పట్టకం
దృశా శాస్త్రంలో పట్టకం అనేది పారదర్శకమయిన వస్తువు. దీని భుజాలన్నియూ సమతలంగా ఉంటాయి.ఈ భుజాలు కాంతిని వక్రీభవనం చెందిస్తాయి.ఈ భుజాల మధ్య కచ్ఛితంగా కోణము ఉంటుంది. ఉపరితలాల మధ్య కోణం దాని అప్లికేషన్ మీద ఆధారపడి ఉంటుంది. సాంప్రదాయ జ్యామితీయ ఆకృతి ప్రకారం త్రికోణ పట్టకం ఆధార భుజము, చతురస్రం భుజాలు కలిగి ఉంటుంది.సాధారణంగా పట్టకం అంటే ఈ ఆకృతినే పరిగణిస్తారు..[1]
అందువలన అన్ని దృశా శాస్త్ర పట్టకాలు రేఖా గణితం ప్రకారము పట్టకాలు కావు. పట్టకాలను ఏదయినా పారదర్శక పదార్థం నుండైనా రూపొందించవచ్చు. పదార్థం మారినపుడు పట్టకం యొక్క కాంతిని వక్రీభవించే సామర్థ్యం మారుతుంది. పట్టకం రూపొందించేందుకు వాడే పదార్థాలు సాధారణంగా గాజు, ప్లాస్టిక్, ఫ్లోరైట్ వగైరాలు.పట్టకం (రేఖాగణితం) ప్రిజంలలో చాలా రకాలు ఉన్నాయి.అబ్బె-కోనిగ్ ప్రిజం. ఒక విక్షేపణ పట్టకాన్ని వాడి కాంతిని ఏడు రంగులలోకీ (ఇంద్రధనుస్సు రంగులు). విభజించవచ్చు. అలానే కాంతిని ప్రతిబింబిప చేయగలము, లేదా వివిధ పోలరైజేషన్ భాగాలలోకి కాంతి విడిపోయేలా చేయవచ్చు. ఐజాక్ న్యూటన్, తెల్లటికాంతిలో ఏడు రంగులు ఉన్నాయని వెల్లడించాడు.[2]
పట్టకం పనితీరు
[మార్చు]కాంతి ఒక యానకం నుండి మరియొక యానకంలోకి ప్రయాణించేటపుడు వక్రీభవనం చెందుతుంది. కాంతి వేగము నీటిలో ఒక రకంగాను, గాజులో మరియొక రకంగాను ఉంటుంది. ఉదాహరణకు కాంతి గాలిలో ఒక సెకనుకు 3*10^8మీ/సె వేగంతో ప్రయాణిస్తుంది. కాంతి వక్రీభవనం అనేది అది యానకం లోకి ప్రవేశించే కోణాన్ని బట్టి మారుతుంది.మొదటగా కాంతి పట్టకం లోనికి ప్రవేశిస్తుంది.ఈ విధంగా ప్రవేశించిన కాంతి విక్షేపణ చెందుతుంది. విక్షేపణ ఐన తరువాత పట్టకం నుండి కాంతిని మనము స్పెక్ట్రోస్కోప్ సహాయంతో చూడవచ్చును.
విచలన కోణం, విక్షేపణ
[మార్చు]ప్రిజ్మం కాంతిని వికిరణం చెసే కోణం, విచలనాన్ని మనము స్నెల్స్ ధర్మము ఉపయొగించి కనుగొనవచ్ను.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ I. Newton (1704). Opticks. London: Royal Society. ISBN 0-486-60205-2.
- ↑ F. J. Duarte and J. A. Piper (1982). "Dispersion theory of multiple-prism beam expanders for pulsed dye lasers". Opt. Commun. 43 (5): 303–307. Bibcode:1982OptCo..43..303D. doi:10.1016/0030-4018(82)90216-4.
బాహ్య లింకులు
[మార్చు]- Java applet of refraction through a prism
- Grisms (Grating Prisms) Archived 2013-10-09 at the Wayback Machine
- Fundamental Optics – CVI Melles Griot