Jump to content

విశ్వనగరం

వికీపీడియా నుండి
విశ్వగురుపీఠం.
విశ్వనగరంలోని మహోన్నతమైన విశ్వస్థూపం.

విశ్వనగరం (Viswa Nagar or Viswanagar) శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ వారిచే స్థాపించబడిన ఒక ఆశ్రమ ప్రాంతం. ఇది జాతీయ రహదారి 16 మీద గుంటూరు - చిలకలూరిపేట మధ్యగల చినకొండ్రుపాడు గ్రామ పరిధిలో ఉన్నది.[1] ఈ ఆశ్రమానికి రెండు ప్రవేశద్వారాలు కలవు: అవి అనసూయ ద్వారం, అత్రి ద్వారం. ప్రకృతిసిద్ధమైన ఈ ప్రాంతం 18 ఎకరాల సువిశాల ప్రాంతంలో విస్తరించి; ప్రపంచ శాంతికి చెందిన వివిధ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. దీనికి పశ్చిమంగా విస్తరించిన కొండవీడు పర్వత సానువుల నుండి తూర్పువైపునకు నీరు ప్రవహించి ఆశ్రమ ప్రాంతాన్ని పవిత్రం చేస్తాయి.

ఆశ్రమంలోని విశేషాలు

[మార్చు]
  • విశ్వమానవ సమైక్యతా స్థూపం (Universal Integration pillar) : ఇది అష్టదళ పద్మాకారంలో సత్యం, శీలం, పవిత్రత, సమైక్యతలను చాటుతున్నది. ఈ మందిరం 98 అడుగుల ఎత్తు, 45 అడుగుల వ్యాసార్ధం కలిగి గోళాకారంలో ఎనిమిది ద్వారాలతో మహోన్నతంగా నిర్మించబడినది.[2] హిందూ, క్రైస్తవ, శిక్కు, బౌద్ధ, జైన, జోరాష్ట్రియన్, ఇస్లాం మతాలకు ప్రతీకలుగా ఏడు ద్వారాలతోబాటు హేతువాదాన్ని కూడా మతంగా గుర్తించి దానికి ఒక ద్వారాన్ని ఏర్పాటు చేయడం విశేషం. శాంతికి ప్రతీకయైన చిత్రాన్ని లింగాకారంలో ఉన్న స్థూపపు శిఖరంపై ఉంచారు. దానిపైన పూర్ణకుంభం, త్రిశూలం దర్శనమిస్తాయి.
  • విశ్వగురుపీఠం (Universal abode of Sri Viswamji) : ఇది స్వామీజీ వారి కార్యక్రమాలకు ప్రధాన కేంద్రం.
  • దత్త పాదుకా మందిరం : ఇందులో శ్రీ శ్రీధర్ మహరాజ్, శ్రీ షిర్డి సాయినాథుడు, శ్రీపాద శ్రీవల్లభుడు, శ్రీ నృశింహ సరస్వతి, శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి, శ్రీ మాణిక్య ప్రభువు, గజానన మహరాజు మున్నగు గురువుల స్వరూపాలు స్థాపించబడ్డాయి.
  • అష్టసిద్ధి ఆడిటోరియం
  • హోమశాల (Place of offering worship to celestial Gods through fire).
  • విశ్వయోగి వైద్య ఆరోగ్య సంస్థ (Viswayogi Institute of Medical Sciences or VIMS)[3] దీనిని ఏప్రిల్ 3, 2008 తేదీన భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారిచే ప్రారంభించబడినది.
  • సరస్వతీ దేవి విగ్రహం.
  • శ్రీ కల్పవృక్ష వరసిద్ధి వినాయకుని దేవాలయం
  • శ్రీ విశ్వ కుండలిని శ్రీనివాస సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం
  • గోశాల : సుమారు 100 పైగా గోవుల సంరక్షణ ఆశ్రమ ప్రాంగణంలో చేపట్టబడ్డాయి.
  • విశ్వంభరి : భక్తుల సౌకర్యార్థం నిర్మించిన వసతిగృహాలు.
  • శాకంబరి : భోజనశాల.

కార్యక్రమాలు

[మార్చు]
  • దత్తజయంతి
  • గురుపౌర్ణమి
  • విశ్వంజీ మహారాజ్ వారి జన్మదిన వేడుకలు : ప్రతి సంవత్సరం మార్చి 5వ తేదీన స్వామివారి జన్మదిన శుభసందర్భంగా వివిధ భక్తి, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు నిర్వహించబడతాయి.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Viswa Nagar, Guntur| Viswa Nagar Photos and Timings". www.holidify.com. Retrieved 2023-03-16.
  2. విశ్వమానవ సమైక్యతా స్థూపము (విశ్వమందిరం). విశ్వగురు వైభవం. వి. రత్నమోహిని. p. 73.
  3. విశ్వగురు. "Viswayogi Institute of Medical Sciences" (in English). Retrieved 6 March 2017.{{cite web}}: CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు

[మార్చు]