Jump to content

అవ్‌ధీశ్ రాణి

వికీపీడియా నుండి

అవ్‌ధీశ్ రాణి తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారిణి. సాయుధ రైతాంగ పోరాటంలో కొరియర్‌గా సేవలందించింది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు రాజ్‌ బహదూర్‌ గౌర్‌కు చెల్లెలు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఈమె తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ పాతబస్తీలోని గౌలిపురాలో జన్మించింది. ఈమెది ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాయస్థ కుటుంబం. ఈమె తాతయ్య వ్యాపారరీత్యా 1870లలో హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. ఉర్దూ మీడియంలోనే ఫస్ట్‌ క్లాస్‌ నుంచి పీహెచ్‌డీ వరకు చదివింది. డిగ్రీ కళాశాల అధ్యాపకురాలిగా ఉద్యోగంలో చేరింది. ఎన్‌సిఈఆర్‌టి ఉర్దూ పాఠ్యపుస్తకాల రూపకల్పన చేసే స్థాయి వరకు ఎదిగింది.

వివాహం

[మార్చు]

‘లాస్ట్‌ నిజాం’ పుస్తక రచన సమయంలో చరిత్రకారుడు, సీనియర్‌ ఐఏఎస్‌ వసంతకుమార్‌ బావతో కలిగిన పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. వివాహ సమయంలో ఆయన వయసు 63 కాగా, ఆమె వయసు 53.

ఉద్యమ జీవితం

[మార్చు]

ఈమె అన్నయ్య డాక్టర్‌ రాజ్‌ బహదూర్‌ గౌర్‌ ప్రభావంతో చిన్ననాటి నుంచి కమ్యూనిస్టు పార్టీ అభిమానిగా మారింది. ‘కామ్రేడ్స్‌ అసోసియేషన్‌’ స్థాపించిన తరువాత జావేద్‌ రిజ్వీ, మగ్దూం మొహియుద్దీన్‌, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, పీసీ జోషీ, డాంగే, అజయ్‌ఘోష్‌, పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు లాంటి కమ్యూనిస్టు నాయకులంతా తరచూ ఇంటికి రావడంతో, వారందరితో అవ్‌ధీశ్ రాణికి పరిచయం ఏర్పడింది.

మూలాలు

[మార్చు]
  1. కె, వెంకటేశ్‌ (2023-09-24). "Avdhish Rani: అప్పట్లో మా కోడ్‌... పాల్‌రాబ్సన్‌". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-11-21. Retrieved 2023-11-21.