Jump to content

వి.కళ్యాణం

వికీపీడియా నుండి
వి.కళ్యాణం

వి.కళ్యాణం (వెంకిట కళ్యాణం) (జననం.ఆగస్టు 15 1920) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, మహాత్మా గాంధీ యొక్క వ్యక్తిగత కార్యదర్శి. ఈయన మహాత్మా గాంధీ యొక్క వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన మహదేవ్ దేశాయ్ మరణానంతరం 1943 నుండి 1948 వరకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసారు. ఆయన గాంధేయవాది.[1][2]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన 1942 న క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని, [3] గాంధీజీ హత్య జరిగినవరకు ఆయనతోనే ఉన్నారు. నాథూరాం గాడ్సే గాంధీజీని కాల్చి చంపుతున్నప్పుడు కళ్యాణం ఆయన వెనకే ఉన్నారు.[4] గాంధీజీ పై కాల్పులు జరిగినపుడు గాంధీజీ తన చివరి మాటలుగా "హే రామ్" అనలేదని కళ్యాణం చెప్పారు.[4] గాంధీజీ మరణవార్తను మొట్టమొదటి సారిగా జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయి పటేల్కు చెప్పిన వ్యక్తి కళ్యాణం.[5]

గాంధీజీ మరణానంతరం ఆయన లండన్ లో "ఎడ్విన్ మౌంట్ బాటన్"కి సెక్రటరీగా పనిచేసారు. కొన్ని సంవత్సరాల తరువాత ఆయన సి.రాజగోపాలాచారి, జయప్రకాష్ నారాయణ్ లతో పనిచేయడానికి తిరిగి వచ్చారు.[3]

కళ్యాణం మహాత్మాగాంధీ వారసత్వాన్ని మరచిపోతున్న భారత జాతీయ కాంగ్రెస్ను విమర్శించారు.[2][6] కాగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడినప్పుడు ఆ పార్టీని రద్దు చేయాలని గాంధీజీ కోరుకునేవాడని ఆయన చెప్పారు.[7]

కళ్యాణం 2014 లో ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరారు.[8]

మూలాలు

[మార్చు]
  1. "Mahatma Gandhi's personal secretary V Kalyanam hails Narendra Modi's 'Swachch Bharat'". The Economic Times.
  2. 2.0 2.1 "Gandhi vs Godse debate irrelevant, says Kalyanam". Deccan Chronicle.
  3. 3.0 3.1 "rediff.com: Mahatma Gandhi's secretary V Kalyanam recalls his days with the Father of the Nation".
  4. 4.0 4.1 "Mahatma Gandhi : Last Day / Last Hours".[permanent dead link]
  5. "V Kalyanam, Mahatma Gandhi's ex- personal secretary joins AAP". www.oneindia.com.
  6. "Gandhiji's PS Slams Godse Statue Plan". The New Indian Express. Archived from the original on 2016-03-05. Retrieved 2015-07-21.
  7. Mini Muringatheri. "'Gandhiji would have begun a revolution'". The Hindu.
  8. "Mahatma Gandhi's ex-secretary joins AAP". The Times of India.

ఇతర లింకులు

[మార్చు]