Jump to content

వెళ్ళిపోమాకే

వికీపీడియా నుండి
వెళ్ళిపోమాకే
వెళ్ళిపోమాకే సినిమా పోస్టర్
దర్శకత్వంయాకూబ్ ఆలీ
నిర్మాతదిల్ రాజు
తారాగణం
ఛాయాగ్రహణంవిద్యాసాగర్
అఖిలేష్
కూర్పుఆలీ మహమ్మద్
సంగీతంప్రశాంత్ ఆర్ విహారి
నిర్మాణ
సంస్థలు
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
సాయి అఖిలేష్ ప్రొడక్షన్స్
విడుదల తేదీs
2 సెప్టెంబరు, 2017
సినిమా నిడివి
108 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

వెళ్ళిపోమాకే, 2017 సెప్టెంబరు 2న విడుదలైన తెలుగు రొమాంటిక్ డ్రామా సినిమా.[1][2] శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సాయి అఖిలేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి యాకూబ్ ఆలీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విశ్వక్ సేన్, నిత్యాశ్రీ రెడ్డి, సుప్రియ ప్రధాన పాత్రల్లో నటించగా, ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సమకూర్చాడు.

కథా సారాంశం

[మార్చు]

ఒక యానిమేషన్ కంపెనీలో ఉద్యోగి అయిన చందు (విశ్వక్ సేన్) అనే కుర్రాడు తన స్నేహితులంతా అమ్మాయిలతో ప్రేమలో ఉండి సంతోషంగా ఉండటం చూసి తానూ కూడా ఎవరినైనా ప్రేమిస్తే బాగుంటుందని ఆశపడుతుంటాడు. కానీ అతను దగ్గరవ్వాలనుకున్న అమ్మాయిలెవరూ అతని పట్ల ఆసక్తి చూపకపోవడంతో తనలో తానే బాధపడుతుంటాడు.

అలాంటి అతనికి ఒకరోజు ఫేస్ బుక్ లో శ్వేత అనే అమ్మాయి పరిచయమవుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. అలా చందు ప్రేమలోని సంతోషాన్ని, చిన్న చిన్న ఇబ్బందుల్ని అనుభవిస్తూఉండగానే ఒకరోజు ఉన్నట్టుండి శ్వేత అతన్ని విడిచి వెళ్ళిపోతుంది. దాంతో కంగారుపడ్డ చందు ఎంక్వైరీ చేయగా శ్వేత కావాలనే తనని వదిలిపోయిందని తెలుసుకుంటాడు. శ్వేత ఆలా చందుని వదిలిపోవడానికి కారణం ఏమిటి ? ఆమెకున్న సమస్య ఏంటి ? శ్వేత ఎడబాటుతో చందు ఎలా బాధపడ్డాడు ? చివరికి అతని జీవితం ఏమైంది ?అనేది మిగతా కథ.

నటవర్గం

[మార్చు]
  • విశ్వక్ సేన్ (చంద్రశేఖర్ అలియాస్ చందు)[3][4][5]
  • నిత్యశ్రీ (శ్వేత)
  • సుప్రియ (శృతి)
  • ప్రశాంత్ (కిషోర్)
  • శ్వేత (అనుష)
  • విద్య (దీప్తి)
  • పవన్ (రాజు)

నిర్మాణం

[మార్చు]

ఇది స్వతంత్ర చిత్రంగా నిర్మాణం ప్రారంభించబడింది.[6] ఈ చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్ చూసిన తర్వాత ఈ చిత్రాన్ని నిర్మించాలనే ఆసక్తిని దిల్ రాజు ప్రకటించాడు.[2]

పాటలు

[మార్చు]
Untitled

ఈ సినిమాకి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సమకూర్చాడు. సంగీత దర్శకుడిగా ప్రశాంత్ కి ఇది తొలి సినిమా. ఇందులోని పాటలను శ్రీసాయి కిరణ్ రాశాడు.[6][7]

  1. "ఎదో చేరుకుంది" - ముహీత్ భారతి
  2. "ఎలా ఎలా" - కమలజా రాజగోపాల్, కార్తీక్ రోడ్రిగెజ్
  3. "ఇలా నా జతగా" - ప్రశాంత్ ఆర్ విహారి
  4. "ఏమో యే వైపో" - అభయ్ జోధ్పూర్కర్
  5. "సైలెంట్ వైల్ అలప్" - అభిజిత్ రావు

విడుదల

[మార్చు]

"ఈ సినిమాలో నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ బాగుంది" అని ది హిందూ పత్రికలో రాశాడు.[4] టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ సినిమాకి 3/5 రేటింగ్ ఇచ్చింది.[3]

మూలాలు

[మార్చు]
  1. Pranita Jonnalagedda (27 February 2017). "Vellipomakey set to release". Deccan Chronicle.
  2. 2.0 2.1 Pranita Jonnalagedda (24 August 2017). "Vellipomakey finally set to release". Deccan Chronicle.
  3. 3.0 3.1 "Vellipomakey Movie Review {3/5}: Critic review of Vellipomakey by The Times of India". The Times of India. 2 September 2017.
  4. 4.0 4.1 Srivathsan Nadadhur (1 September 2017). "'Vellipomakey' review: Simple story told well". The Hindu.
  5. Neeshita Nyayapati (2 September 2017). "'Vellipomakey' movie review highlights: An ordinary first half promises an extraordinary conclusion". The Times of India.
  6. 6.0 6.1 Srivathsan Nadadhur (21 March 2017). "Prashanth R Vihari: Melting pot of genres". The Hindu.
  7. Neeshita Nyayapati (8 August 2018). "Rahul Ravindran reveals lyricist Sri Sai Kiran's work for 'Vellipomakey' inspired him to take him on-board for 'Chi La Sow'". The Times of India.

బయట లింకులు

[మార్చు]