వీరేంద్ర జగ్తాప్
వీరేంద్ర వాల్మిక్ రావు జగ్తాప్ | |||
పదవీ కాలం 2009 – 2019 | |||
తరువాత | ప్రతాప్ అద్సాద్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | ధమన్‌గావ్ రైల్వే | ||
పదవీ కాలం (2004 – 2009) | |||
ముందు | అరుణ్ అద్సాద్ | ||
నియోజకవర్గం | చందూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | వార్ధా, మహారాష్ట్ర , భారతదేశం | 1963 ఆగస్టు 11||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | ఉత్తర వి. జగ్తాప్ | ||
సంతానం | పరీక్షిత్ వి. జగ్తాప్ | ||
నివాసం | చందూర్, మహారాష్ట్ర , భారతదేశం | ||
వెబ్‌సైటు | http://virendrajagtap.in/ |
వీరేంద్ర వాల్మిక్ జగ్తాప్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు చందూర్, ధమన్‌గావ్ రైల్వే శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]వీరేంద్ర జగ్తాప్ 1963 ఆగస్టు 11న మహారాష్ట్రలోని వార్ధాలో ప్రొఫెసర్ వాల్మిక్రావ్ జగ్తాప్, డాక్టర్ సుల్భా జగ్తాప్ దంపతులకు జన్మించాడు. ఆయన 1984లో వార్ధాలోని జి.ఎస్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి బి.కామ్, 1986లో నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి కామర్స్‌లో మాస్టర్స్ (ఎం.కామ్) పూర్తి చేసి, నాగ్‌పూర్ విశ్వవిద్యాలయంలో 1వ ర్యాంక్‌ని పొంది బంగారు పతకాన్ని అందుకొని 1989లో ఎంఫిల్ పూర్తి చేసి 1989 నుండి సైన్స్, ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజ్ ప్రొఫెసర్‌గా పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]వీరేంద్ర జగ్తాప్ ఎన్‌ఎస్‌యూఐ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి వార్ధా జిల్లా ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా, 1988 నుండి 1992 వరకు మహారాష్ట్ర ఎన్‌ఎస్‌యూఐ ప్రధాన కార్యదర్శిగా, 1992లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ మహారాష్ట్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 1995 నుండి 1998 వరకు ఉపాధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 1995, 1999 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో చండూర్ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.
వీరేంద్ర జగ్తాప్ 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో చండూర్ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత చండూర్ నియోజకవర్గం రదై ధమన్‌గావ్ రైల్వే నియోజకవర్గం ఏర్పాటు కావడంతో 2009,[1] 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై[2][3] 2019, 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఓడిపోయాడు.[4]
నిర్వహించిన పదవులు
[మార్చు]- 2004-2019: చందూర్ & ధమన్‌గావ్ రైల్వే నియోజకవర్గాలకు నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక
- 2006-2011: అమరావతి జిల్లా (రూరల్) కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
- 2011-2020: అమరావతి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్
- 2009-2012: అధ్యక్షుడు, మహారాష్ట్ర లెజిస్లేచర్ కమిటీ ఆన్ ఉపాధి హామీ పథకం
- 1995-1998: మహారాష్ట్ర స్టేట్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు
- 1992-1995: మహారాష్ట్ర స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
- 1988-1992: మహారాష్ట్ర స్టేట్ ఎన్‌ఎస్‌యూఐ ప్రధాన కార్యదర్శి
- 1986-1988: వార్ధా జిల్లా ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు
మూలాలు
[మార్చు]- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 3 September 2010.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ The Indian Express (23 November 2024). "Dhamangaon Railway (Maharashtra) Assembly Election Results" (in ఇంగ్లీష్). Archived from the original on 4 December 2024. Retrieved 4 December 2024.
- ↑ Election Commission of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Dhamangaon Railway". Archived from the original on 3 December 2024. Retrieved 3 December 2024.