Jump to content

వీరుడొక్కడే

వికీపీడియా నుండి
వీరుడొక్కడే
దర్శకత్వంశివ
రచనశివ
నిర్మాతతుమ్మలపల్లి రామసత్యనారాయణ
తారాగణంఅజిత్ కుమార్,
తమన్నా,
సంతానం,
విదార్థ్,
బాల
ఛాయాగ్రహణంవెట్రి
కూర్పుకాశీ విశ్వనాథన్
సంగీతందేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థలు
విజయా పిక్చర్స్,
భీమవరం టాకీస్
విడుదల తేదీ
మార్చి 21, 2014
భాషతమిళ

భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాతగా శివ దర్శకత్వంలో తెలుగులోకి విడుదలయిన అనువాద చిత్రం "వీరుడొక్కడే". తమిళంలో వీరం పేరుతో ఈ సినిమాను నిర్మించిన విజయా పిక్చర్స్ తెలుగులో కూడా విడుదల చేసింది. అజిత్ కుమార్, తమన్నా జంటగా నటించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతదర్శకుడిగా, వెట్రి ఛాయాగ్రాహకుడిగా, కాశీ విశ్వనాథన్ ఎడిటర్ గా పనిచేసారు. తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలుగులో 2014 మార్చి 21న భారిగా విడుదలయ్యింది.[1]

ఇది తెలుగులో కాటమరాయుడు (2017), కన్నడలో ఒడెయ (2019), హిందీలో కిసీ కా భాయ్ కిసీ కా జాన్ (2023)గా రీమేక్ చేయబడింది.

వీరవరం అనే ఊరిలో వీరేంద్ర (అజిత్ కుమార్) మార్కెట్ యార్డ్ లో ఒక షాప్ పెట్టుకొని ఉంటాడు. వీరేంద్రకి ధర్మ, ఫణీంద్ర, గజేంద్ర, ఉపేంద్ర అనే నలుగురు తమ్ముళ్ళు ఉంటారు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగుట్టుకున్న ఆ అన్నాతమ్ముళ్ళు పంచపాండవులుగా ఎదుగుతారు. ఈ ఐదుగురు పంచ పాండవులను సపోర్ట్ చేయడానికి లాయర్ అయిన బెయిల్ పెంచలయ్య సపోర్ట్ గా ఉంటాడు. వీరేంద్ర పెళ్ళి చేసుకుంటే వచ్చే అమ్మాయి తన అన్నదమ్ములను విడగొడుతుందని భావించి పెళ్ళి చేసుకోకుంటా ఉంటాడు. కానీ తన తమ్ముళ్ళు మాత్రం ప్రేమలో ఉంటారు. వారి పెళ్ళి జరగాలంటే తన అన్న పెళ్ళి జరగాలని ఆలోచించి వీరేంద్ర చిన్నప్పుడు గోమతిదేవి అనే అమ్మాయిని ప్రేమించాడని తెలుసుకుంటారు. కాని వెళ్ళి చూస్తే ఆమెకి పెళ్ళైపోయింది. తిరిగొచ్చాక ఆ ఊరికి వచ్చిన గోమతిదేవి (తమన్నా)తో తన అన్న ప్రేమలో పడేలా ప్లాన్ చేస్తారు. చివరికి వారనుకున్నట్టుగానే వీరేంద్ర – గోమతిదేవి ప్రేమలో పడతారు. గొడవలంటే అస్సలు ఇష్టంలేని గోమతిదేవి తండ్రిని ఒప్పించడానికి గొడవలన్నీ వదిలేసి వెళ్ళే సమయంలో వీరేంద్రకి నాగరాజు (అతుల్ కులకర్ణి) గోమతిదేవి ఫ్యామిలీని చంపాలని ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది. అసలు నాగరాజు ఎవరు? గోమతి దేవి ఫ్యామిలీని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? ఈ విషయం తెలిసిన వీరేంద్ర ఏం చేసాడు? వీరేంద్ర – గోమతి దేవి చివరికి కలిసారా? లేదా? అనేది మిగిలిన కథ.

