Jump to content

వి.వి.సుబ్రహ్మణ్యం

వికీపీడియా నుండి
వి.వి.సుబ్రహ్మణ్యం
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంవి.వి.సుబ్రహ్మణ్యం
జననం(1944-03-16)1944 మార్చి 16
తోత్తువ, కేరళ
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తివాయులీన విద్వాంసుడు
వాయిద్యాలువయోలిన్

వి.వి.సుబ్రహ్మణ్యం భారతీయ వాయులీన విద్వాంసుడు, స్వరకర్త, పండితుడు, విద్యావేత్త, రచయిత.

వివరాలు

[మార్చు]

ఇతడు 1944, మార్చి 16వ తేదీన కేరళ రాష్ట్రం, తోత్తువ గ్రామంలో జన్మించాడు.[1] ఇతడు మొదట తన తండ్రి వేదక్కెంచేరి వీరరాఘవ భాగవతార్ వద్ద సంగీతం అభ్యసించాడు. తరువాత త్రిపునితుర నారాయణ అయ్యర్, చెంబై వైద్యనాథ భాగవతార్, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ మొదలైన వారి వద్ద తర్ఫీదును పొందాడు.

ఇతడు ప్రక్కవాద్య కళాకారుడిగా, సోలో కళాకారుడిగా అనేక ప్రదర్శనలు ఇచ్చాడు.

ఇతడు అమెరికా సందర్శించిన మొట్టమొదటి వాయులీన విద్వాంసుడు.[మూలం అవసరం] ఇతడు ఐక్యరాజ్య సమితిలో ఎం.ఎస్. సుబ్బులక్ష్మితో పాటు తన విద్యను ప్రదర్శించాడు. యునెస్కోలో మొట్టమొదట వాద్యసంగీతం రికార్డు చేసిన దక్షిణ భారతదేశ కళాకారుడిగా ఇతడు పేరు గడించాడు.[మూలం అవసరం]

"తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్"‌ ఇతడికి కళైమామణి పురస్కారం ఇచ్చింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 2005లో కర్ణాటక సంగీతం - వాద్యం (వయోలిన్) విభాగంలో ఇతనికి అవార్డును ప్రదానం చేసింది. కేరళ సంగీత నాటక అకాడమీ అవార్డును కూడా ఇతడు స్వీకరించాడు.

ఇతడు రాధాప్రియ, సంచారి, ప్రియరంజని మొదలైన క్రొత్త రాగాలను సృష్టించాడు. తమిళ, సంస్కృత, హిందీ భాషలలో వర్ణాలకు, పాటలకు, తిల్లానాలకు, భజనలకు స్వరకల్పన చేశాడు. నృత్యకళాకారిణి చంద్రలేఖ నృత్యదర్శకత్వం వహించి ఆకాశవాణి జాతీయ అవార్డును పొందిన సంగీత నృత్యనాటిక "శ్రీ"కి ఇతడు సంగీతం అందించాడు. ఇతడు వయోలిన్‌కు సంబంధించి అనేక పుస్తకాలను రచించాడు. ధ్యాన, విజ్ఞాన, సంగీత విషయాలపై పరిశోధనా పత్రాలను సమర్పించాడు. కొన్ని చలనచిత్రాలకు సంగీతం సమకూర్చాడు.

ఇతని శిష్యులలో వి.వి.ఎస్.మురారి (కుమారుడు), వి.వి.రవి (సోదరుడు), రాఘవకృష్ణ, బి.యు.గణేష్ ప్రసాద్, బాలు రఘురామన్, జి.చంద్రమౌళి, ఆర్.కె.శ్రీరామ్‌కుమార్, వి.వి.శ్రీనివాసరావు మొదలైన వారున్నారు.

మూలాలు

[మార్చు]
  1. web master. "VV. Subramanyam". SRUTI MAGAZINE. THE SRUTI FOUNDATION. Retrieved 3 April 2021.