలో దీన్ని 3 రోజుల పాటు జరుపుకుంటారు. [13]
2009 జనాభా లెక్కల ప్రకారం వియత్నాంలో మొత్తం 56,427 మంది చామ్ హిందువులు ఉన్నారు. వీరిలో 40,695 మంది నింహ్ థువాన్‌లో ఉన్నారు. మరో 15,094 మంది బింహ్ థువాన్‌లో ఉన్నారు. [14] నిన్హ్ థువాన్, బిన్హ్ థువాన్ ప్రావిన్సుల జనాభాల్లో ఇది 22%, 4.8%. [14] 2017 నాటికి, యునైటెడ్ స్టేట్స్ బ్యూరో ఆఫ్ డెమోక్రసీ, హ్యూమన్ రైట్స్ అండ్ లేబర్ సంస్థ వియత్నాంలో 70,000 చామ్ జాతి హిందువులు ఉన్నట్లు అంచనా వేసింది. [15]
పురాతన చామ్ హిందూ దేవాలయాలు
[మార్చు]- పో క్లోంగ్ గరై ఆలయం
- పో నగర్
- మాయ్ సోన్
భారతీయ హిందువులు
[మార్చు]హో చి మిన్ సిటీలో 4,000 మంది హిందువులు ఉన్నారు. వీరిలో చాలా మంది బని చామ్ హిందువులు కాగా, కొద్ది సంఖ్యలో మైనారిటీ భారతీయులున్నారు. [16] హో చి మిన్ సిటీ లోని తమిళ హిందువులకు అక్కడి మారియమ్మన్ దేవాలయం కేంద్ర బిందువు. దీన్ని చాలా మంది స్థానిక వియత్నామీస్, చైనీస్ లు కూడా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. దీనికి అద్భుత శక్తులున్నాయని నమ్ముతారు. [17]
సైగాన్ (హో చి మిన్ సిటీ) లో మూడు భారతీయ హిందూ దేవాలయాలు ఉన్నాయి - శ్రీ దండాయుథపాణి ఆలయం, తేన్ సుబ్రమణ్యం స్వామి ఆలయం, మారియమ్మన్ ఆలయం. [18]
జనాభా వివరాలు
[మార్చు]చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
2009 | 56,427 | — |
2019 | 64,547 | +14.4% |
2009 నాటి ప్రభుత్వ జనాభా లెక్కల ప్రకారం, బాలమోన్ హిందువుల జనాభా 56,427. ఈ సంఖ్యలో 40,695 మంది నిన్హ్ థువాన్‌లోను, 15,094 మంది బిన్హ్ థువాన్‌లోనూ ఉన్నారు. ఇందులో తమిళ హిందువుల జనాభాను చేర్చలేదు. [14] అయితే, UK రాయబార కార్యాలయం అధికారిక అంచనా ప్రకారం వియత్నాంలో 1,500 మంది హిందువులు ఉన్నారు. వారు బహుశా తమిళ హిందువులు కావచ్చు. [19]
మూలాలు
[మార్చు]- ↑ "Hindus of Vietnam - Hindu Human Rights Online News Magazine". www.hinduhumanrights.info. Archived from the original on 2021-10-05. Retrieved 2021-12-04.
- ↑ "Vietnam's ancient Hindu culture rediscovered". InDaily (in ఇంగ్లీష్). 2015-03-23. Retrieved 2020-09-14.
- ↑ 3.0 3.1 Parker, Vrndavan Brannon (April–June 2014). "Cultures: Vietnam's Champa Kingdom Marches on". Hinduism Today.
- ↑ http://tongdieutradanso.vn/uploads/data/6/files/files/2_%20Bieu%20so%20lieu%20va%20phu%20luc%20(duyet%20gui%20in).pdf
- ↑ "Cham - Introduction, Location, Language, Folklore, Religion, Major holidays, Rites of passage". www.everyculture.com.
- ↑ "The Cham: Descendants of Ancient Rulers of South China Sea Watch Maritime Dispute From Sidelines". National Geographic News. 18 June 2014.
- ↑ "Religion and expressive culture - Cham". www.everyculture.com.
- ↑ India's interaction with Southeast Asia, Volume 1, Part 3 By Govind Chandra Pande, Project of History of Indian Science, Philosophy, and Culture, Centre for Studies in Civilizations (Delhi, India) p.231,252
- ↑ "Vietnam". International Religious Freedom Report 2004. U.S. Department of State: Bureau of Democracy, Human Rights, and Labor. 2002-10-22. Retrieved 2010-05-19.
- ↑ Other place where they are found in hgher numbers is Bình Thuận Province. Champa and the archaeology of Mỹ Sơn (Vietnam) by Andrew Hardy, Mauro Cucarzi, Patrizia Zolese p.105
- ↑ Roy, Sandip. "Leaps of faith". @businessline.
- ↑ Reporter, W. H. N. (13 October 2018). "Exhibition on Vietnam Hindu Cham Brahman Community Opens". Archived from the original on 23 సెప్టెంబరు 2019. Retrieved 4 డిసెంబరు 2021.
- ↑ "Kate Festival". www.vietnamonline.com.
- ↑ 14.0 14.1 14.2 http://www.gso.gov.vn/Modules/Doc_Download.aspx?DocID=12724
- ↑ "International Religious Freedom Report for 2017: Vietnam". US State Department. Retrieved 2018-12-16.
- ↑ "Hindus of Vietnam - Hindu Human Rights Online News Magazine". Hindu Human Rights Online News Magazine. 19 October 2012. Archived from the original on 5 అక్టోబరు 2021. Retrieved 4 డిసెంబరు 2021.
- ↑ Arachika Kapoor (2017-03-01). "Ho Chi Minh City Tourism holds roadshow in New Delhi | Media India Group". Mediaindia.eu. Archived from the original on 2018-12-15. Retrieved 2018-12-16.
- ↑ Powell, Michael (26 May 2017). "Three Hindu Temples in Saigon".
- ↑ "Vietnam: country policy and information notes". GOV.UK.