సంగీతం

[మార్చు]

దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం 2014 మార్చి 19న హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, కె.వి.వి. సత్యనారాయణ, జె.కె.భారవి, మల్టీడైమన్షన్ వాసు, శివనాగేశ్వరరావు, ప్రసన్నకుమార్, మారుతి తదితరులు హాజరయ్యారు.[2]

  • మంచివాణ్ణి - మనో
  • జింగుచక - మాలతి, ప్రభాకర్
  • కళ్ళు కళ్ళు - శ్రావ్య, రాము
  • మాట తట్టదు - ఎం.ఎల్.ఆర్. కార్తికేయన్, గోపికా పూర్ణిమ
  • రథ గజతురగ - ఎం.ఎల్.ఆర్. కార్తికేయన్, రాము

విమర్శకుల స్పందన

[మార్చు]

వీరుడొక్కడే సినిమా విమర్శకుల నుంచి దాదాపు సానుకూల స్పందనను రాబట్టింది. 123 తెలుగు.కామ్ తమ సమీక్షలో "‘వీరుడొక్కడే’ సినిమా చూసినంతసేపు అజిత్ ఒక్కడే వీరుడు అనే ఫీలింగ్ కలుగుతుంది. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ అయిన ఈ సినిమా కామెడీ, మాస్ మసాలా ఆశించే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అజిత్ పెర్ఫార్మన్స్, కామెడీ, ఆకట్టుకునే యాక్షన్ ఎపిసోడ్స్, నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రధాన హైలైట్ అయితే ఊహాజనితంగా సాగే స్క్రీన్ ప్లే, పాటలు, కొన్ని బోరింగ్ సీన్స్ సినిమాకి మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా వీరుడొక్కడే సినిమాని అజిత్ ఫాన్స్, రెగ్యులర్ ఎంటర్టైనర్స్ కోరుకునే వారు బాగా ఎంజాయ్ చేస్తారు" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3/5 రేటింగ్ ఇచ్చారు.[3] సాక్షి తమ సమీక్షలో "సంతానంపై చిత్రీకరించిన కామెడీ సీన్లలో డైలాగ్స్ బ్రహ్మండంగా పేలాయి. తమిళంలో ‘వీరం’ పేరుతో విడుదలై.. ఘన విజయాన్ని సాధించిన వీరుడొక్కడే చిత్రం తెలుగు ప్రేక్షకులకు రొటీన్ చిత్రమనే చెప్పవచ్చు. పగ, ప్రతీకారం, ఫ్యాక్షన్ అంశాలే ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే" అని వ్యాఖ్యానించారు.[4] వెబ్ దునియా తమ సమీక్షలో "పూర్తి మాస్ కథకు కామెడీ, సెంటిమెంట్, లవ్, యాక్షన్ అన్నింటిని కలిపి ఫ్యామిలీ డ్రామాగా దర్శకుడు తెరకెక్కించాడు. గత సినిమాల కంటే అజిత్ మేకప్ లేకుండా పంచెలో అభిమానులను ఆకట్టుకున్నాడు. నటనా పరంగా సినిమాకు హైలైట్‌గా నిలిచాడు. ఇంకా తమన్నాతో లవ్, సెంటిమెంట్, కామెడీ బాగా పండించాడు. మొత్తానికి తెలుగు ప్రేక్షకులకు అజిత్ సమ్మర్‌లో కొంచెం వినోదాన్ని పంచనున్నాడు" అని వ్యాఖ్యానించారు.[5] తుపాకి.కామ్ తమ సమీక్షలో "తెలుగు సినిమాలాగే ఉండటం 'వీరుడొక్కడే'కు ప్లస్ మాత్రమే కాదు మైనస్ కూడా. తమిళ సినిమా అంటే కాస్త వైవిధ్యంగా ఉంటుందని ఈ సినిమాకెళ్తే నిరాశ తప్పదు. ఇక్కడ కూడా తెలుగు సినిమా చూపించారేంటి అనిపిస్తుంది. ఒక పక్కా మాస్ మసాలా సినిమా చూడాలంటే 'వీరుడొక్కడే'పై ఓ లుక్కెయ్యచ్చు. వైవిధ్యం కోరుకుంటే మాత్రం దూరంగా ఉండటం మేలు" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 2.5/5 రేటింగ్ ఇచ్చారు.[3] ఏపీహెరాల్డ్.కామ్ తమ సమీక్షలో "కొన్ని చిత్రాలు స్టార్ పవర్ మీదనే ఆధారపడి వస్తుంటాయి. ఈ చిత్రం సరిగ్గా అలాంటిదే కానీ స్టార్ పవర్ కి కాస్త మంచి కాన్సెప్ట్ తోడయితే అగ్గికి గాలి తోడయినట్టే, ఈ చిత్రంలో అదే మిస్ అయ్యింది. అజిత్ స్టార్ పవర్ నీడలో మరే నటుడు నిలబడలేకపోయినా సంతానం, తంబి రామయ్య తనదయిన శైలిలో కాస్త మెరిసారు. మొత్తానికి మాస్ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైనర్ ఈ చిత్రం.. మీరు అజిత్ ఫ్యాన్ అయినా మాస్ చిత్రాలను ఇష్టపడే వారయినా ఈ చిత్రం మీకోసమే" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 2/5 రేటింగ్ ఇచ్చారు.[6] టాలీవుడ్.నెట్ తమ సమీక్షలో "తెలుగులో గోపీచంద్ తో శౌర్యం వంటి హిట్ కొట్టిన శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళం లో సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించింది. కథ పాత చింతకాయ పచ్చడి అయినప్పటికీ కథనం లో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మాస్ కు నచ్చే అవకాశం ఉంది. పూర్తి గా మాస్ మసాలాతో నింపేసిన ఈ చిత్రం రొటీన్ అయినప్పటికీ మ ... మ ... మాస్ కు నచ్చుతుంది . ఐతే మాస్ కు నచ్చడమే ప్రామాణికం అనుకుంటే శివ హిట్ కొట్టినట్లే కానీ కథ కూడా ముఖ్యం అనుకుంటే ఫట్ అన్నట్లే" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3/5 రేటింగ్ ఇచ్చారు.[7] 10టివి.కామ్ తమ సమీక్షలో "తెలుగు సినిమాలాగే ఉండటం 'వీరుడొక్కడే'కు ప్లస్ మాత్రమే కాదు మైనస్ కూడా. తమిళ సినిమా అంటే కాస్త వైవిధ్యంగా ఉంటుందని ఈ సినిమాకెళ్తే నిరాశ తప్పదు. ఇక్కడ కూడా తెలుగు సినిమా చూపించారేంటి అనిపిస్తుంది. ఒక పక్కా మాస్ మసాలా సినిమా చూడాలంటే 'వీరుడొక్కడే'పై ఓ లుక్కెయ్యచ్చు. వైవిధ్యం కోరుకుంటే మాత్రం దూరంగా ఉండటం మేలు" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 2.5/5 రేటింగ్ ఇచ్చారు.[8]

