Jump to content

వసంత్ కుమార్ బావ

వికీపీడియా నుండి
(వీకే బావ నుండి దారిమార్పు చెందింది)
వసంత్ కుమార్ బావ
జననం
వసంత్ కుమార్ బావ

మరణం2023, జనవరి 9
జీవిత భాగస్వామిఅవ్‌ధీశ్ రాణి

వసంత్ కుమార్‌ బావ (వీకే బావ), విశ్రాంత ఐఏఎస్‌, చరిత్రకారుడు, రచయిత. హైదరాబాద్ చరిత్ర, వారసత్వ కట్టడాల పరిరక్షణోద్యమానికి ఆద్యుడిగా పేరొందిన ఈయన అంతర్జాతీయ చరిత్ర పరిశోధకులకు సైతం సుపరిచితుడు.[1]

జీవిత విషయాలు

[మార్చు]

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ ప్రాంతానికి చెందిన వీకే బావ, తన 60 ఏళ్ళ వయసులో అవ్‌ధీశ్ రాణి (ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు రాజ్ బహదూర్ గౌర్ సోదరి)ని ప్రేమించి వివాహం చేసుకున్నాడు.

వృత్తి జీవితం

[మార్చు]

1954 ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి వీకే బావ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్కైవ్స్‌ సంచాలకుడిగా పనిచేశాడు. 1960లలో హైదరాబాద్‌ జిల్లా కలెక్టరుగా బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ తరువాత విశాఖపట్నం పట్టణాభివృద్ధి ప్రాజెక్టు డైరెక్టర్‌గా, హుడా వ్యవస్థాపక వైస్‌ చైర్మన్‌గా పనిచేశాడు. 1979లో ఫోర్ట్‌ ఫౌండేషన్‌ ద్వారా హైదరాబాదు నగరంలోని వారసత్వ కట్టడాలపై అధ్యయనం చేయించాడు. హుడా చట్టంలోని నిబంధనల ప్రకారం 138 భవనాలను వారసత్వ భవనాలుగా ప్రకటించాడు. తర్వాత అదే హుడా వారసత్వ కట్టడాల జాబితా రూపకల్పనకూ ఆధారమైంది.[2]

రచనా ప్రస్థానం

[మార్చు]

రాష్ట్ర ఆర్కైవ్స్ డైరెక్టర్ గా ఉన్న కాలంలో పురాతన గ్రంథాలను, పత్రాలను పరిశోధించి పలు రచనలు చేశాడు.[3] 1980లో పదవీ విరమణ అనంతరం పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నాడు. కొంతకాలం ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ రీసెర్చి సీనియర్‌ ఫెలోగా ఉన్నాడు. హైదరాబాద్‌ చరిత్ర మీద మక్కువతో అనేక పరిశోధనాత్మక వ్యాసాలు రాశాడు. డెక్కన్ జర్నల్ కు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా కూడా పనిచేశాడు.[4]

రచనలు

[మార్చు]
  1. లాస్ట్ నిజాం: ది లైఫ్ అండ్ టైమ్స్ అఫ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్[5]
  2. అస్పెక్ట్ అఫ్ డెక్కన్ హిస్టరీ: రిపోర్ట్ అఫ్ ఆ సెమినార్[6]
  3. ‘ది నిజాం బిట్వీన్ మొఘల్స్ అండ్ బ్రిటీష్: హైదరాబాద్ అండర్ సోలార్ జంగ్ ఐ” (2016 జూలై)[7][8]
  4. గాంధీ ఇన్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ: ది ఆల్టర్నేటీవ్ అప్రోచ్ టూ డెవలప్మెంట్[9]
  5. ఇండియన్ మెట్రోపొలిస్ అర్బనైజేషన్, ప్లానింగ్ & మేనేజిమెంట్ (1987)[10]
  6. హైదరాబాద్ ఇన్ ట్రాన్సిషన్ అండర్ సోలార్ జంగ్ ఐ, 1853-1883: అన్ ఇండియన్ స్టేట్ అండర్ బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్[11]
  7. లాటిన్ అమెరికా: అన్ ఇంట్రడక్షన్ (2010)[12]
  8. ది అర్కివిస్ట్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (1959)[13]
  9. లాటిన్ అమెరికన్ ఇంటిగ్రేషన్ (1980)[14]
  10. రీజినల్ ఇంటిగ్రేషన్ ఇన్ ఆసియా (1970)[15]
  11. డెవలప్మెంట్ అఫ్ ది ఎమర్జింగ్ మెట్రోపొలిస్ అఫ్ విశాఖపట్నం అండ్ ది విశాఖపట్నం డిస్ట్రిక్ట్: అప్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ (1993)[16]
  12. ది క్కుల్లర్స్ అండ్ గాంధీ: ది స్టార్ట్ అఫ్ ఆ డైలాగ్ అండ్ అన్ అన్ కంప్లేటేడ్ జర్నీ (2004)[17]
  13. రూలర్స్ అఫ్ ది సెంటర్స్ అఫ్ దక్కనీ పెయింటింగ్ (1962-63)[18]

