విల్లార్డ్ విగన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విల్లార్డ్ విగన్
జననంజూన్ 1957
ఆష్మోర్ పార్క్ ఎస్టేట్, వెడ్నెస్ ఫీల్డ్, ఇంగ్లాండు
రంగంశిల్పకళ
ఉద్యమంసూక్ష్మ శిల్పకళ
అవార్డులుMBE
సూక్ష్మ శిల్పకారుడు "విలార్డ్ విగన్"
విల్లార్డ్ విగన్ సృష్టించిన కొన్ని సూక్ష్మ శిల్పాలు

విల్లార్డ్ విగన్ (జ.1957) ఇంగ్లాండు లోని "బ్రిమిన్‌ఘమ్" కు చెందిన ఇంగ్లీషు శిల్పకారుడు. అతను సూక్ష్మ శిల్పాలు తయారుచేయుటలో ప్రసిద్ధుడు. అతను తయారుచేసిన శిల్పాలను ఒక సూది బెజ్జంలో అమర్చవచ్చు. సూది చివర నిలబెట్టవచ్చు. ఒక శిల్పం ఎంత చిన్నదంటే 0.005 మి.మీ ఎత్తు ఉంటుంది.[1] జూలై 2007 లో విల్లార్డ్ విగన్ తన కళా నైపుణ్యానికి, కళారంగానికి చేసిన సేవకు గానూ హె.ఆర్.హెచ్ ఛార్లెస్ వేల్స్ చే "ఎం.బి.ఇ" అవార్డు తో గౌరవించబడ్డాడు.[2] అతను చేసిన శివాటిలో సూదిబెజ్జంలో తొమ్మిది ఒంటెలు, అంతే స్థలంలో ఒబామా కుటుంబం, ఇసుక రేణువుపై రథం మొదలైన సూక్ష్మ శిల్పాలు ఉన్నాయి.

జీవిత విశేషాలు

[మార్చు]

తన బాల్యంలో పాఠశాలలో పాఠ్యాంశాలను ధారాళంగా చదవలేకపోయేవాడు. ఈ కారణంగా తన తరగతిలో సహచరులచే ఎగతాళి చేయబడ్డాడు. ప్రాథమిక పాఠశాలలో గురువులు కూడా తన మందబుద్ధి కారణంగా అపహాస్యం చేసేవారు.[3] విగన్ తన ఐదవ సంవత్సరం నుండి శిల్పకళ పట్ల ఆకర్షితుడయ్యాడు. తన పాఠశాలలో ఉపాధ్యాయుల, విద్యార్థుల ఎగతాళిని తప్పించుకొనుటకు పాఠశాలకు వెళ్ళకుండా శిల్పాలు తయారుచేయుట ప్రారంభించాడు.[3] అతడు ప్రపంచంలో ఏదీ సాధ్యం కానిది లేదని, ప్రజలు తన పనిని చూడలేనంత చిన్నగా ఉండాలని తన శిల్పాలపై విమర్శలు చేయకుండా ఉండాలని అతిచిన్న శిల్పాలను చేయడం ప్రారంభించాడు. శిల్పాలు ఎంత చిన్నవంటే వాటిని సూక్ష్మ దర్శిని ద్వారానే చూడగలము.

విగన్ వాస్తుశాస్త్రానికి చెందిన, సంస్కృతికి చెందిన అనేక శిల్పాలను తయారుచేశాడు. అతని శిల్పాలు సాధారణంగా చారిత్రక సంఘటనలు, యితర కళలకు సంబంధించి ఉంటాయి. అతను తయారుచేసిన సూక్ష్మ శిల్పాలలో ప్రసిద్ధి చెందినది ఒక నిముషములో సృష్టించిన "మైకలేంజిలో డేవిడ్" శిల్పం. ఈ శిల్పాన్ని యిసుక రేణువు, బియ్యం గింజపై తయారుచేశాడు. లండను లో గల "లోయిడ్ భవనం" ను కూడా సూక్ష్మ కళాఖండంగా తీర్చి దిద్దాడు. విగన్ ఒబామా కుటుంబాన్ని సూక్ష్మ శిల్పంగా తయారుచేశాడు. దీనిని సూది బెజ్జంలో అమర్చవచ్చు. అపోలో 11(1969 లూనార్ లాండింగ్) నౌకను చంద్రుని పైకి పంపిన అమెరికా నలభై సంవత్సరాల వేడుకలు జరిపే సందర్భంలో ఖగోళ శాస్త్రవేత్త అయిన "బజ్ ఆల్డ్రిన్" శిల్పాన్ని సూదిబెజ్జంలో సరిపోయేటట్లు తయారుచేయడం ఆయన శిల్పకళా నైపుణ్యానికి ప్రతీక. అతను యితర శిల్పాలు "ఫిపా" వరల్డ్ కప్ ట్రోఫీ, మైక్రోస్కోపిక్ బెట్టే బూప్. వీటిని 0.005 మి.మీ. పరిమాణంలో తయారుచేశాడు.

విల్లార్డ్ యొక్క శిల్పాలను సేకరించే వారిలో హెచ్.ఆర్.హెచ్. ప్రిన్స్ ఛార్లెస్, సర్ ఎల్టన్ జాన్(ప్రపంచ మాజీ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్) , మైక్ టైసన్, లార్డ్ బాత్(డేవిడ్ కప్ టెన్నిస్ మాజీ కెప్టెన్), డేవిడ్ లోయిద్, సైమన్ కొవెల్ వంటి ప్రముఖులు ఉన్నారు.

