వి.జయశంకర్
వి.జయశంకర్ | |
---|---|
జననం | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం | 1989 ఆగస్టు 9
జాతీయత | భారతీయుడు |
విద్య | బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ |
వృత్తి | చిత్ర కథా రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 2010–ప్రస్తుతం |
వి.జయశంకర్ (జ: 1989 ఆగష్టు 9) తెలుగు సినిమా రచయిత, దర్శకుడు.[1][2] పేపర్ బాయ్ సినిమాతో దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టాడు.
ప్రారంభ జీవితం
[మార్చు]వి. జయశంకర్ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో జన్మించాడు. చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చేసారు. ఆయన అనుకోకుండా ప్రముఖ కథారచయిత ఆదివిష్ణు విఘ్నేశ్వరరావును కలిసారు. ఆదివిష్ణు గారు ఆయనను కథలు వ్రాయుటకు ప్రోత్సహించారు. తరువాత ఆదివిష్ణు గారి సహకారంలో ఆయన అనేక కథలు వ్రాసారు. జయశంకర్ కు తెలుగు భాషపై పట్టు ఉంది. ఆయన ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తితో కలసి పనిచేస్తుంటారు. ఆయన రాసిన అనేక కథలు విజయం సాధించాయి.
టెలివిజన్ సీరియళ్ళ కథా రచయిత
[మార్చు]- అపరంజి
- ముద్దుబిడ్డ
- అభిషేకం
- మావిచిగురు
- చిన్న కోడలు
వంటి సీరియళ్ళకు కథను అందించాడు.[3][4]
లఘుచిత్ర దర్శకుడు, రచయిత
[మార్చు]- లవ్ యు ఫర్ ఎవర్ (2014)
- హాఫ్ గర్ల్ ప్రెండ్ (2014)
- ద గాడ్ మస్ట్ బె క్రేజీ (2015)
- హాపీ ఎండిగ్ (2015)
- రామాయణం లో తుప్పాకుల వేట(2016)
- హాఫ్ గర్ల్ ప్రెండ్(2016) (విడుదల కాలేదు)
వంటి లఘుచిత్రాలను రూపొందించాడు.[5]
సంభాషణలు
[మార్చు]పదునైన సంభాషణలకి జయశంకర్ పెట్టింది పేరు. ఏ రసమైనా, సంభాషణ క్లుప్తంగా, ఆలోచన రేకెత్తించే విధంగా ఉంటుంది. అతని కలంలో నుండి వెండితెరపైకి జాలువారిన కొన్ని సంభాషణలు:
- చార్మినార్, తాజ్ మహాల్ ప్రేమకు సింబల్స్ మాత్రమే ప్రూఫ్స్ కావు.
- ప్రేమలో వయస్సు కాదు మనస్సు ముఖ్యం.
- ఈజీగా వచ్చే అమ్మాయిలు ఎర్లీగా వెల్లిపోతారు- కష్టంగా పడే అమ్మాయిలు కలకాలం ఉండిపోతారు.
- అందంగా ఉన్నారని లవ్ చేయలేదు, లవ్ చేసిన తర్వాత అందంగా కనిపిస్తున్నావు.
- పడితే పగబడి నవ్వుతుంది, ఎదిగితే ఏడుస్తుంది… ఇదే సొసైటీ.
దర్శకత్వం వహించిన సినిమాలు
[మార్చు]- పేపర్ బాయ్ (2018)
మూలాలు
[మార్చు]- ↑ http://telugu.filmibeat.com/news/half-girlfriend-telugu-short-film-2014-041848.html
- ↑ V Jayashankarr. " Times International Award ", Times of India, Hyderabad, 9 August 2011.
- ↑ Jayashankarr. "Muddubidda". Zee Network. Archived from the original on 4 నవంబరు 2011. Retrieved 6 June 2010.
- ↑ Jayashankarr. "Aparanji". Gemini Network. Archived from the original on 3 మార్చి 2016. Retrieved 11 July 2011.
- ↑ V Jayashankarr. "Sakshi Youtube star", Sakshi, Hyderabad, 9 August 2011.