విరియాటో ఫెర్నాండెజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విరియాటో ఫెర్నాండెజ్
విరియాటో ఫెర్నాండెజ్

2024 సంసద్ భవన్‌లో 18వ లోక్‌సభ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఫెర్నాండెజ్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024[1]
ముందు ఫ్రాన్సిస్కో సార్డిన్హా
నియోజకవర్గం దక్షిణ గోవా
ఆధిక్యత 13,535 (48.35%)[2]

వ్యక్తిగత వివరాలు

జననం (1969-02-02) 1969 ఫిబ్రవరి 2 (వయసు 55)
మపుసా, గోవా , భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ (2021 నుండి)
జీవిత భాగస్వామి
అనితా రోడ్రిగ్స్
(m. 1996)
సంతానం 1
నివాసం చికాలిమ్ , గోవా, భారతదేశం
పూర్వ విద్యార్థి
    • గోవా విశ్వవిద్యాలయం (బి.ఈ)
    • సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం
వృత్తి
  • రాజకీయ నాయకుడు
  • యాంత్రిక ఇంజనీర్
సంతకం విరియాటో ఫెర్నాండెజ్'s signature

విరియాటో ఫెర్నాండెజ్ (జననం 4 ఫిబ్రవరి 1969) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో దక్షిణ గోవా లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4]

రాజకీయ జీవితం

[మార్చు]

విరియాటో ఫెర్నాండెజ్ 2018లో గోయెంచో ఆవాజ్ స్వచ్చంద సంస్థను స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షుడిగా, రాష్ట్ర కన్వీనర్‌గా పని చేశాడు. ఆయన 2021 నవంబర్‌లో గోయెంచో అవాజ్‌ నుండి నిష్కమించి డిసెంబర్ 16న గోయెంచో స్వాభిమాన్ పార్టీని స్థాపించాడు. విరియాటో ఫెర్నాండెజ్ 10 డిసెంబర్ 2021న భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి 2022 గోవా శాసనసభ ఎన్నికలలో దబోలిమ్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి మౌవిన్ గోడిన్హో చేతిలో 1,570 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

విరియాటో ఫెర్నాండెజ్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో దక్షిణ గోవా లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి పల్లవి శ్రీనివాస్ డెంపోపై 13,535 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. "Captain Viriato Fernandes | PRSIndia". PRS Legislative Research.
  2. "General Election to Parliamentary Constituencies: Trends & Results June-2024". Election Commission of India. 5 June 2024. Retrieved 6 June 2024.
  3. Hindustan Times (4 June 2024). "Lok Sabha election results: BJP, Congress win one seat each in Goa" (in ఇంగ్లీష్). Archived from the original on 16 July 2024. Retrieved 16 July 2024.
  4. The Times of India (4 June 2024). "Viriato Fernandes 2024 Lok Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.
  5. Financialexpress (4 June 2024). "Goa Lok Sabha Election Results 2024: BJP' Shripad Yesso Naik wins in North, Congress' Captain Viriato Fernandes wins in South Goa" (in ఇంగ్లీష్). Archived from the original on 16 July 2024. Retrieved 16 July 2024.
  6. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - South Go". Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.