Jump to content

విశ్వయోగి విశ్వంజీ

వికీపీడియా నుండి
విశ్వయోగి విశ్వంజీ
విశ్వయోగి విశ్వంజీ చిత్రం
వ్యక్తిగతం
జననం
విశ్వనాథ శాస్త్రి

(1944-03-05)1944 మార్చి 5
గుంటూరు జిల్లా.
మతంహిందూమతము
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లువిశ్వయోగి విశ్వంజీ మహరాజ్
Senior posting
Based inవిశ్వ నగరం
Initiationదీక్ష–1965,
Postగురువు, సన్యాసి, ఆచార్యుడు
Websitehttp://www.viswaguru.com/index.shtml

విశ్వయోగి విశ్వంజీ గుంటూరు విశ్వమందిరం పీఠాధిపతులు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన గుంటూరు జిల్లాలో మార్చి 5 1944 న వరలక్ష్మమ్మ, ఆంజనేయులు దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి ఆధ్యాత్మిక ధ్యాన సాధకులు. ఆయనకు శ్రీ శ్రీమద్ పరమహంస పరి వ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ దేవకినందన స్వామి వారు దత్తాత్రేయ స్వామి రూపం లో కనిపించి తారక మంత్రాన్ని ఉపదేశించారు.ఆయన ప్రముఖ కవి, ఉన్నత విలువలు గల జీవితాన్ని గడిపినవాడు. ఒకానొక సమయంలో ఆయన కొన్ని రోజులు బెనారస్ లో నివాసముండవలసి వచ్చింది. ఒక రాత్రి ఆయనకు జ్యోతిర్లింగం (విశ్వనాథుని విగ్రహం) నుండి కాంతి పుంజాలు వెలువడడం సాక్షాత్కరించింది. అదే సమయంలో గుంటూరులో ఉన్న ఆయన భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆంజనేయులు ఆ బిడ్డకు విశ్వనాథ శాస్త్రిగా నామకరణం చేసారు. ప్రతీ ఒక్కరు ఆయనను బాల్యంలో "విశ్వం" అని పిలిచేవారు.[2]

ఆయన బి.ఎ (గణితం), బి.యిడి విద్యలను అభ్యసించారు. కొద్ది కాలంలోనే మంచి ఆంగ్ల, గణిత ఉపాధ్యాయునిగా మంచి గుర్తింపు పొందారు. అనేక మంది అధికారుల ప్రశంసలు పొందారు. అనేక మంది ఉపాధ్యాయులకు ఆదర్శప్రాయులైనారు.

1965లో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీధర్ మహరాజ్ ప్రియ శిష్యులైన శ్రీ దత్తాత్రేయ వాడేకర్ మహరాజ్ వద్ద నుండి మంత్రోపదేశం పొందడమే కాకుండా ఆయనయొక్క నుండి అన్ని శక్తులను ఆయనచే స్వీకరించారు. తరువాత ఆయన 21 సంవత్సరాలపాటు ఘోర తపస్సు చేసారు. ఆయన సాధన ద్వారా ప్రముఖ శక్తులను పొందారు. తరువాత ఆయన విశ్వయోగిగా అవతరించారు. ప్రస్తుతం ఆయనన్ విశ్వదత్తగా ప్రసిద్ధులైనారు.

నవంబరు 11 1988 న ఆయన ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసారు. తదుపరి ఆయన సమాజ సేవకు అంకితమయ్యారు. విశ్వప్రేమకు తన జీవితాన్ని అంకితం చేసారు.

ఆయన దత్తాత్రేయ స్వామి యొక్క 9వ అవతారంగా కొనియాడబడుతున్నారు. ఆయన "విశ్వయోగి విశ్వంజీ మహరాజ్"గా అవతరించారు.

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]