వివర్తనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వివర్తనము
ట్రావెలింగ్ మిక్రోస్కొప్ సహాయముతో మనము వివర్తనమును చూడవచ్చును

వివర్తనం[మార్చు]

తరంగముల విషయములో వివర్తనము అంటే-అవి అవరోధాల అంచుల వద్ద వంగి ప్రయాణంచడం.అవరోధం తరంగాల తరంగ దైర్గ్యము కంటే పరిమాణంలో చాలా పెద్దదైతే, అంచుల వద్ద తరంగాలు ఏ మాత్రము వంగకుండా ప్రయాణిస్తాయి.అవరోధం కాంతి తరంగాల దైర్గ్యముతో పొల్చతగినంత చిన్నదైతే అంచుల వద్ద కాంతి వంగి ప్రయాణిస్తుంది.అవరోధం పరిమాణం తరంగ దైర్ఘ్యము కంటే చిన్నదైతే ప్రాయోగిక ఫలితము ఉండనంత స్వల్పంగా తరంగాలు అవరోధం అంచుల వద్ద వంగుతాయి.వివిధ పరిమాణాలుగల అవరోధాల అంచుల వద్ద నీటి తరంగాల వివర్తనాన్ని చుడవచ్చును. వివర్తనాన్ని వివరించడానికి రెండు పద్ధతులున్నయి.మొదటిది ఫ్రెనల్ వివర్తనము రెండవది ఫ్రాన్ హాఫర్ వివర్తనము[1][2].

ఫ్రెనల్ వివర్తనము[మార్చు]

ఈ పద్ద్దతిలో కాంతి జనకం, అవరోధం, మరియు తెర సాపేక్షంగా దగ్గరగా నిర్దిష్ట దూరాల్లో ఉంటాయి.అవరోధాన్ని సమీపించేవి.తరంగాగ్రాలు గోళాకార లేదా స్తుపాకార తరంగాగ్రాలై ఉంటాయి.అవరోధాన్ని సమీపించేవి, లేదా తెరను చేరి ఏ బిందువునైనా ప్రాకాసింపచేసే తరంగాగ్రాలు కావు.అంటే కాంతి కిరణాలు సమాంతరంగా ఉండవు.అందువల్ల ఈ తరహ పరీశీలనను సధారణ వివర్తనము అని కూడా అంటారు.వివర్తన పట్టీలను పరిశీలించుటకు కటకాల అవసరము ఉండదు.

ఫ్రాన్ హాఫర్ వివర్తనము[మార్చు]

ఈ పద్ధతిలో కాంతి జనకము, తెర, అవరోధము లేదా ద్వరాము నుండి అనంత అనంత దూరాల్లో ఉంటాయని భావిస్తాము.సమతల తరగ మూఖాలను పరిగణలోనికి తీసుకుంటాము.వివర్తన పట్టీలను పరశీలించడానికి కటకాలను ఉపయోగిస్తాము.గణితవిశ్లేషణ సులభముగా ఉండే ఈ వివర్తనాన్ని ఫ్రెనల్ వివర్తనము యొక్క అవధిగా భావిస్తాము.

ఇవి కూడా చుడండి[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=వివర్తనం&oldid=2006552" నుండి వెలికితీశారు