వీర శంకర్ బైరిశెట్టి

వికీపీడియా నుండి
(వీరశంకర్ బైరిశెట్టి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వీర శంకర్ బైరిశెట్టి
Veerashankar.jpg
జననం
జాతీయతభారతీయుడు
వృత్తిసినిమా దర్శకుడు

వీర శంకర్ బైరిశెట్టి తెలుగు సినిమా దర్శకుడు, మ్యూజిక్ కోఆర్డినేటర్.[1]

జీవిత విశేషాలు[మార్చు]

అతని జన్మస్థలం కర్ణాటక లోని గంగావతి. అతని తండ్రి బైరిశెట్టి సత్యనారాయణ స్వగ్రామం తణుకు దగ్గర చిపటం గ్రామం. వీరశంకర్ కు వేణుగోపాలరావు, వెంకటేశ్వరావు అనే ఇద్దరు సోదరులున్నారు.[2] అతను 1970 ఆగస్టు 17న జన్మించాడు.[3] అతను మొదట కోడి రామకృష్ణ దగ్గర సహ దర్శకుడిగా పనిచేసాడు. తరువాత 1997 హలో ఐ లవ్ యు సినిమాకు మొదటిసారి దర్శకత్వం వహించి తెలుగు సినీ పరిశ్రమలో అరంగేట్రం చేసాడు. 2004 లో పవన్ కళ్యాణ్ తో గుడుంబా శంకర్ సినిమా తీసాడు.[4]

సినిమాలు[మార్చు]

అతను ఈ క్రింది సినిమాలకు దర్శకత్వం వహించాడు.[5]

సంవత్సరం సినిమా భాష వివరణము
1997 హలో ఐ లవ్ యూ తెలుగు
1999 ప్రేమ కోసం తెలుగు
2000 విజయ రామరాజు తెలుగు
2004 గుడుంబా శంకర్ తెలుగు
2005 నమ్మ బసవ కన్నడ
2008 అంతు ఇంతు ప్రీతి బంతు కన్నడ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాకు రీ మేక్
2015 మన కుర్రాళ్ళే తెలుగు
2018 యువరాజ్యం తెలుగు

మూలాలు[మార్చు]

  1. "Veera Shankar Movies". bharatmovies.com. 21 November 2010. Archived from the original on 7 డిసెంబర్ 2016. Retrieved 11 February 2013. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  2. "ప్రముఖ దర్శకులు వీర శంకర్‌ ఇంట్లో విషాదం". www.10tv.in (in ఇంగ్లీష్). Retrieved 2020-06-19.
  3. "Veera Shankar Bairisetty". AbhiLyrics (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-06-19.
  4. "debut of Veera Shankar Bairisetty". thetelugufilmnagar.com. 29 Apr 2009. Archived from the original on 4 ఫిబ్రవరి 2018. Retrieved 11 January 2013.
  5. "list of films directed by Veera Shankar Bairisetty". indiancine.ma. 21 Apr 2010. Retrieved 21 March 2012.

బయటి లంకెలు[మార్చు]