వెడ్మ రాము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెడ్మ రాము
జననంజూలై, 1914
మరణంఅక్టోబరు 26, 1987
ఇతర పేర్లువెడ్మ రాము
ప్రసిద్ధిగిరిజన ఉద్యమ నాయకుడు.
మతంహిందూ
భార్య / భర్తఆత్రం ముత్తుబాయి
తండ్రిమెంగు
తల్లిజంగూ భాయి

వెడ్మ రాము (జూలై, 1914అక్టోబరు 26, 1987) గిరిజన ఉద్యమ నాయకుడు. నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఆదివాసీ గిరిజన ఉద్యమాన్ని నడిపిన కొమురం భీమ్ ప్రధాన అనుచరుడు.

జననం

[మార్చు]

వెడ్మ రాము 1914, జూలై నెల గోండు జాతికి ఆశ్రిత కులమైన బిరుదు గోండు (తోటి) కులానికి చెందిన వెడ్మ మెంగు, జంగూ భాయి దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించాడు. ఈయన జన్మస్థానం ఆదిలాబాద్ జిల్లా లోని లక్షెట్టిపేట దగ్గరి కాశీపేట మండలంలో ఉన్న మల్కపల్లి గ్రామం. 16వ ఏట ఆత్రం ముత్తుబాయిని పెళ్లి చేసుకున్నాడు,.[1]

ఉద్యమ జీవితం

[మార్చు]

జోడేఘాట్ భూ పోరాటంలో నిజాం పాలకులపై కొమురం భీమ్ తో కలిసి ఉద్యమాన్ని నడిపిన రాము, తన ఆటాపాటలతో చుట్టుప్రక్కల ఉన్న పన్నెండు గ్రామాలలోని గిరిజనులను చైతన్యవంతం చేశాడు.[2] వెడ్మ రాముతోపాటు కొమురం సూరు కూడా పోరాటంలో పాల్గొన్నాడు.[3]

ఇతర వివరాలు

[మార్చు]
  1. గిన్నెధరి రాయ్‌సెంటర్‌లో గోండు పెద్దల సమక్షంలో కుమ్రం భీము చరిత్రను, గోండుల రాచరిక చరిత్రను, సాంస్కృతిక-మత విశ్వాసాల విశిష్టతలను తెలియజేశాడు.

మరణం

[మార్చు]

వెడ్మ రాము 1987, అక్టోబరు 26న మరణించాడు. ప్రతి సంవత్సరం రాము జయంతి రోజున ఏదుల్‌పాడ్ లో వర్ధంతి నిర్వహించబడుతుంది.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ, ఎడిటోరియల్ (26 October 2016). "కుమ్రం భీము మెచ్చిన రాము". www.ntnews.com. డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ. Archived from the original on 7 November 2019. Retrieved 7 November 2019.
  2. నమస్తే తెలంగాణ, కొమురం భీం జిల్లా (26 October 2019). "వెడ్మ రాము సేవలు మరువలేనివి". www.ntnews.com. Archived from the original on 7 November 2019. Retrieved 7 November 2019.
  3. ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్ (5 November 2016). "జోడేఘాట్‌ వీరుడు కుమ్రం సూరు". www.andhrajyothy.com. గుమ్మడి లక్ష్మీనారాయణ. Archived from the original on 8 November 2016. Retrieved 8 November 2019.