మరణం

[మార్చు]

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన వసంత్ కుమార్ తన 93 ఏళ్ళ వయసులో 2023, జనవరి 9న ఉదయం బంజారాహిల్స్‌లోని తన స్వగృహంలో మరణించాడు. క్రైస్తవ మతారాధకుడైన వసంత్ కుమార్ చివరి కోరిక మేరకు అతని భౌతికకాయం గాంధీ వైద్య కళాశాలకు అందజేయబడింది.[19]

మూలాలు

[మార్చు]
  1. ABN (2023-01-10). "Hyderabad City: వీకే బావ ఇక లేరు". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-01-10. Retrieved 2023-01-10.
  2. Chronicle, Deccan (2023-01-10). "Heritage activist V.K. Bawa passes away". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2023-01-10.
  3. "Bawa, Vasant K." www.worldcat.org. Archived from the original on 2021-12-08. Retrieved 2023-01-10.
  4. Global, Telugu (2023-01-10). "బావా సాహెబ్ ఇక లేరు." www.teluguglobal.com. Archived from the original on 2023-01-10. Retrieved 2023-01-10.
  5. "The last Nizam : the life and times of Mir Osman Ali Khan | WorldCat.org". www.worldcat.org (in ఇంగ్లీష్). Retrieved 2023-01-10.
  6. "Aspects of Deccan history : report of a seminar | WorldCat.org". www.worldcat.org (in ఇంగ్లీష్). Retrieved 2023-01-10.
  7. Leonard, Karen (Feb 1988). "The Nizam Between Mughals and British: Hyderabad Under Salar Jang I. By Vasant Kumar Bawa. New Delhi: S. Chand and Co., 1986. xxiv, 264 pp. Rs. 120". The Journal of Asian Studies (in ఇంగ్లీష్). 47 (1): 163–164. doi:10.2307/2056410. ISSN 1752-0401.
  8. Bawa, Vasant K. (1986). The Nizam Between Mughals and British: Hyderabad Under Salar Jang I (in ఇంగ్లీష్). S. Chand.
  9. "Gandhi in the twenty first century : an alternative approach to development | WorldCat.org". www.worldcat.org (in ఇంగ్లీష్). Retrieved 2023-01-10.
  10. Bawa, Vasant K. (1987). Indian Metropolis: Urbanization, Planning & Management (in ఇంగ్లీష్). Inter-India Publications. ISBN 978-81-210-0183-0.
  11. "Hyderabad in transition under Salar Jang I, 1853-1883 : an Indian state under British influence .. | WorldCat.org". www.worldcat.org (in ఇంగ్లీష్). Retrieved 2023-01-10.
  12. "Latin America : an introduction | WorldCat.org". www.worldcat.org (in ఇంగ్లీష్). Retrieved 2023-01-10.
  13. "The archivist and public administration | WorldCat.org". www.worldcat.org (in ఇంగ్లీష్). Retrieved 2023-01-10.
  14. Bawa, Vasant K. (1980). Latin American Integration (in ఇంగ్లీష్). Radiant.
  15. Bawa, Vasant K. (1970). Regional Integration in Asia (in ఇంగ్లీష్). Centre d'étude du Sud-Est asiatique et de l'Extrême-Orient.
  16. "Development of the emerging metropolis of Visakhapatnam and the Visakhapatnam district : an integrated approach | WorldCat.org". www.worldcat.org (in ఇంగ్లీష్). Retrieved 2023-01-10.
  17. "The quakers and Gandhi : the start of a dialogue and an uncompleted journey | WorldCat.org". www.worldcat.org (in ఇంగ్లీష్). Retrieved 2023-01-10.
  18. "Rulers of the centres of Deccani painting | WorldCat.org". www.worldcat.org (in ఇంగ్లీష్). Retrieved 2023-01-10.
  19. Bureau, The Hindu (2023-01-09). "Former civic planner and heritage activist Vasant Bawa passes away". The Hindu. ISSN 0971-751X. Archived from the original on 2023-01-09. Retrieved 2023-01-10.