మూలాలు

[మార్చు]
  1. "అజిత్ "వీరుడొక్కడే" విడుదల తేదీ ఖరారు". వన్ఇండియా. March 12, 2014. Retrieved March 21, 2014.[permanent dead link]
  2. ""వీరుడొక్కడే" ఆడియో విడుదల". ఆంధ్రజ్యోతి. March 19, 2014. Archived from the original on 2014-03-23. Retrieved March 21, 2014.
  3. 3.0 3.1 "సమీక్ష : వీరుడొక్కడే – అజిత్ మాస్ ఎంటర్టైనర్". 123తెలుగు.కామ్. March 21, 2014. Archived from the original on 2014-03-22. Retrieved March 22, 2014.
  4. "సినిమా రివ్యూ: వీరుడొక్కడే". సాక్షి. March 21, 2014. Archived from the original on 2014-03-21. Retrieved March 22, 2014.
  5. "వీరుడొక్కడే మూవీ రివ్యూ రిపోర్ట్!". వెబ్ దునియా. March 21, 2014. Archived from the original on 2014-03-25. Retrieved March 22, 2014.
  6. "వీరుడొక్కడే : రివ్యూ". ఏపీహెరాల్డ్.కామ్. March 21, 2014. Archived from the original on 2014-03-21. Retrieved March 22, 2014.
  7. "వీరుడొక్కడే రివ్యూ". టాలీవుడ్.నెట్. March 21, 2014. Archived from the original on 2014-03-24. Retrieved March 22, 2014.
  8. "'వీరుడొక్కడే' సినిమా: రివ్యూ". 10టివి.కామ్. March 21, 2014. Archived from the original on 2014-03-22. Retrieved March 22, 2014.