విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డ్
రకంప్రభుత్వ సంస్థ
పరిశ్రమనౌకా నిర్మాణం
స్థాపన1949
ప్రధాన కార్యాలయం,
భారతదేశం
సేవలునౌకా నిర్మాణం
నౌకల మరమ్మత్తు
వెబ్‌సైట్indiannavy.nic.in

బాంబే డాక్‌యార్డ్ తర్వాత భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన డాక్‌యార్డ్‌లలో విశాఖపట్నంలోని నేవల్ డాక్‌యార్డ్ ఒకటి.[1]

చరిత్ర

[మార్చు]

1941 డిసెంబరులో, ఐరోపాలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన కొద్దికాలానికే, రాయల్ ఇండియన్ నేవీ విశాఖపట్నంలో బర్మాలోని భారత సైన్యానికి మద్దతుగా "బోట్ రిపేర్ వర్క్‌షాప్"ని ఏర్పాటు చేసింది. 1942 మార్చిలో, అనేక భారతీయ తీరప్రాంత నగరాల్లో నావికాదళం చేపట్టిన ప్రాజెక్టుల్లో భాగంగా, విశాఖపట్నంలోని సదుపాయాన్ని కమ్మరి, వడ్రంగి వర్క్‌షాప్‌లు, మెషిన్ టూల్స్‌తో సహా మెరుగుపరచారు. వీటన్నింటినీ నౌకాదళ స్థావరం INS సర్కార్స్ లో పెట్టారు. 1947లో దీన్ని 200-టన్నుల స్లిప్‌వేతో నౌకల నిర్వహణ కేంద్రంగా మరింతగా ఉన్నతీకరించారు. 1953లో, ఈ సదుపాయాన్ని బేస్ రిపేర్ ఆర్గనైజేషన్ (BRO) గా విస్తరించారు. అప్పటికే ఉన్న వర్క్‌షాప్ యూనిట్లను కొత్త BRO కాంప్లెక్స్‌లోకి మార్చారు.[2]

1958లో కేంద్ర మంత్రివర్గం వైజాగ్‌లో నావికా స్థావరం, డాక్‌యార్డ్ ఏర్పాటు ప్రతిపాదనను ఆమోదించింది. 1962లో కొత్త జెట్టీ, వర్క్‌షాప్‌ భవనం మంజూరు చేయడంతోపాటు పోర్టు ట్రస్టు నుంచి 550 ఎకరాల భూమిని సేకరించారు. 1972లో, BRO పేరును నావల్ డాక్‌యార్డ్‌గా మార్చారు.[2]

మూలాలు

[మార్చు]
  1. "details". Indian Navy. Retrieved 17 January 2019.
  2. 2.0 2.1 Hiranandani, G. M. (2005). Transition to Eminence: The Indian Navy 1976-1990. Ministry of Defence; Lancer Publishers. p. 137. ISBN 9788170622666.