వెంపటి సూర్యనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డాక్టర్ వెంపటి సూర్యనారాయణ (జూలై 14, 1904 - ఆగస్టు 24, 1993) ప్రజావైద్యుడు, గాంధేయవాది.

వినోబాభావే సర్వోదయ సిద్ధాంతాన్ని ఆచరణలోకి తీసుకుని శ్రీ సుదర్శన్ రావు, తో(మరొక సర్వోదయ నాయకుడు) కలసిరెండు లక్షల కంటి శస్త్రచికత్సలు, ఉచిత వైద్యసేవ చేశాడు. తెనాలి మున్సిఫ్ కోర్టులో హెడ్‌ గుమస్తా వెంపటి హనుమంతరావు, అన్నపూర్ణమ్మ దంపతులకు 1904 జూలై 14న జన్మించాడు సూర్యనారాయణ. ఉన్నత పాఠశాల విద్య పూర్తిచేసుకుని 1921లో రాయపురం మెడికల్ స్కూలులో చేరాడు. 1925 లో ఎల్‌.ఎం.పీ. ఉత్తీర్ణుడయ్యాక చెన్నైలోని ఎగ్మూరు కంటి ఆసుపత్రిలో హౌస్‌ సర్జన్‌ చేశాడు. 1926 సెప్టెంబరులో తెనాలిలో ప్రాక్టీసు ప్రారంభించాడు. భార్య అంగీకారంతో బ్రహ్మచర్య వ్రతం చేపట్టాడు. 1936లో ‘శ్రీకృష్ణా కన్ను ఆసుపత్రి’ ఆరంభించాడు. భార్య మెడలో ఆభరణాలు అమ్మి, పాత కారు కొనుగోలు చేసి తగిన పరికరాలను సమకూర్చుకున్నాడు. గ్రామగ్రామాన మొబైల్ నేత్రవైద్యం చేశాడు. ఆర్థికంగా దెబ్బతిన్నాడు. కారు అమ్మి బాకీ తీర్చాడు. వినోబాజీని కలిసి ఆయన సలహాతో వైద్యపరీక్షకు కేవలం రూపాయి ఫీజు అన్నాడు. మూడేళ్ల వరకు ఎన్నిసార్లయినా పరీక్ష చేయించుకోవచ్చు. ఆపరేషను రూ. 10 మాత్రమే . అంతకుమించి ఎవరయినా ఇస్తే ఆ మొత్తాన్ని ‘ధర్మనిధి’ కి చేర్చి ప్రజాసేవ కు వినియోగించేవాడు. వారంలో ఆరు రోజులు కంటి ఆపరేషన్లు చేసేవాడు. 1963 నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నేత్ర వైద్య ఆపరేషన్ల నిర్వహణకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటుచేశాడు. వినోబాజీ ప్రేరణతో వినయాశ్రమం లో, హైదరాబాదు లో బ్రాంచిలు ప్రారంభించాడు. 1993 ఆగస్టు 24 న కన్నుమూశాడు.విశేషాలు

[మార్చు]

మాడ కాసపడిన మా డాక్టరు తెనాలి

వాడ కొక్కమేడ వైచుగాని
మాడ కాసపడక మహినెల్ల మేడలు
కట్టె నితడు కీర్తికాంత లలర ----------- తెనుగులెంక తుమ్మల సీతారామమూర్తి
  • గాంధీజీ తాను నడుపుతున్న ‘హరిజన’ పత్రికలో డాక్టర్ల నుద్దేశిస్తూ, ‘మీరు మీ తప్పులను ఒప్పుకొనే ధైర్యం కలిగి ఉండాలి’ అని వ్రాశాడు. దీనిని చదివిన డాక్టర్ సూర్యనారాయణ, తానొక రోగి విషయుంలో చేసిన చిన్న తప్పిదం ఒప్పుకొంటూ, అతడి నుంచి ఎక్కువ తీసుకున్న రూ. 8 ను తిరిగి ఆ రోగికే పంపాడు. డాక్టరు చలవతో స్వస్థత చేకూరిన ఆ రోగి, గౌరవ పూర్వకంగా ఆ డబ్బును తిరస్కరించి, తిరిగి డాక్టరు గారికే పంపాడు. డాక్టరుగారు ఈ విషయాన్ని తెలియజేస్తూ, రోగి దగ్గర అదనంగా తీసుకున్న డబ్బును సద్వినియోగం చేయుడని గాంధీజీకి పంపాడు. అందుకు ఆయన్నుంచి సంతోషం వ్యక్తం చేస్తూ తిరుగు జవాబు వచ్చింది.