విజయానికి అయిదు మెట్లు
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. (April 2015) |
విజయానికి అయిదు మెట్లు. | |
![]() | |
విజయానికి అయిదు మెట్లు పుస్తక ముఖచిత్రం | |
కృతికర్త: | యండమూరి వీరేంద్రనాథ్ |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | మనో విజ్ఞాన గ్రంథం |
ప్రచురణ: | నవసాహితీ బుక్ హౌస్, ఏలూరు రోడ్, రామమందిరం వద్ద, విజయవాడ |
విడుదల: | జూన్-1995 |
పేజీలు: | 453 |
విజయానికి అయిదు మెట్లు (vijayaaniki ayidu metlu) అనేది ఆధునిక తెలుగు నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ వ్రాసిన ఒక పుస్తకం. ఇందులో వ్యక్తిత్వ వికాసం, మనో విజ్ఞానంకు సంబంధించిన విషయాలున్నాయి.
మనో విజ్ఞానానికి సంబంధించిన రచనలు తెలుగులో చాలా తక్కువ. ఉన్నవి కూడా ఏ స్కూలు విద్యార్థులకో లేదా కాలేజీ విద్యార్థులకో ఉద్దేశించబడిన పాఠ్యగ్రంథాలలా ఉంటాయి తప్ప మామూలు పాఠకులందరూ చదివి అర్ధం చేసుకోవడానికి వీలయే సరళ భాషలో ఉండవు. ఆ లోటును పూడుస్తూ మానవ మనస్తత్వంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ చదవగలిగే విధంగా వ్రాయబడిన పుస్తకం. మొదటి ప్రచురణ నుండి ప్రతి సంవత్సరం వరుసగా ముద్రింప బడుతూ ఇరవై సార్లు ముద్రింపబడి అత్యధికంగా అమ్మబడిన పుస్తకం. {సేకరణ-ఈనాడు.ఆంధ్రజ్యోతి.ఇండియా టుడే లాంటి పత్రికల అభిప్రాయాలనుండి}
పుస్తకంలో ఐదు మెట్లు[మార్చు]
- 1. గెలుపుకు పునాది ఓటమి
- జీవితం ఒక యుద్ధం -- బలహీనతలు, ఆత్మన్యూనత, టెన్షన్, కోపం, భయం, ఆందోళన, విసుగు, అనుమానం, అశాంతి, దిగులు, బోర్, అభద్రతాభావం, వ్యసనం, ఒంటరితనం.
- 2. మేరే ది--117.216.209.65 09
- 00, 2013 మే 31 (UTC) --117.216.209.65 09:00, 2013 మే 31 (UTC) బెస్ట్
- మానవ సంబంధాలు -- అవసరం, అభిరుచి, ఐడెంటిటీ క్రైసిస్, ఆకర్షణ, కమ్యూనికేషన్, ఆధారపడటం, మొహమటం, శాడిజం, అసూయ, కసి, స్వార్ధం, నిస్వార్ధమ్, నిర్మాణాత్మక స్వార్ధం, స్వేచ్ఛ.
- 3. గెలుపు వైపు మలుపు
- మన ఆయుధాలు -- కామన్ సెన్స్, పాజిటివ్ ధింకింగ్, ఏకాగ్రత, స్థాయి సామర్థ్యం, పగటి కలలు, నాయకత్వలక్షణాలు, ప్రేరణ, అంతర్ముఖాలోచనం, భాష సంభాషణ, తప్పులను ఒప్పుకోవడం, గొప్పతనం గుర్తించడం, ఆత్మావగాహన, తర్కం, దృక్పథం, టైమ్ మానేజ్ మెంట్, అన్వేషణ, మానసిక వ్యాయామం, జ్ఞాపక శక్తి, వయసు, అందం, ఆరోగ్యం, రొమాన్స్, రిలాక్సేషన్, పరిణతి, రిస్క్, నిర్వహణ, అంకితభావం.
- 4. డబ్బు సంపాదన
- డబ్బు ఎలా సంపాదించాలి -- ప్రో ఆక్టివ్ థింకింగ్, డబ్బు ఎందుకు సంపాదించాలి, కౌటిల్యుని అర్థశాస్త్రం, డబ్బు నిర్వహణ, ఆలోచన.
- 5. అంతిమ విజయం
- వైకుంఠ పాళి -- ఓటమి, అస్పష్ట విజయం, నిరర్ధక విజయం, సంపూర్ణ విజయం, ప్రేమ, శాంతి, సంతృప్తి.
కొన్ని విశేషాలు[మార్చు]
- విజయానికి ఐదు మెట్లు పుస్తకం మార్కెట్ లో రిలీజయిన నెలరోజులలో మొదటి ప్రచురణ పూర్తిగా అమ్ముడయి రికార్డు సృష్టించింది.
- ఎలక్ట్రానిక్ రంగపు ఉధృతానికి దాదాపు పాపులర్ నవలా రచయితలందరూ అస్త్ర సన్యాసం చేస్తున్న ఈ రోజులలో ఒక ప్రాంతీయ భాషలో మానసిక విశ్లేషణ పై వ్రాసిన పుస్తకం వరుసగా ఇరవైసార్లు ముద్రితమయ్యేంతగా విజయవంతమవడం ఒక రికార్డు.
- ఈ పుస్తకంపై ప్రచురణ కర్తకూ రచయితకూ కలసి లక్షకు పైగా ఉత్తరాలు వచ్చాయి.
- ఈ పుస్తకం ప్రచురించిన తరువాత నవసాహితి అధినేత కొండపల్లి ప్రకాశరావుకి 1996 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక ప్రచురణ కర్తగా అఖిలభారత ప్రచురణల సమాఖ్య ఢిల్లీ వారిచే అవార్డు లభించింది.
ఇవికూడా చూడండి[మార్చు]
బయటి లింకులు[మార్చు]
మూలాలు[మార్చు]