వెన్నెల్లో ఆడపిల్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెన్నెల్లో ఆడపిల్ల
వెన్నెల్లో ఆడపిల్ల
కృతికర్త: యండమూరి వీరేంద్రనాథ్
భాష: తెలుగు
ప్రచురణ:
విడుదల:


వెన్నెల్లో ఆడపిల్ల యండమూరి వీరేంద్రనాథ్ రచించిన ఒక ప్రముఖ నవల. అత్యద్భుతంగా సాగే నవల ఇది.ఒక అందమైన భావాన్ని మది నిండా నింపే రసభరిత నవల. క్లుప్తంగా

తన ఫోన్ నెంబర్ కనుక్కోవడానికి ఆమె ఇచ్చిన నెల రోజుల గడువు పుర్తవడానికి సరిగ్గా 118 నిముషాలు మాత్రమే ఉంది. విమానం బయల్దేరటానికి రన్ వే మీద సిద్ధంగా ఉంది. అప్పుడొచ్చింది అతనికి ప్లాష్ లాంటి ఆలోచన.

ఫలితం...?కదుల్తున్న విమానం ఆగిపోయింది. అతడికోసం మైక్ లో ప్రకటనల మీద ప్రకటనలు వినివస్తున్నాయి. అతడు మాత్రం తాపీగా ఫోన్ చేస్తున్నాడు.


మొత్తం టెలిఫోన్ డిపార్టుమెంటంతా వలవేయబడింది. చివరి క్షణంలోనైనా ఆమె (నెంబరు) అతడికి దొరికిందా? ఆక్స్ ఫర్ట్ అమ్మాయికి చదరంగం ఛాంపియన్ కి జరిగిన నాజూకు పోరాటం - చిరు చిరు లెక్కల గిమ్మిక్కుల నుంచి పైథాగరస్ సిద్ధాంతం వరకూ..టెలిఫోన్ డిపార్టుమెంట్ తీరు తెన్నుల బ్యాక్ డ్రాప్ తో....క్షణక్షణం మిమ్మల్ని సన్నెన్స్ లో పెట్టి, పూర్తయ్యాక ఒక మధుర భావాల్ని మీ మనసులో కలకాలం నిలబెట్టే నవల.

ఈ నవల ఆధారంగానే శ్రీకాంత్, సాధిక హీరో హీరోయిన్లుగా హలో ఐ లవ్ యూ (1997) అనే సినిమా తెరకెక్కించారు.