Jump to content

వి.భాస్కరరావు

వికీపీడియా నుండి

జస్టిస్ వి.భాస్కరరావు (1937 ఆగస్టు 21 - 2023 అక్టోబరు 16) భారతీయ న్యాయమూర్తి. 1995 నుండి 1999 వరకు ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించాడు.[1] పదవీ విరమణ అనంతరం ఆయన కమిటీ ఏర్పాటు చేసిన ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

వి.భాస్కరరావు ఉమ్మడి నల్గొండ జిల్లా చంతపల్లి మండలం ఘడియ గౌరారంలో 1937 ఆగస్టు 21న జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసాడు.

కెరీర్

[మార్చు]

1963లో న్యాయవాదిగా తన కెరీర్ ప్రారంభించాడు. దేవరకొండ, నల్గొండలలో ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ప్రాక్టీస్ చేసాడు. ఆయన 1981లో జిల్లా సెషన్స్ జడ్జిగా నియమించబడ్డాడు. అనంతరం 1995లో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రధేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 1997లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందాడు. 1999లో పదవీవిరమణ జరిగింది.

మరణం

[మార్చు]

జస్టిస్ భాస్కరరావు 86 ఏళ్ల వయసులో 2023 అక్టోబరు 16న హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచాడు.[2] ఆయనకు భార్య లలితాదేవి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. "vbrj". tshc.gov.in. Retrieved 2023-10-17.
  2. "ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి కన్నుమూత |". web.archive.org. 2023-10-17. Archived from the original on 2023-10-17. Retrieved 2023-10-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)