వెల్లస్వామి వనిత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెల్లస్వామి వనిత
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
వెల్లస్వామి వనిత
పుట్టిన తేదీ (1990-07-19) 1990 జూలై 19 (వయసు 33)
బెంగళూరు, కర్ణాటక
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబ్యాటింగ్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 111)2014 జనవరి 23 - శ్రీలంక తో
చివరి వన్‌డే2014 నవంబరు 28 - దక్షిణాఫ్రికా తో
తొలి T20I (క్యాప్ 44)2014 జనవరి 25 - శ్రీలంక తో
చివరి T20I2016 నవంబరు 22 - వెస్టిండీస్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2006/07–2020/21కర్ణాటక
2021/22బెంగాల్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్డే ట్వంటీ20
మ్యాచ్‌లు 16 6
చేసిన పరుగులు 216 85
బ్యాటింగు సగటు 14.40 17.00
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 41 27
క్యాచ్‌లు/స్టంపింగులు 5/– 1/–
మూలం: Cricinfo, 20 ఏప్రిల్ 2020

వెల్లస్వామి రమా వనిత, కర్ణాటకకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారిణి.[1] కర్ణాటక జట్టుకు ఓపెనింగ్ బ్యాటర్‌గా ఆడింది. 2014 జనవరిలో శ్రీలంకతో జరిగినమహిళల వన్డే ఇంటర్నేషనల్, మహిళల ట్వంటీ 20 ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది.[2][3] 2022 ఫిబ్రవరిలో అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్ అయ్యింది.[4]

వ్యక్తిగత జీవితం[మార్చు]

వనిత 1990, జూలై 19న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. ఇద్దరు సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నారు. ఆమె కెరీర్ ఎంపికకు కుటుంబం చాలా సహకరించింది. కోచింగ్ క్యాంపులో అబ్బాయిలతో శిక్షణ పొందింది.[5][6] 11 ఏళ్ళ వయసులో తండ్రి ఆమెను కర్ణాటక ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రికెట్‌కు తీసుకెళ్ళాడు. చిన్నతనంలో తన తండ్రి, సోదరుడితో కలిసి తరచుగా గల్లీ క్రికెట్ ఆడేది, ఇది ఆమె జీవితంలో ప్రారంభదశలో క్రికెట్ పై ఆసక్తి కలగడానికి బలమైన పునాది వేయడంలో సహాయపడింది.[7]

వనిత బెంగుళూరులోని సెవెంత్ డే అడ్వెంటిస్ట్‌లో చదువుకుంది. తరువాత, సిఎంఆర్ లా స్కూల్‌తోపాటు ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ లాలో చదివింది. క్రికెటర్‌గానే కాకుండా పారిశ్రామికవేత్తగా 2013లో తన సోదరుడితో కలిసి ఆర్గోబ్లిస్‌ను ప్రారంభించింది.[6]

క్రికెట్ రంగం[మార్చు]

2006లో కర్ణాటక మహిళల క్రికెట్ జట్టులోకి వనిత అరంగేట్రం చేసింది.[8] కోచ్, మెంటార్ ఇర్ఫాన్ సైత్ ఆమెకు అవసరమైన క్రికెట్ నైపుణ్యాలను అందించడంలో కీలక పాత్ర పోషించారు. దిలీప్, నసీర్, అనంత్ దాంటే, రజిని ఇతర కోచ్‌లు కెరీర్‌లోని వివిధ దశలలో ఆటతీరును మెరుగుపరచడంలో సహాయపడ్డారు.[9]

మూలాలు[మార్చు]

  1. "Vellaswamy Vanitha". ESPN Cricinfo. Retrieved 2023-08-09.
  2. "Sri Lanka women tour of India 2014, 3rd WODI". ESPN Cricinfo. Retrieved 2023-08-09.
  3. "Sri Lanka women tour of India 2014, 1st WT20I". ESPN Cricinfo. Retrieved 2023-08-09.
  4. "VR Vanitha retires from all forms of cricket". ESPN Cricinfo. Retrieved 2023-08-09.
  5. Ghoshal, Shuvro (9 May 2016). "How Vellaswamy Vanitha turned a pastime into passion for the love of cricket". Sportskeeda. Retrieved 2023-08-09.
  6. 6.0 6.1 Hariharan, Shruti (29 May 2017). "Vanitha VR: A rebel who battled the odds". Cricket Country. Retrieved 2023-08-09.
  7. "I want to represent India in all three forms". 20 June 2017. Retrieved 2023-08-09.
  8. Hariharan, Shruti (29 May 2017). "Vanitha VR: A rebel who battled the odds". Cricket Country. Retrieved 2023-08-09.
  9. Cricfit (20 June 2017). "Exclusive interview with Vanitha VR: I want to represent India in all three formats". Cricfit. Retrieved 2023-08-09.

బయటి లింకులు[మార్చు]