ఆయన శిల్పకళా నైపుణ్యం ప్రపంచంలో ఎనిమిదవ వింతగా చెప్పుకోవచ్చు. ఆయన కు బ్రిటన్ రాణి రెండవ ఎలిజిబెత్ అవార్డునివ్వడం వలన ఈయన కీర్తి ప్రతిష్టలు జూలై 2007 నాటికి వ్యాప్తి చెందాయి.

ఉపయోగించే వస్తువులు, సాంకేతిక పరిజ్ఞానం

[మార్చు]

విగన్ సూక్ష్మ శిల్పాలను తయారుచేయుటకు సుమారు ఎనిమిది వారాలు తీసుకుంటాడు. ఈ శిల్పాలు సూక్ష్మంగా ఉండటం వలన అవి తయారుచేయునపుడు తన నాడీ వ్యవస్థను, శ్వాసను నియంత్రించుకుంటాడు. అలా నియంత్రించనిచో శిల్పం చెడిపోయే అవకాశం ఉన్నది. ఆయన చిన్న కదలిక కూడా శిల్పం పై ప్రభావం చూపుతుంది. అందువల్ల విగన్ కు ఏకాగ్రత అవసరం. అందువల్ల చీమ కూడాచిటుక్కుమనని ప్రశాంత ప్రదేశంలో ఈ శిల్పాలను తయారుచేస్తాడు. ఆయన శిల్పాలను తయారుచేయునపుడు ధ్యానం చేయు స్థితిలో ఉంటాడు. ఆయన గుండె స్పందనలు బాగా తగ్గుతాయి. ఆ స్థితిలో మాత్రమే యిటువంటి కళాఖండాలు తయారుచేయగలడు.

ఈ శిల్పాలను బియ్యం గింజలపై తయారుచేయుటకు, గింజలను తొలుచుటకు "సర్జికల్ బ్లేడు" లను లేదా సూక్ష్మంగా టంగస్టన్ యొక్క సిల్వర్ తో చేయబడిన బ్లేడులను వాడతాడు. కొన్ని గింజలను తొలుచుటకు ఒక సూది చివరి భాగంలో సూక్ష్మ వజ్రాన్ని చేర్చి ఒక పరికరాన్ని తయారు చేశాడు. విగన్ తన పనికోసం నైలాన్, ఆహార ధాన్య గింజలు, ఇసుక రేణువులు, ధూళి కణాలు, బంగారు రేణువులు, సాలీడు దారాలు వాడతాడు. వీటిని ఆ శిల్పం యొక్క డిమాండును దృష్టిలో ఉంచుకొని ఉపయోగిస్తాడు. ఈ కళా ఖండాలపై రంగులు వేయుటకు చనిపోయిన ఈగల యొక్క వెండ్రుకలు ఉపయోగించేవాడు కానీ తన పని కోసం ఈగలను చంపేవాడు కాదు. ఆయన తయారుచేసిన పనులలో మైక్ టైసన్ యొక్క విగ్రహం , జీసస్ క్రీస్ట్ యొక్క తల, ఇతరాలు ప్రైవేటు కలెక్షన్లలో ఉన్నాయి.

ప్రదర్శనలు, అమెరికా ప్రయాణం

[మార్చు]

2009 లో విగన్ యు.కె. నందు ఆక్స్‌ఫర్డ్ లోని టెడ్ కాన్ఫరెన్స్ లో అతిథి గా ఉన్నాడు.[4] తర్వాత సంవత్సరం ఆయన యు.ఎస్.ఎ. నందు గల "ది టు నైట్ షో కోనన్ ఓ బ్రిఎన్" కు అతిథి కళాకారుడైనాడు[5] ఆ ప్రదర్శనలో ఆయన సూక్ష్మదర్శిని తో తన కళా ఖండాలను ప్రదర్శించాడు. ఆ కళా ఖండాలలో రెండు కళాఖండాలు సూదిబెజ్జంలో తయారుచేయబడినవి. అవి అమెరికా పతాకంతో స్పేస్ సూట్ లో ఉన్న "బజ్ ఆల్డ్రిన్", స్టార్ వార్స్ లో ఐదు పాత్రలు.

విగన్ తాను గింజలపై, ఇసుక రేణువులపై సూక్ష్మ శిల్పాలను తయారుచేయునపుడు కొన్నిసార్లు తన హృదయ స్పందనల కంపనముల కనుగుణంగా జాక్ హామర్ ఉపయోగించి చిన్న కణాలను తొలుస్తానని వివరించాడు.

2009, 2010 లలో యు.కె. లో ప్రదర్శనల అనంతరం ఆయన యు.ఎస్.ఎ. కు ప్రయాణమయ్యాడు.[6]

సూచికలు

[మార్చు]
  1. Strassmann, Mark (10 March 2010). "Willard Wigan's Micro Art". CBS Sunday Morning. CBS News. Archived from the original on 2 ఫిబ్రవరి 2011. Retrieved 20 March 2011.
  2. The tiny world of Willard Wigan, nano sculptor Archived 2008-07-31 at the Wayback Machine, Telegraph.co.uk, 7 July 2007, accessed 23 July 2007
  3. 3.0 3.1 "Willard Wigan – Artist". The Yale Center for Dyslexia & Creativity. Yale University. 2008. Retrieved 20 March 2011.
  4. Willard Wigan: Hold your breath for micro-sculpture, TED Conference, July 2009
  5. Micro Sculptor Willard Wigan, The Tonight Show with Conan O'Brien
  6. ""USA Tour Dates" at willard-wigan.com". Archived from the original on 2011-02-08. Retrieved 2013-06-01.

యితర లింకులు

[మార్చు]