Jump to content

వెల్లంపల్లి (త్రిపురాంతకం)

అక్షాంశ రేఖాంశాలు: 15°56′36.348″N 79°25′20.424″E / 15.94343000°N 79.42234000°E / 15.94343000; 79.42234000
వికీపీడియా నుండి
వెల్లంపల్లి (త్రిపురాంతకం)
గ్రామం
పటం
వెల్లంపల్లి (త్రిపురాంతకం) is located in ఆంధ్రప్రదేశ్
వెల్లంపల్లి (త్రిపురాంతకం)
వెల్లంపల్లి (త్రిపురాంతకం)
అక్షాంశ రేఖాంశాలు: 15°56′36.348″N 79°25′20.424″E / 15.94343000°N 79.42234000°E / 15.94343000; 79.42234000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంత్రిపురాంతకం
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( 08403 Edit this on Wikidata )
పిన్‌కోడ్523326


వెల్లంపల్లి, ప్రకాశం జిల్లా లోని త్రిపురాంతకం మండలం లోని ఒక రెవెన్యూయేతర గ్రామం.ఈ గ్రామం గుండ్లకమ్మ నది ఒడ్డున ఉంది.

గ్రామ చరిత్ర

[మార్చు]

ఈ గ్రామ సమీపంలోని గుండ్లకమ్మ నదిలో, 2016,నవంబరు-24న, రెండు బౌద్ధం ఆనవాళ్ళు కలిగిన పాలరాతి స్థూపాలు బయల్పడినవి. సమీపంలోనే చందవరం బౌద్ధారామం ఉండుట వలన, ఈ రెండు పాలరాతి స్థూపాలూ బౌద్ధులు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు వెలిసి ఉంటాయని భావించుచున్నారు.

సమీప గ్రామాలు

[మార్చు]

గొల్లపల్లి 6 కి.మీ, చందవరం 7 కి.మీ, లేళ్లపల్లి 7 కి.మీ, కల్లూరు 7 కి.మీ, దూపాడు 7 కి.మీ.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

ఈ గ్రామ సమీపంలో గుండ్లకమ్మ నదిమీద ఒక వంతెన నిర్మాణానికై 2007,మార్చి-18వ తేదీనాడు శంకుస్థాపన నిర్వహించారు. వంతెన నిర్మాణం ఇంతవరకు పూర్తికాలేదు. స్తంభాలు నిర్మించి నిర్మాణం ఆపివేసినారు. ఈ వంతెన నిర్మాణం పూర్తి అయితే యర్రగొండపాలెం నుండి హైదరాబాదు వెళ్ళుటకు 50 కి.మీ.దూరం తగ్గుతుంది. తాళ్ళూరు తదితర మండలాల ప్రజలు, కర్నూలు, శ్రీశైలం, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం మొదలగు ప్రాంతాలకు వచ్చేటందుకు మార్గం సుగమం అగుటయేగాక, దూరం గూడా తగ్గుతుంది. ఇంకా, యర్రగొండపాలెం, దర్శి, మార్కాపురం నియోజకవర్గాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగవుతవి. [2]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ సీతారామస్వామివారి ఆలయం:- ఈ నూతన ఆలయాన్ని గ్రామస్తులంతా కలిసి ఒక్కటై, చందాలు వేసుకొని భక్తిశ్రద్ధలతో నిర్మించుచున్నారు. సిమెంటు, ఇసుక వాడకుండా మొత్తం రాతితోనే ఆలయ నిర్మాణం చేస్తున్నారు. ఆర్థిక స్తోమతును బట్టి, ఉన్న కొద్దిపాటి స్థలంలోనే అందమైన ఆలయాన్ని నిర్మించుచున్నారు. ప్రాథమిక అంచానానుబట్టి మొత్తం 50 లక్షలదాకా వ్యయం అవుతుందని అంటున్నారు.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు

[మార్చు]


వెలుపలి లింకులు

[మార్చు]