విశ్వరూపం (సినిమా)
Jump to navigation
Jump to search
విశ్వరూపం (1981 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, జయసుధ , అంబిక |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | కవిరత్న మూవీస్ |
భాష | తెలుగు |
విశ్వరూపం 1981, జూలై 25న విడుదలైన తెలుగు చలనచిత్రం. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, జయసుధ , అంబిక నాయికానాయకులుగా నటించారు. విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండాలని, స్వార్థపరులైన రాజకీయ నాయకుల కుట్రలకు బలికావద్దని ప్రభోదించే చిత్రం విశ్వరూపం. స్వార్థ రాజకీయ కుట్రలకు సమాజం ఏవిధంగా బలి అవుతుందన్న విషయాన్ని దర్శకుడు చక్కగా వివరించాడు.[1] ఇందులో కళాశాల అధ్యాపకునిగా, పచ్చిరౌడీగా ఎన్.టి.ఆర్. తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు.
నటీనటులు
[మార్చు]- నందమూరి తారకరామారావు
- జయసుధ
- అంబిక
- రావు గోపాలరావు
- అల్లు రామలింగయ్య
- కైకాల సత్యనారాయణ
- ఈశ్వరరావు
- ప్రసాదబాబు
- హరిప్రసాద్
- నారాయణమూర్తి
- సుభాషిణి
- సుకుమారి
- అనిత
- కాంతారావు
- మిక్కిలినేని
- బాలకృష్ణ
- జి.వి.జి.
- సి.హెచ్.కృష్ణమూర్తి
- జగ్గారావు
- రాళ్ళబండి
- టెలిఫోన్ సత్యనారాయణ
- గాదిరాజు సుబ్బారావు
- మదన్ మోహన్
సాంకేతిక వర్గం
[మార్చు]నిర్మాణ సంస్థ.కవిరత్న మూవీస్
దర్శకత్వం.దాసరి నారాయణరావు
సంగీతం.చక్రవర్తి
పాటల జాబితా
[మార్చు]- నూటికో కోటికో ఒక్కరు , రచన: దాసరి నారాయణరావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- కీచు కీచు పిట్ట , రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- కనులు చాలవా , రచన: రాజశ్రీ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- నారంగా సారంగా , రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- ఎవడికంటే తక్కువరా నేను , రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం .ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- యువకుల్లారా లేవండి, రచన: దాసరి నారాయణరావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
మూలాలు
[మార్చు]- ↑ ఎపి ప్రెస్ అకాడమి ఆర్కైవ్ (30 July 1981). విశ్వరూపం చిత్ర సమీక్ష. p. 5. Retrieved 18 July 2017.[permanent dead link]