Jump to content

వున్నం చెంచయ్య

వికీపీడియా నుండి

వున్నం చెంచయ్య కవి, సాహితీ కారుడు. విరసం సభ్యుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

వున్నం చెంచయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని కొండాపురం మండలానికి చెందిన సాయిపేట గ్రామంలో సాయమ్మ, రోశయ్య దంపతులకు 1950 జూలై 10న జన్మించాడు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు అంశంపై ఎం ఏ చదివి, 1974 లో కావలి జవహర్ భారతి కళాశాలలో తెలుగు అధ్యాపకుడుగా చేరి, 2008 లో పదవీవిరమణ చేశాడు. [1]

రచనా ప్రస్థానం

[మార్చు]

కవిగా రచనాజీవితం ఆరంభించినా , సాహిత్య విమర్శకుడుగా పేరుతెచ్చుకొన్నాడు. 1975 లో అనంతపురంలో జరిగిన విప్లవ రచయితల సంఘం (విరసం) సభలలో విరసం సభ్యత్వం తీసుకొన్నాడు. 1988 జనవరిలో ఒంగోలులో జరిగిన విరసం సభలలో ఆ సంస్థ కార్యదర్శి అయి, అరుణతార సాంస్కృతిక సాహిత్య పత్రిక సంపాదక బాధ్యత తీసుకొని ,1994 విరసం కార్యదర్శి బాధ్యతలనుంచి వైదొలగినా, అరుణతార సంపాదకుడుగా 1998 జనవరి వరకు కొనసాగాడు. మరల 2006 నుంచి 2008 వరకు విరసం కార్యదర్శి బాధ్యత నిర్వర్తించాడు. ఇప్పుడు కూడా విరసం సభ్యడుగా కొనసాగుతున్నాడు.

రచనలు

[మార్చు]
  1. సాహిత్య దృక్పథం,
  2. వ్యాసరచనా శిల్పం,
  3. మహాప్రస్థానం నుండి మరోప్రస్థానం దాకా,
  4. తెలుగు సాహిత్యంలో భక్తిఉద్యమం,
  5. వివేచన,
  6. సామాజికం,
  7. కలంయోధుడు చెరబండరాజు,
  8. తెలుగు భాష- కొన్ని సంగతులు.
  9. ఒక వెంటాడే జ్ఙాపకం ,
  10. సాహిత్యంలో వాస్తు రూప శిల్పాలు,
  11. గతి తార్కిక భౌతిక వాదం,
  12. చరిత్రలో కుసుమ ధర్మన్న,
  13. సాహిత్య లేఖలు.

ఇంకా పుస్తకరూపంలో రాని వంద దాకా వ్యాసాలు, సమీక్షలు, ముందుమాటలు, ఉన్నాయి.

అరెస్టు

[మార్చు]

చెంచయ్యను ఔరంగాబాదులో 2005 జూన్ 30వ తారీకున మరి ముగ్గురు విరసం సభ్యలతో పాటుగా పోలీసులు అరెస్టు చేసి నిజామాబడి జైల్లో 20రోజులు ఉంచిన తర్వాత బెయిల్ మీద విడుదలైయ్యాడు. పోలీసులు పెట్టిన కుట్రకేసు అయిదు సంవత్సరాలు కొనసాగినతర్వాత న్యాయాధిపతి కేసు కొట్టివేశాడు.

మూలాలు

[మార్చు]
  1. అరుణతార సంపుటాలు, చెంచయ్య రచనలు, వ్యాసాలు, తెలుగు, ఇంగ్లీషు పత్రికల రిపోర్టులు, విరసం కరపత్రాలు, విరసం ప్రచురణలు.,