విశ్వదర్శనం - పాశ్చాత్య చింతన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విశ్వదర్శనం - భారతీయ చింతన
రచయిత(లు)నండూరి రామమోహనరావు
దేశంభారత దేశం
భాషతెలుగు

విశ్వదర్శనం - పాశ్చాత్య చింతన నండూరి రామమోహనరావు విశ్వం పుట్టుకపై పాశ్చాత్య తత్వవేత్తల ఆలోచనా సరళిని గురించి రాసిన పుస్తకం.

పూర్వరంగం

[మార్చు]

విశ్వదర్శనం అనే పేరుతో రెండు పుస్తకాలు వచ్చాయి. మొదటి పుస్తకం పాశ్చాత్య తత్వ చింతన గురించి చర్చిస్తుంది. రెండవదైన ఈ పుస్తకం భారతీయ తత్వ చింతన గురించి వివరిస్తుంది. ప్రపంచ దర్శన శాస్త్రాలను సంగ్రహంగా తెలుగు పాఠకులకు పరిచయం చేయడం ఈ రెండు పుస్తకాల ముఖ్యోద్దేశం. ఈ రెండు భాగాలు ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో 1980 - 1996 సంవత్సరాల మధ్య కాలంలో కొంత విరామాలతో ధారావాహికగా వెలువడ్డాయి. ఈ వ్యాసాలనే సంకలనం చేసి పుస్తకాలుగా విడుదల చేశారు. ఈ వ్యాసాలను రాయడానికి ప్రేరణ ఆంధ్రజ్యోతి వారపత్రిక మొదటి సంపాదకుడైన పురాణం సుబ్రహ్మణ్య శర్మ అని రచయిత ముందుమాటలో రాశాడు.[1] మొదటి భాగంగా విడుదలైన పాశ్చాత్య చింతన వ్యాసాలు పురాణం సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలోనే వెలువడగా తర్వాతి సంపాదకులైన తోటకూర రఘు ఆధ్వర్యంలో రెండోభాగం (భారతీయ చింతన) వ్యాసాలు ప్రచురించబడ్డాయి.

రచయితకు ప్రాచ్య, పాశ్చాత్య దేశాలతో సంబంధం లేకుండా తత్వ శాస్త్ర అధ్యయనంపై ఆసక్తి ఉంది. 1950-51 సమయంలో ఈయన బెర్ట్రాండ్ రసెల్ ఆంగ్లంలో రాసిన హిస్టరీ ఆఫ్ వెస్టర్న్ ఫిలాసఫీ పుస్తకం చదివి తెలుగులో అంతే సరళంగా పాశ్చాత్య తత్వ శాస్త్రాన్ని మాత్రమే కాక భారతీయ తత్వశాస్త్రాన్ని అర్థం చేసుకునే పుస్తకాలు ఉంటే బాగుంటుందని భావించి ఈ పుస్తక రచనకు పూనుకున్నాడు.[2] ఈ పుస్తకం మొదటగా 1988 ఆగస్టులో ప్రచురణ కాగా రెండవ ప్రచురణ 1996 డిసెంబరులోనూ, మూడవ ప్రచురణ 2003లో జరిగింది.

విషయం

[మార్చు]

పాశ్చాత్య చింతనకు మూలపురుషులు ప్రాచీన కాలపు గ్రీకులు. ఈ పుస్తకం వారి పూర్వరంగంతో ప్రారంభమై థేలీస్, ప్లేటో మొదలైన వారి చింతనను వివరిస్తూ దెకార్త్, కాంట్, హెగెల్ మొదలైన నవీన యుగపు దార్శనికుల సిద్ధాంతాలను పరిచయం చేసి జా పోల్ సార్త్ర అస్తిత్వ వాదంతో ముగుస్తుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. నండూరి, రామమోహనరావు (2015). విశ్వదర్శనం భారతీయ చింతన. విజయవాడ: విక్టరీ పబ్లికేషన్సు. p. 7.
  2. నండూరి, రామమోహనరావు (2003). విశ్వదర్శనం పాశ్చాత్య చింతన. విజయవాడ: విక్టరీ పబ్లికేషన్స్. p. 4.